కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

భారతదేశంలోని యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడానికి కట్టుబడి ఉన్నామని గంగ్వార్ పునరుద్ఘాటించారు.


ఉద్దేశ ప్రకటన(స్టేమెంట్ ఆఫ్ ఇంటెంట్)పై కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ మరియు యూనిసెఫ్ సంతకాలు

Posted On: 17 JUN 2021 1:30PM by PIB Hyderabad

మహిళలు, బలహీనవర్గాలతోసహా భారతదేశంలోని యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర కార్మిక ఉపాధిశాఖ సహాయ మంత్రి(స్వతంత్ర బాధ్యతలు) సంతోష్ కుమార్ గంగ్వార్ పేర్కొన్నారు. విద్య, ఉపాధి మధ్య ఉన్నఅంతరాన్ని తగ్గించి, అవకాశాలను మెరుగుపర్చడం ద్వారా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా యువతను సిద్ధం చేసేందుకు ప్రభుత్వం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. నైపుణ్యాల అభివృద్ధి, ఉపాధి కల్పన, ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్స్ ద్వారా యువత అభ్యున్నతి కోసం అనేక పథకాలను చేపడుతున్నట్లు చెప్పారు.


ఉద్దేశ ప్రకటన(స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్)పై కార్మిక ఉపాధి మంత్రిత్వశాఖ, యూనిసెఫ్ సంతకాలు చేసిన సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేంద్ర కార్మిక ఉపాధిశాఖ సహాయ మంత్రి(స్వతంత్ర బాధ్యత) సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రసంగించారు.


ఉద్దేశ ప్రకటన(స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్)పై కార్మిక ఉపాధి మంత్రిత్వశాఖ, యూనిసెఫ్ గురువారం సంతకాలు చేసిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంత్రిత్వశాఖ, యూనిసెఫ్, అనుంబంధ సంస్థలను బలోపేతం చేయడం ద్వారా దేశ భవిష్యత్ రూపురేఖలను మార్చే అవకాశాలను యువతకు కల్పించాలని ఆశిస్తున్నామన్నారు. ఉపాధి సంబంధిత నైపుణ్యాలు పెంపొందించడం ద్వారా యువతను శక్తిమంతం చేయడానికి కార్మిక ఉపాధి మంత్రిత్వశాఖ, యూనిసెఫ్ మధ్య భాగస్వామ్యాన్ని గంగ్వార్ ప్రశంసించారు. యువత, విధాన రూపకర్తలతోసహా ఇతర భాగస్వాములు కలిసి పనిచేయడానికి, ఫీడ్బ్యాక్ యంత్రాంగాన్ని సులభతరం చేయడానికి ఇది ప్రారంభం మాత్రమేనని గంగ్వార్ పేర్కొన్నారు.
 
కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర ఛార్జ్)  సంతోష్ గంగ్వార్, కార్మిక ,ఉపాధి మంత్రిత్వశాఖ కార్యదర్శి అపుర్వ చంద్ర, యూనిసెఫ్ భారతదేశ ప్రతినిధి డాక్టర్ యాస్మిన్ అలీ హక్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

 

మంత్రి గంగ్వార్ మాట్లాడుతూ.. భారతదేశం యువకుల దేశమన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. దేశంలోని ప్రతి ఐదుగురిలో ఒకరు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసున్న యువకులేనన్నారు. యువత ఉపాధి, వృత్తి అవసరాలను తీర్చడానికి 2015లో నేషనల్ కెరీర్ సర్వీస్ను ప్రారంభించామని.. ఇది కెరీర్ కౌన్సెలింగ్, వృత్తిపరమైన మార్గదర్శకత్తం, నైపుణ్య అభివృద్ధి కోర్సుల సమాచారం, అప్రెంటిస్షిప్, ఇంటర్న్షిప్ వంటి ఉపాధి సంబంధిత అనేకరకాల సేవలను అందిస్తుందన్నారు.

 
కోవిడ్ -19, లాక్డౌన్ పరిణామాల కారణంగా కార్మికరంగంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి నేషన్ కెరీర్ సర్వీస్ అనేక కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి తెలిపారు. ఉద్యోగం కోసం అన్వేషించేవారికి, యజమానులకు మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఆన్లైన్ జాబ్ ఫెయిర్లు నిర్వహిస్తున్నారని చెప్పారు. అభ్యర్థి ఎంపిక నుంచి పోస్టింగ్ వరకు అంతా ఆన్లైన్లోనే పూర్తవుతోందన్నారు. వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాలు , ఆన్లైన్ శిక్షణల వంటి ఉద్యోగాలు కోరుకునేవారి కోసం ఎన్సీఎస్ పోర్టల్లో ప్రత్యేక లింక్ను ఏర్పాటు చేశారని, ఈ సౌకర్యాలన్నింటిని ఎన్సీఎస్ ఉచితంగానే కల్పిస్తోందని చెప్పారు.

భారతీయ యువత భవిష్యత్తును మరింత ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోనేలా, సాధికారత సాధించేలా రాబోయే మూడేళ్లలో యూనిసెస్, కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ గొప్ప విజయాలు సాధిస్తాయని గంగ్వార్ ఆశాభావం వ్యక్తం చేశారు.


ఈ కార్యక్రమంలో కార్మిక ఉపాధి మంత్రిత్వశాఖ కార్యదర్శి అపూర్వా చంద్ర, ప్రత్యేక కార్యదర్శి, డీఈజీ ఎంఎస్ అనురాధ,  యూనిసెఫ్ భారతదేశ ప్రతినిధి యాస్మిన్ అలీ హక్, మంత్రిత్వశాఖ, యూనిసెఫ్ ఇండియాకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

 

***



(Release ID: 1727979) Visitor Counter : 210