కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

ఈ.పి.ఎఫ్.ఓ. పేరోల్ డేటా: 2021 ఏప్రిల్‌ నెలలో 12.76 లక్షల నికర చందాదారులు జోడించబడ్డారు

Posted On: 20 JUN 2021 5:09PM by PIB Hyderabad

2021 ఏప్రిల్‌ నెలలో ఈ.పి.ఎఫ్.ఓ. సుమారు 12.76 లక్షల నికర చందాదారులను చేర్చిన విషయాన్ని, 2021 జూన్, 20వ తేదీన ప్రచురించబడిన ఈ.పి.ఎఫ్.ఓ. తాత్కాలిక పేరోల్ డేటా ద్వారా, వెల్లడయింది.  కోవిడ్-19 మహమ్మారి రెండవ దశ కొనసాగుతున్నప్పటికీ, 2021 ఏప్రిల్ నెలలో, 13.73 శాతం నికర చందాదారుల పెరుగుదల నమోదైంది, అంతకుముందు నెలతో పోలిస్తే, 2021 ఏప్రిల్ నెలలో, 11.22 లక్షల మేర నికర చందాదారులు పేరోల్‌ కు చేర్చబడ్డారు.  2021 ఏప్రిల్ నెలలో నిష్క్రమణ ల సంఖ్య 87,821 మేర తగ్గగా, 2021 మార్చి నెలతో పోలిస్తే తిరిగి చేరిన సభ్యుల సంఖ్య 92,864 మేర పెరిగినట్లు, డేటా వివరాలు తెలియజేస్తున్నాయి. 

ఈ నెలలో చేరిన 12.76 లక్షల నికర చందాదారులలో, 6.89 లక్షల మంది కొత్త సభ్యులు, మొదటిసారి, ఈ.పి.ఎఫ్.ఓ. కి చెందిన సామాజిక భద్రత పరిధిలోకి వచ్చారు.  సుమారు 5.86 లక్షల మంది నికర చందాదారులు ఈ.పి.ఎఫ్.ఓ. నుండి నిష్క్రమించి, తరువాత ఈ.పి.ఎఫ్.ఓ. పరిధిలోని సంస్థల్లో ఉద్యోగాల్లో చేరడం ద్వారా ఈ.పి.ఎఫ్.ఓ. పరిధిలోకి తిరిగి వచ్చారు.   వీరు తుది పరిష్కారం కోసం ఎంచుకోవడం కంటే నిధుల బదిలీ ద్వారా సభ్యత్వాన్ని నిలుపుకోవటానికి ఎంచుకున్నారు. 

పే రోల్ డేటాను వయస్సు వారీగా పోల్చి చూస్తే, 22-25 సంవత్సరాల మధ్య వయస్సు వారు 2021 ఏప్రిల్ నెలలో అత్యధిక సంఖ్యలో సుమారు 3.27 లక్షల మంది  సభ్యులు కొత్తగా నమోదైనట్లు తెలుస్తోంది.  ఆ తర్వాత, 29-35 మధ్య వయస్సు గలవారు 2.72 లక్షల మంది సభ్యులుగా నమోదయ్యారు.  18-25 మధ్య వయస్సు గల వారు, సాధారణంగా ఉద్యోగంలో మొదటి సారి చేరినవారై ఉంటారు. 2021 ఏప్రిల్‌ నెలలో చేరిన మొత్తం నికర చందాదారులలో వీరు 43.35 శాతంగా ఉన్నారు. 

పే రోల్ గణాంకాల వివరాలను రాష్ట్రాల వారీగా పోల్చి చూస్తే, మహారాష్ట్ర, హర్యానా, గుజరాత్, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలకు చెందిన సంస్థలు, ఈ నెలలో సుమారు 7.58 లక్షల మంది సభ్యులను చేర్చుకోవడం ద్వారా ముందంజలో ఉన్నాయి.   ఈ రాష్ట్రాలలో అన్ని వయసుల వారి మొత్తం నికర పే రోల్ చేరిక 59.41 శాతంగా నమోదయ్యింది.  గత నెలతో పోల్చితే ఈశాన్య (ఎన్‌.ఈ) రాష్ట్రాలు, నికర చందాదారుల చేరికలో సగటు వృద్ధిని నమోదు చేశాయి. 

స్త్రీ, పురుషుల వారీగా పోల్చి చూస్తే,  ఈ నెలలో చేరిన మహిళా సభ్యుల సంఖ్య, మొత్తం నికర చందాదారుల సంఖ్యలో, సుమారు 22 శాతంగా నమోదయ్యింది.   2021 ఏప్రిల్‌ నెలలో  2.81 లక్షల మంది మహిళా సభ్యులు చేరడంతో, నికర మహిళా చందాదారుల సంఖ్యలో పెరుగుతున్న ధోరణి, నెలవారీ విశ్లేషణలో  వెల్లడయ్యింది.  2021 మార్చి నెలలో వీరి సంఖ్య  2.42 లక్షలుగా నమోదయ్యింది. అదేవిధంగా, మొదటిసారి ఈ.పి.ఎఫ్‌.ఓ. పరిధిలోకి వచ్చిన మహిళా చందాదారుల సంఖ్య కూడా, 2021 మార్చి నెలలో 1.84 లక్షలు గా ఉండగా, 2021 ఏప్రిల్‌ నెలలో ఈ సంఖ్య 1.90 లక్షలకు పెరిగింది. 

ఈ నెలలో చేరిన మొత్తం చందాదారులలో, ‘నిపుణుల సేవలు’ విభాగానికి చెందిన (మానవ వనరుల ఏజెన్సీలు, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, చిన్న కాంట్రాక్టర్లు మొదలైన వాటికి చెందిన) ఉద్యోగులు, 45 శాతం మంది ఉన్నట్లు,  పరిశ్రమల వారీగా విశ్లేషించిన, పేరోల్ వివరాలు, వెల్లడించాయి.   ఇదే విధంగా, ప్లాస్టిక్ ఉత్పత్తులు, బీడీలు తయారు చేసే సంస్థలు, పాఠశాలలు, బ్యాంకులతో పాటు, ఇనుము మరియు ఉక్కు రంగాలకు సంబంధించిన సంస్థలు, పరిశ్రమల్లో కూడా, గత నెల అంటే, 2021 మార్చి నెలతో పోలిస్తే, 2021 ఏప్రిల్ నెలలో చేరిన నికర చందాదారుల సంఖ్య, సగటు వృద్ధి కంటే ఎక్కువగా నమోదయ్యింది. 

పే రోల్ డేటా తాత్కాలికం ఎందుకంటే ఉద్యోగుల రికార్డుల నవీకరణ నిరంతర ప్రక్రియ కాబట్టి డేటా ఉత్పత్తి నిరంతర వ్యాయామం.  మునుపటి డేటా ప్రతి నెలా నవీకరించబడుతుంది.    2017 సెప్టెంబర్ నుంచి  మొత్తం పే రోల్ డేటా ను, ఈ.పి.ఎఫ్.ఓ., ఏప్రిల్, 2018 నుంచి క్రమం తప్పకుండా విడుదల చేస్తోంది.

*****



(Release ID: 1728871) Visitor Counter : 195