యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
క్రీడా పురస్కారాలు-2021 కోసం దరఖాస్తు గడువు తేదీని పొడిగించిన కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
Posted On:
18 JUN 2021 5:05PM by PIB Hyderabad
2021 సంవత్సరానికిగాను; రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న పురస్కారాలు, అర్జున పురస్కారం, ద్రోణాచార్య పురస్కారం, ధ్యాన్‌చంద్ పురస్కారం, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్, మౌలానా అబుల్ కలాం అజాద్ ట్రోఫీ కోసం నామినేషన్లు, దరఖాస్తులు ఆహ్వానిస్తూ గత నెల 20న కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటనలు ఇచ్చింది. ఈ ప్రకటనలను మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ www.yas.nic.in లో ఉంచింది.
ఈ నెల 21గా ఉన్న దరఖాస్తుల గడువు తేదీని ఈ నెల 28వ తేదీ వరకు మంత్రిత్వ శాఖ పొడిగించింది. అర్హత గల క్రీడాకారులు, శిక్షకులు, సంస్థలు, విశ్వవిద్యాలయాలు తమ దరఖాస్తులు లేదా నామినేషన్లను surendra.yadav[at]nic[dot]in లేదా girnish.kumar[at]nic[dot]in కు ఈమెయిల్ చేయాలని మంత్రిత్వ శాఖ సూచించింది. భారత ఒలింపిక్ సంఘాలు, భారత క్రీడాప్రాధికార సంస్థ, గుర్తింపు పొందిన జాతీయ క్రీడా సంస్థలు, క్రీడా ప్రోత్సాహక బోర్డులు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా ఈ సమాచారాన్ని మంత్రిత్వ శాఖ పంపింది. ఈ నెల 28 తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు.
******
(Release ID: 1728292)
Visitor Counter : 214