వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ఆరోగ్యకరమైన జీవనాన్ని పెంపొందించ‌డానికి ఫోర్టిఫైడ్ రైస్ బ్రాన్ ఆయిల్‌ను ఆవిష్క‌రించిన భారత ప్రభుత్వపు నాఫెడ్


- భవిష్యత్తులో దేశీయ వంట నూనెల వినియోగానికి గాను విదేశీ దిగుమ‌తుల‌పై ఆధార‌ప‌డ‌డాన్ని త‌గ్గించేందుకు ఇది దోహ‌దం చేస్తుంది: కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్య‌ద‌ర్శి శ్రీ సుధాన్షూ పాండే

- నాఫెడ్ ఫోర్టిఫైడ్ రైస్ బ్రాన్ ఆయిల్ దేశీయ వంట నూనెల త‌యారీదారుల‌కు
మ‌రిన్ని అవ‌కాశాల‌ను అందించి.. ప్ర‌ధాన‌మంత్రి ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ చొర‌వ‌కు
ప్రేర‌ణ‌ను అందిస్తుందిః శ్రీ సుధాన్షూ పాండే

Posted On: 15 JUN 2021 3:59PM by PIB Hyderabad

కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖల‌ కార్యదర్శి శ్రీ సుధాన్షూ పాండే.. ఈ రోజు భార‌త ప్ర‌భుత్వ‌పు నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(నాఫెడ్) సంస్థ రూపొందించిన “ఫోర్టిఫైడ్ రైస్ బ్రాన్ ఆయిల్” వంట నూనెను ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా శ్రీ సుధాన్షూ పాండే మాట్లాడుతూ, నాఫెడ్ చేసిన ఈ ప్రయత్నం భవిష్యత్తులో దిగుమ‌తి చేసుకొనే వంట నూనెల‌పై.. దేశ వినియోగం ఆధార‌ప‌డ‌టాన్ని గ‌ణ‌నీయంగా త‌గ్గిస్తుంద‌ని వివ‌రించారు. నాఫెడ్ ఫోర్టిఫైడ్ రైస్ బ్రాన్ ఆయిల్.. దేశీయంగా వంట నూనెల‌ తయారీదారులకు మ‌రిన్ని కొత్త అవకాశాలను కల్పిస్తుందని, ప్రధాన మంత్రి ఆత్మ‌నిర్భర్ భారత్ చొరవకు కూడా ఉత్సాహాన్ని అందిస్తుందని వివ‌రించారు.
ఈ ఫోర్టిఫైడ్ రైస్ బ్రాన్ నూనెను నాఫెడ్ (నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) విక్రయిస్తుంది. భార‌త‌ ఆహార భ‌ద్ర‌త మ‌రియు ప్ర‌మాణాల ప్రాధికారిక సంస్థ‌(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ అరుణ్ సింఘాల్, నాఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సంజీవ్ కుమార్ చద్ధా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అతిష్ చంద్ర త‌దిత‌రులు ఈ-ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎఫ్‌సీఐ సంస్థ సీఎండీ మాట్లాడుతూ బలవర్థకమైన వ‌రి తౌడును
ఉత్పత్తి, మార్కెటింగ్ కోసం నాఫెడ్ మరియు ఎఫ్‌సీఐల మధ్య ఇటీవల ఒక అవగాహన ఒప్పందము కుదురిన‌ట్టుగా తెలిపారు. ఈ చొరవకు సంబంధించి, నాఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సంజీవ్ కుమార్ చద్దా మాట్లాడుతూ త‌మ ఈ ప్రయత్నం నాఫెడ్ బ్రాండెడ్ హై క్వాలిటీ రైస్ బ్రాన్ ఆయిల్‌కు సులువుగా అందుబాటులోకి తెచ్చేలా దోహ‌దం చేస్తుంద‌ని తెలిపారు. అంతేకాక‌ ఇది దేశీయ వంట నూనెల‌ పరిశ్రమకు కూడా త‌గిన తోడ్పాటును అందిస్తుందన్నారు.
బ‌హుళ ఆహార ప్ర‌యోజ‌నాలు..
రైస్ బ్రాన్ ఆయిల్ బహుళ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. త‌క్కువ
ట్రాన్స్-ఫ్యాట్ కంటెంట్ కార‌ణంగా కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంతో పాటుగా
అధిక మోనో అన్‌సాట్యూరెటెడ్ మరియు పాలీ అన్‌సాట్యూరెటెడ్ కొవ్వు పదార్థాల కారణంగా రైస్ బ్రాన్ ఆయిల్ బహుళ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
అధిక మొత్తంలో విటమిన్-ఈ కలిగి ఉన్నందున.. ఇది క్యాన్స‌ర్ ప్ర‌మాదాన్ని త‌గ్గించ‌డంలో  ఒక బూస్ట‌ర్‌గా ప‌ని చేస్తుంది. ఈ నూనెను అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మరియు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డ‌బ్ల్యుహెచ్ఓ) ఇతర వంట నూనెలకు ఉత్తమ ప్రత్యామ్నాయంగా సిఫార్సు చేశాయి. నాఫెడ్ నుండి వ‌చ్చిన ఈ రైస్ బ్రాన్ ఆయిల్‌లో అదనపు పోషకాలు, ఇత‌ర‌ విటమిన్లు ఉండేలా త‌గిన
జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రకారం విటమిన్లు A మరియు D లకు సిఫార్సు చేసిన ఆహారంలో 25-30 శాతం నెరవేర్చడానికి బలవర్థకమైన నూనె సహాయపడుతుంది. నాఫెడ్ ఫోర్టిఫైడ్ రైస్ బ్రాన్ ఆయిల్ అన్ని నాఫెడ్ స్టోర్లలో మరియు వివిధ ఆన్‌లైన్ వేదిక‌ల‌పై లభిస్తుంది.

                           

****



(Release ID: 1727371) Visitor Counter : 201