ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

28 కోట్ల కోవిడ్ టీకా డోసుల మైలురాయి దాటిన భారత్ చికిత్సలో ఉన్న కేసులు మరింత తగ్గుతూ7,02,887 కు చేరిక


గత 24 గంటల్లో 53,256 కొత్త కేసులు; 88 రోజుల అత్యల్పం

39వ రోజునా కొత్త కేసులకంటే కోలుకున్నవారే అధికం
కోలుకున్నవారి శాతం 96.36% కు పెరుగుదల
రోజువారీ పాజిటివిటీ 3.83%; 14 రోజులుగా 5% లోపే

Posted On: 21 JUN 2021 11:16AM by PIB Hyderabad

టీకాల కార్యక్రమంలో భారతదేశం మరో కీలకమైన మైలురాయి దాటింది. దేశవ్యాప్తంగా ఇచ్చిన టీకా డోసులు 28 కోట్లు దాటాయి. ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం ప్రకారం 38,24,408 శిబిరాల ద్వారా  28,00,36,898 టీకా డోసుల పంపిణీ జరిగింది. నిన్న ఒక్క రోజులో  30,39,996 డోసుల పంపిణీ జరిగింది. వాటి వివరాలు:

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

1,01,25,143

రెండో డోస్

70,72,595

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,71,73,646

రెండో డోస్

90,51,173

18-44 వయోవర్గ

మొదటి డోస్

5,59,54,551

రెండో డోస్

12,63,242

45-59 వయోవర్గం

మొదటి డోస్

8,07,11,132

రెండో డోస్

1,27,56,299

60 ఏళ్ళు పైబడ్డవారు

మొదటి డోస్

6,47,77,302

రెండో డోస్

2,11,51,815

మొత్తం

28,00,36,898

 

ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా సార్వత్రిక టీకా కార్యక్రమం కొత్త దశలో ప్రవేశిస్తోంది. టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేస్తూ పరిధిని మరింత విస్తరిస్తోంది. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ఈరోజు లాంచనంగా ప్రారంభిస్తున్నారు.

గత 24 గంటలలో దేశవ్యాప్తంగా 53,256 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది 88 రోజుల అత్యల్పం. గత 14 రోజులుగా కేసుల సంఖ్య లక్షలోపే ఉంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కృషితో ఇది సాధ్యమైంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001Q1PC.jpg

చికిత్సలో ఉన్న కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం 7,02,887 మంది చికిత్సలో ఉన్నారు. గత 24 గంటలలో నికరంగా ఈ సంఖ్య 26,356 తగ్గగా, మొత్తం పాజిటివ్ కే సులలో చికిత్సలో ఉన్నవారు  2.35%

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0021S4P.jpg

 

కోవిడ్ నుంచి మరింత మంది కోలుకుంటూ ఉండటంతో కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే ఎక్కువగా ఉంటున్నారు. 39 రోజులుగా ఇదే పరిస్థితి ఉండగా గత 24 గంటలలో 78,190 మంది కోలుకున్నారు. ఇది అంతకు ముందు రోజు కంటే  24,934 కేసుల అదనం

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003NMXC.jpg

ఇప్పటిదాకా కోవిడ్ బారిన పడి కోలుకున్నవారు 2,88,44,199 మందికాగా, గత 24 గంతలలొ కోలుకున్నవారు 78,190 మంది. దీంతో ప్రస్తుతం కోలుకున్నవారి శాతం  పెరుగుతూ 96.36% కు చేరింది.  

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004L1C6.jpg

పరీక్షల సామర్థ్యం పెరగటంతో గత 24 గంటలలో 13,88,699 పరీక్షలు జరిగి మొత్తం 39,24,07,782 కి చేరాయి. పరీక్షలు పెరిగే కొద్దీ పాజిటివిటీ తగ్గుతూ వారపు పాజిటివిటీ  3.32% కు, రోజువారీ పాజిటివిటీ 3.83% కు చేరాయి. ఇలా 5% లోపు ఉండటం ఇది 14 వ రోజు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005ZI5V.jpg

 

***



(Release ID: 1728976) Visitor Counter : 199