ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆదాయపన్ను విభాగం కొత్త పోర్టల్‌లో సమస్యలపై ఈ నెల 22న ఇన్ఫోసిస్‌తో కేంద్ర ఆర్థిక శాఖ సమావేశం
Posted On:
15 JUN 2021 8:22PM by PIB Hyderabad
ఆదాయపన్ను విభాగం కొత్తగా ప్రారంభించిన పోర్టల్‌లో సమస్యలు, ఇబ్బందులపై చర్చించేందుకు, కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారులు ఇన్ఫోసిస్ బృందంతో సమావేశం కానున్నారు. నెల 22న ఉదయం 11గం. నుంచి మధ్యాహ్నం ఒంటిగంట మధ్య ఈ సమావేశం జరగనుంది. ఐసీఏఐ, ఆడిటర్లు, కన్సల్టెంట్లు, పన్ను చెల్లింపుదారులు సహా సంబంధిత వర్గాల వారు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. కొత్త పోర్టల్‌లో ఎదురవుతున్న అవాంతరాలు పన్ను చెల్లింపుదారులకు సమస్యగా మారాయి. ఆ ఇబ్బందులపై సంబంధిత వర్గాల నుంచి రాతపూర్వక ఫిర్యాదులు, అభిప్రాయాలను కూడా ఇప్పటికే కోరారు. ఆ రాతపూర్వక స్పందనలకు ఇన్ఫోసిస్ బృందం సమాధానం చెప్పి సందేహాలు తొలగిస్తుంది. పోర్టల్ పనితీరుపై ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే, వాటిని పరిష్కరించి ఈ-ఫైలింగ్‌ను సులభతరం చేసేలా సమాచారాన్ని ఇన్ఫోసిస్ బృందం కోరుతుంది.
****
(Release ID: 1727401)
Visitor Counter : 205