రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం రెండు కాలుష్య నియంత్రణ వెస్సెల్స్ నిర్మాణానికి జీఎస్ఎల్‌తో ఎంఓడీ ఒప్పందం

Posted On: 22 JUN 2021 2:23PM by PIB Hyderabad

భార‌త తీర గ‌స్తీ బృందం (ఐసీజీ) కోసం రెండు కాలుష్య నియంత్రణ వెస్సెల్స్ (పీసీవీ) నిర్మాణానికి గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌తో (జీఎస్‌ఎల్) రక్షణ మంత్రిత్వ శాఖ జూన్ 22, 2021న రూ.583 కోట్లతో ఒక వ్యయ ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ స్పెషల్ రోల్ షిప్స్ దేశీయంగా అభివృద్ధి చేయ‌బ‌డి రూపొందించబడతాయి. ఇవి జీఎస్ఎల్ ద్వారా నిర్మించబడతాయి. రక్షణ మూలధన సేకరణకు అత్యధిక ప్రాధాన్యత కలిగిన వర్గమైన ‘భార‌త్‌లో త‌యారు చేసిన‌వి కొన‌డం - దేశీయంగా రూపొందించిన అభివృద్ధి చేసి తయారుచేసిన వ‌స్తువుల‌ను కొనండి (భారతీయ-ఐడీడీఎమ్ కొనండి)’ కింద ఈ కొనుగోల ప్రాధాన్య‌త క‌లిగి ఉంది. సాగరంలో చమురు స్పిప్లంగ్‌ వంటి విపత్తులకు స్పందించ‌డానికి ఐసీజీ సామర్థ్యాన్ని ఈ సముపార్జనను గణనీయంగా పెంచుతుంది. సాగ‌ర‌ కాలుష్యపు ప్రతిస్పందన‌ (పీఆర్) సామర్థ్యాన్ని కూడా ఇది పెంచుతుంది. ఈ రెండు వెస్సెల్స్‌ వరుసగా నవంబర్ 2024, మే 2025 నాటికి డెలివరీ చేయబడతాయి. ప్రస్తుతం, ఐసీజీ ముంబ‌యి, విశాఖపట్నం, పోరుబందర్లల‌లో మూడు పీసీవీలను కలిగి ఉంది. తద్వారా కాలుష్య పర్యవేక్షణలు, చమురు లీకుల‌ పర్యవేక్షణల‌/ ప్రతిస్పందన కార్యకలాపాలను భారత‌ ఈఈజెడ్, ద్వీపాల(ఐలాండ్‌ల‌) చుట్టూ నిర్వహిస్తుంది.
తూర్పు భార‌తం,  పర్యావరణ సున్నితమైన అండమాన్ మ‌రియు నికోబార్ ప్రాంతాలలో కాలుష్య ప్రతిస్పందన అవసరాల కోసం కొత్త పీసీవీలు ప్రణాళిక చేయబడ్డాయి. ఆపరేటింగ్ హెలికాప్టర్ ఆన్‌బోర్డ్ సామర్థ్యంతో ఓడలు సముద్రపు చమురు స్పిల్లేజ్‌ కలిగి ఉండటాన్ని నివారించేందుకు మరియు తిరిగి పొందటానికి, చెదరగొట్టడానికి సముచిత సాంకేతిక పరిజ్ఞానం యొక్క ఆధునిక పీఆర్ పరికరాలతో అనేక ఆధునిక లక్షణాలను కలిగి ఉంటాయి. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ యొక్క లక్ష్యాలను నెరవేర్చ‌డ‌మే కాకుండా.. ఈ ఒప్పందం దేశీయ నౌకా నిర్మాణ సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. దీనికి తోడు 200 మంది ఎంఎస్ఎంఈ విక్రేతలకు నౌకానిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలను పెంచుతుంది.

***


(Release ID: 1729557) Visitor Counter : 169