హోం మంత్రిత్వ శాఖ

గాంధీ నగర్ లోక్ సభ నియోజకవర్గం పరిథిలో సింధు భవన్ రోడ్ లో మొక్కను నాటి, అహ్మదాబాద్ లో తొమ్మిది ప్రదేశాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా


వృక్షో రక్షతి రక్షితః - పర్యావరణాన్ని మనం కాపాడితే, మనల్ని పర్యావరణం కాపాడుతుంది

మొక్కలు నాటడం అనేది చూడడానికి చిన్నది గా ఉన్నప్పటికీ దాని ప్రభావం, పరిమాణం రెండూ చాలా విస్తృతంగా ఉన్నాయి, ఇది రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన మరియు దీర్ఘకాల జీవితాన్ని అందిస్తుంది

చెట్లను పరిరక్షించుకోపోతే మొత్తం ధరణి ఉనికి ప్రమాదంలోకి పడుతుంది

జనహితుడైన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ పర్యావరణ అవగాహన కోసం ప్రచారాన్ని ప్రారంభించారు మరియు సౌర శక్తి, పవన శక్తితో సహా అనేక కార్యక్రమాలను ప్రారంభించారు

గత ఏడు సంవత్సరాలలో, సౌర శక్తి, పవన శక్తి రంగాలలో భారతదేశం గణనీయమైన పురోగతి సాధించింది

ప్రపంచంలోని మొదటి ఐదు స్థానాల్లో భారత్‌కు స్థానం కల్పించడానికి చాలా చర్యలు చేపట్టాము

మనం పర్యావరణాన్ని జాగ్రత్తగా చూసుకుంటే, పర్యావరణం మనల్ని చూసుకుంటుంది - శ్రీ నరేంద్ర మోడీ తన చర్యలు, విధానాలు, తన కృషి ద్వారా ఈ ప్రాచీన భారతీయ సంస్కృతి ఫలాలను మనకు అందించారు

Posted On: 22 JUN 2021 4:26PM by PIB Hyderabad

కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు గాంధీనగర్ లోక్ సభ నియోజకవర్గంలో సింధు భవన్ రోడ్ వద్ద మొక్కను నాటడం ద్వారా అహ్మదాబాద్ లోని తొమ్మిది వేర్వేరు ప్రదేశాలలో చెట్ల మొక్కల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ అమిత్ షా మాట్లాడుతూ, చెట్ల మొక్కల పెంపకం కార్యక్రమం చిన్న స్థాయిలో ఉంది, కానీ దాని ప్రభావం మరియు పరిమాణం చాలా విస్తృతంగా ఉన్నాయి, ఇది రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన మరియు దీర్ఘకాలిక జీవితాన్ని అందిస్తుంది. చెట్లను జాగ్రత్తగా చూసుకోకపోతే, భూమి ఉనికి ప్రమాదంలో ఉంటుంది అని అన్నారు. 

 

పర్యావరణ అవగాహన కోసం ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలను ప్రారంభించారు, అలాగే సౌర శక్తి, పవన శక్తితో సహా అనేక ప్రచారాలను ప్రారంభించారని గత ఏడు సంవత్సరాలలో, సౌరశక్తి, పవన శక్తి రంగంలో భారతదేశం చాలా కృషి చేసిందని, ఇది భారత్ ను  ప్రపంచంలో ఐదవ స్థానానికి తీసుకెళ్లిందని శ్రీ అమిత్ షా అన్నారు దేశంలో 14 కోట్ల మందికి ఎల్‌పిజి సిలిండర్లను అందించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు మోడీ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో విద్యుత్ పొదుపు బల్బులను పంపిణీ చేసిందని ఆయన తెలిపారు.

మనం పర్యావరణాన్ని జాగ్రత్తగా చూసుకుంటే పర్యావరణం మనల్నికాపాడుతుందని  - శ్రీ నరేంద్ర మోడీ తన చర్యలు, విధానాలు, కృషి ద్వారా ఈ ప్రాచీన భారతీయ సంస్కృతి పాఠాలను అందించారు. మన ఉపనిషత్తులలో కూడా చాలా చోట్ల చెట్ల ప్రాముఖ్యతను చాల ప్రముఖంగా ప్రస్తావన ఉంది అని శ్రీ అమిత్ షా తెలిపారు. .

భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనూ అహ్మదాబాద్‌ను అత్యధిక హరిత రక్షణ కవచం ఉన్న నగరంగా మార్చాలని శ్రీ అమిత్ షా పిలుపునిచ్చారు, ఇది సాధ్యమేనని అన్నారు. ఇటీవల తుఫాను కారణంగా నగరంలో 5,000 చెట్లు ధ్వంసమయ్యాయని, ఈ నేపథ్యంలో నగర పరిపాలన చెట్ల పెంపకం లక్ష్యాన్ని 10 లక్షల నుంచి 15 లక్షలకు పెంచిందని శ్రీ షా అన్నారు. మూడు నాలుగు తరాలకు ఆక్సిజన్ అందించగల చెట్లను నాటడానికి ప్రయత్నాలు జరగాలని శ్రీ షా అన్నారు.

 

కార్బన్ డయాక్సైడ్ మరియు కార్బన్ మోనాక్సైడ్ ద్వారా ఓజోన్ స్థాయికి కలిగే నష్టాన్ని తగ్గించడంతో పాటు పీపాల్, మర్రి, వేప, జామున్ వంటి చెట్లను నాటడం గురించి శ్రీ అమిత్ షా మాట్లాడారు. చెట్ల ఔషధ లక్షణాల ప్రయోజనాలను వివరిస్తూ, గాంధీనగర్ లోక్ సభ నియోజకవర్గంలో 11 లక్షలకు పైగా చెట్లను సజీవంగా ఉండేలా  నిర్ణయించామని, దీని కోసం కార్మికులు, పౌరులు అందరూ పని చేయాల్సి ఉంటుందని శ్రీ అమిత్ షా అన్నారు. 

కోవిడ్-19 మహమ్మారి సమయంలో మొత్తం ప్రపంచంతో పాటు అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయని,  చాలా మంది తమ ప్రియమైన వారిని కోల్పోయారని తెలిపారు. శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో, దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ ఉచిత టీకాలు వేసే కార్యక్రమం  ప్రారంభించడం జరిగిందని,  ప్రతి ఒక్కరికి టీకాలు వేయించుకోవాలని కోరారు. ప్రతి వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నా, అందరికీ వ్యాక్సిన్ తీసుకోవడానికి ఏర్పాట్లు చేయాలని శ్రీ షా పిలుపునిచ్చారు. 

అహ్మదాబాద్ మేయర్, అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. 

 

***

 



(Release ID: 1729708) Visitor Counter : 141