ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

అంతర్జాతీయ యోగాదినోత్సవం (జూన్ 21)సందర్భంగా దేశ ప్రజలందరికీ గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

प्रविष्टि तिथि: 20 JUN 2021 5:45PM by PIB Hyderabad

అందరికీ అంతర్జాతీయ యోగాదినోత్సవ శుభాకాంక్షలు. శారీరక ఆరోగ్యం, మానసిక సంతులనం పొందడంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు యోగాభ్యాసం ఉత్తమమైన మార్గం. కరోనా నేపథ్యంలో భారతీయ సంప్రదాయ జీవన విధానమైన యోగాను దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవాల్సిన అవసరముంది. 

 

వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలి. దీంతో వ్యక్తిగతంగా తద్వారా సమాజంలో శాంతి సామరస్యాలు, సుహృద్భావ వాతావరణం నెలకొంటాయని నేను బలంగా విశ్వసిస్తున్నాను.

***


(रिलीज़ आईडी: 1728805) आगंतुक पटल : 257
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Tamil