రైల్వే మంత్రిత్వ శాఖ
20 రోజుల రికార్డ్ వ్యవధిలో వల్సాడ్ రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబి)ని నిర్మించిన భారతీయ రైల్వేలు
ముంబై-ఢిల్లీ రహదారిపై వల్సాడ్ మార్గంలో వాహనాల రద్దీ నియంత్రణలో ఎదురైన సవాల్ ను అధిగమించి ఆర్‌ఓబి నిర్మాణం
కోవిడ్ రూపంలో సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ కొనసాగుతున్న సరకు రవాణా మార్గ నిర్మాణ పనులు
Posted On:
22 JUN 2021 3:34PM by PIB Hyderabad
పశ్చిమ సరకు రవాణా మార్గ నిర్మాణంలో భాగంగా వల్సాడ్ రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని 20 రోజుల రికార్డు వ్యవధిలో భారతీయ రైల్వే అనుబంధ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డిఎఫ్‌సిసిఐఎల్) పూర్తి చేసింది. గుజరాత్ రాష్ట్రంలో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ ఘనతను సాధించింది.
వివిధ ప్రభుత్వ సంస్థలు, పౌర యంత్రాంగం సహకారంతో డిఎఫ్‌సిసిఐఎల్ పశ్చిమ సరకు రవాణా మార్గంలో కీలకమైన ఆర్‌ఓబి నిర్మాణాన్ని పూర్తి చేసింది. ముంబై-ఢిల్లీ రహదారిపై వల్సాడ్ లో వాహనాల రద్దీ ఎక్కువ ఉంటుంది. ఆర్‌ఓబి నిర్మాణం కోసం 20 రోజులపాటు వాహనాలను నియంత్రించడానికి రైల్వే అధికారులు అనుమతి పొంది, నిర్ణీత వ్యవధిలో నిర్మాణ పనులను పూర్తి చేశారు.
సరకుల రవాణా కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న పశ్చిమ కారిడార్ లో దక్షిణ గుజరాత్ లోని వైతారాన - సచిన్ విభాగంలో వల్సాడ్ నగరంలో ఆర్‌ఓబిని దాటే అంశంలో సమస్య ఎదురయ్యింది. వివిధ కారణాల వల్ల ఆర్‌ఓబి నిర్మాణం ప్రారంభంకాలేదు. దీనితో పట్టాలను వేయడం సమస్యగా మారింది. రైలు పట్టాలను అత్యాధునిక న్యూ ట్రాక్ కన్స్ట్రక్షన్ (ఎన్‌టిసి) యంత్రాన్ని ఉపయోగించి వేస్తున్నారు. ముఖ్యమైన పనికి కలిగిన ఆటంకం నుంచి ఎలా బయటపడి పనిని చేపట్టాలన్న అంశంపై అధికారులు దృష్టి సారించి చర్చలు జరిపారు. సమస్య పరిష్కారానికి వినూత్న నిర్మాణానికి అధికారులు శ్రీకారం చుట్టారు.
దీనిలో భాగంగా 16మీటర్లు x 16 మీటర్ల పరిమాణంలో ముందుగానే నిర్మించిన రెండు ప్రీకాస్ట్ బాక్సులను ఆర్‌ఓబి రెండు వైపులా ఏర్పాటు చేసి దీనిలో నుంచి ట్రాక్ కన్స్ట్రక్షన్ (ఎన్‌టిసి) యంత్రం వెళ్లడానికి ఏర్పాట్లు చేసి 20 రోజులలో నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇక్కడ వాహనాల రూకపోకల రూపంలో అధికారులకు మరో సవాల్ ఎదురయ్యింది. ఢిల్లీ-ముంబై రహదారిలో ఉన్న వల్సాడ్ నగరంలోకి వాహనాలు పెద్ద సంఖ్యలో వచ్చి వెళ్తుంటాయి.
ప్రీకాస్ట్ బాక్సుల నిర్మాణం కోసం అధికారులు భారీ కసరత్తు చేశారు. లాక్ డౌన్ తో పాటు రవాణాపై ఆంక్షలు ఉన్నప్పటికీ దాదాపు 150 మంది సీనియర్ ఇంజినీర్లు సిబ్బంది వీటి నిర్మాణం పూర్తి చేశారు. అధికారుల నుంచి అందిన ప్రతిపాదన మేరకు వాహనాల రాకపోకలపై 20 రోజులపాటు ఆంక్షలు విధించడానికి వల్సాడ్ జిల్లా యంత్రాంగం ఆమోదం తెలిపింది.
ఆంక్షలు 02-06-2021 నుంచి 20 రోజులపాటు అమలులో వుంటాయని ప్రకటించారు. ప్రణాళిక ప్రకారం పనులు ప్రారంభించిన అధికారులు 300 నుంచి 500 ఎంటీల బరువు ఎత్తగల నాలుగు హెవీ డ్యూటీ హైడ్రాలిక్ క్రేన్ల సహకారంతో ముందుగా నిర్మించిన ప్రీకాస్ట్ దిమ్మలను ఏర్పాటు చేసి పనిని పూర్తి చేశారు. ఎక్కువ బరువు ఉండే ప్రీకాస్ట్ దిమ్మలను రవాణా చేసే సమయంలో సమస్యలు తలెత్తకుండా చూడడానికి అధికారులు స్టీల్ ప్లాట్‌ఫామ్‌తో అమర్చిన మల్టీ-యాక్సిల్ ట్రైలర్‌ను ఉపయోగించారు. పారిశ్రామిక ఆక్సిజన్ రవాణాపై దేశంపై నిషేధం అమలులో ఉన్నసమయంలో వల్సాడ్ ఆర్‌ఓబి నిర్మాణ కార్యక్రమాలు జరిగాయి. సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ అధికారులు క్లిష్టమైన పనిని సకాలంలో పూర్తి చేయడంలో విజయం సాధించారు.
ఉత్తరప్రదేశ్ లోని దాద్రి నుంచి ముంబై జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ (జెఎన్‌పిటి) వరకు సరకు రవాణా కోసం నిర్మిస్తున్న పశ్చిమ కారిడార్ హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర పశ్చిమ, తూర్పు సరకు రవాణా మార్గాల మీదుగా సాగుతుంది.
మహారాష్ట్ర పశ్చిమ సరకు రవాణా కారిడార్ లోని రువ్వారు- మదర్ మార్గంలో 306 కిలోమీటర్ల రహదారిని 07-01-2021న జాతికి అంకితం చేశారు. 369 కిలోమీటర్ల పొడవునా న్యూ పాలంపూర్ నుంచి కిషన్ ఘర్ మధ్య మార్గంపై ప్రయోగాత్మకంగా వాహనాలను అనుమతిస్తున్నారు. తూర్పు మార్గంలో 351 కిలోమీటర్ల న్యూ భాపూర్ - న్యూ ఖుర్జా విభాగం రహదారిని, మరియు ప్రయాగ్రాజ్‌లోని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్‌ను 29.12.2020 న జాతికి ప్రధాని అంకితం చేశారు. 2022 జూన్ నాటికి దాదాపు 2800 రూట్ కిలోమీటర్ల పొడవున తూర్పు పశ్చిమ (సోన్నగర్ - డంకుని పిపిపి విభాగాన్ని మినహాయించి)సరకు రవాణా మార్గం పనులు పూర్తి అవుతాయి.
ఇప్పటికే ప్రారంభం అయిన మార్గాల్లో 4000కి పైగా రైళ్లు నడిచాయి. వీటిలో తూర్పు మార్గంలో 3000 రైళ్లు నడవగా పశ్చిమ మార్గంలో 1000 రైళ్ల వరకు నడిచాయి. వీటి ద్వారా జిటికెఎం 3 మిలియన్ టన్నుల మార్కును దాటింది. ఈ విభాగంలోని కొన్ని రైళ్లు తూర్పు మార్గంలో సగటున గంటకి 99.38 కిలోమీటర్లు, పశ్చిమ మార్గంలో గంటకి 92 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి. ఈ వేగం మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగంతో పోల్చవచ్చు.
***
(Release ID: 1729444)
Visitor Counter : 203