ఆయుష్

అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి


21న ప్రత్యక్ష ప్రసారం కానున్న కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా ప్రధానమంత్రి ప్రసంగం

యోగా దినోత్సవ నిర్వహణకు ప్రపంచ దేశాలు సిద్ధం

Posted On: 19 JUN 2021 4:07PM by PIB Hyderabad

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2021 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి. కోవిడ్-19 కారణంగా ఎక్కువ మంది ఒకచోట గుమి కూడదన్న ఆంక్షల నేపథ్యంలో 2021 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భిన్నంగా ఘనంగా జూన్ 21వ తేదీన నిర్వహించనున్నారు. 21వ తేదీ ఉదయం 6.30 గంటల నుంచి కార్యక్రమాన్ని అన్ని దూరదర్శన్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీఆయుష్ శాఖ సహాయ మంత్రి శ్రీ కిరెన్ రిజుజు కార్యక్రమంలో ప్రసంగిస్తారు. కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం ఉంటుంది. మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ యోగ ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా యోగా కార్యక్రమాలను నిర్వహించనున్నది

కోవిడ్ -19 కట్టడినివారణకు ప్రపంచ దేశాలు కృషి చేస్తున్న నేపథ్యంలో ఏడవ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరగనున్నది. కోవిడ్ తో సమస్యలను ఎదుర్కొంటున్న సమయంలో కూడా ప్రపంచ దేశాలు గతంలో మాదిరిగానే ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశాయి. గత కొన్ని వారాలుగా డిజిటల్ వార్తా సాధనాల్లో యోగాకి లభిస్తున్న ప్రాధాన్యత ఈ అంశానికి ప్రపంచ దేశాలు ఇస్తున్న ప్రాధాన్యతను వెల్లడిస్తున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా ప్రాధాన్యతను వివరిస్తూ అనేక సన్నాహక కార్యక్రమాలను నిర్వహించింది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా 2021 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యం కోసం యోగఅన్ని ఇతివృత్తంతో నిర్వహించనున్నారు. ప్రపంచంలోని దాదాపు 190 దేశాలు యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నాయి. యోగాపై ప్రజలకు అవగాహన కల్పించిప్రజలకు మరింత చెరువులోకి తీసుకుని రావాలన్న లక్ష్యంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ 1000కి పైగా సంస్థలతో కలసి అనేక కార్యక్రమాలను 

  నిర్వహించింది. విదేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు తమ తమ దేశాల్లో కార్యక్రమాలను సమన్వయం చేస్తున్నాయి. 

కోవిడ్-19 వల్ల నెలకొన్న పరిస్థితుల్లో ప్రజలు ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న సమయంలో ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం జరగనున్నది. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో యోగాకి ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన ఐక్యరాజ్య సమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహిస్తోంది. 2014 డిసెంబరులో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశం ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ తీసుకున్న చొరవతో ఐక్యరాజ్య సమితి ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. 2015 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి ఏటా జూన్ 21వ తేదీన ప్రజా కార్యక్రమంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ తీసుకున్న చొరవతో యోగాకి అంతర్జాతీయంగా ప్రాచుర్యం లభించింది. యోగా ప్రాధాన్యతను గుర్తించిన వివిధ దేశాల ప్రజలు దీనిని పాటిస్తున్నారు. ఉత్పాదకతను పెంచే సాధనంగా గుర్తింపు పొందిన యోగాలో అనేక నూతన అంశాలు చోటుచేసుకుంటున్నాయి. అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా అన్ని వయస్సుల వారి అవసరాలకు అనుగుణంగావ్యాధుల నివారణ ఆయుధంగా యోగాపై పరిశోధన అభివృద్ధి చోటుచేసుకుంటున్నాయి. 

కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రజలు ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారని గుర్తించిన ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ అంశానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రచార అవగాహనా కార్యక్రమాలను నిర్వహించింది. క్రమం తప్పకుండా యోగా చేస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్న అంశానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రసారం అయిన ఈ కార్యక్రమాలకు ఆరోగ్య నిపుణుల నుంచి సానుకూల స్పందన లభించింది. వైద్య సేవలకు అనుబంధంగా యోగాని చేర్చి దేశంలోని అనేక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారని సమాచారం అందుతోంది. 

గతంలో జరిగిన మాదిరిగానే2021 అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారు. 21వ తేదీ ఉదయం ఏడు గంటలకు యోగా ప్రదర్శన/నిర్వహణతో కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. 45 నిమిషాల పాటు క్రమపద్ధతిలో క్రమశిక్షణతో వీటిని నిర్వహిస్తారు. తమ ఇళ్లలో యోగా చేస్తూ లక్షలాది మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొడానికి సిద్ధమవుతున్నారు. దూరదర్శన్ ప్రసారం చేసే సూచనలను  పాటిస్తూ ప్రజలు యోగా చేయవచ్చును. యోగా ప్రదర్శనల తరువాత ఉదయం ఏడు గంటల నుంచి 45 నిమిషాలపాటు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రసంగిస్తారు. ఆ తరువాత 15 మంది యోగా గురువులుఆధ్యాత్మికవేత్తలు ప్రసంగిస్తారు. గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్సద్గురు జాగి వాసుదేవ్డాక్టర్ హెచ్ ఆర్ నాగేంద్రశ్రీ కమలేష్ పటేల్డాక్టర్ వీరేంద్ర హెగ్డేడాక్టర్ హంజాజీజయదేవశ్రీ ఒపి తివారి  , డాక్టర్ చిన్మయ్ పాండేముని శ్రీ సాగర్ మహారాజ్స్వామి భారత్ భూషణ్డాక్టర్ విశ్వస్ మండాలిక్సోదరి బికె  శివానీశ్రీ ఎస్. శ్రీధరన్ మరియు శ్రీమతి ఆంటోనిట్టే రోజిలు తమ సందేశాలను అందిస్తారు. 

ప్రపంచవ్యాపితంగా ప్రతి ఏడాది నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహక కార్యక్రమాలు మూడు నాలుగు నెలల ముందుగానే ప్రారంభం అవుతాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణతో యోగాని అనేక లక్షల మంది ప్రజలకు పరిచయం చేసి వారిలో అవగాహన కల్పించడం జరిగింది.

***


(Release ID: 1728744) Visitor Counter : 216