రైల్వే మంత్రిత్వ శాఖ

ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థ ద్వారా మరింత భద్రతను అందించడానికి తోడ్పడనున్న స్పెక్ట్రమ్ కేటాయింపులు


మానవ తప్పిదాల వల్ల జరుగుతున్న ప్రమాదాలను నివారించి, వేగాన్ని పెంచడానికి ఉపకరించే సిగ్నల్ బ్యాండ్ విడ్త్

మొదటిదశలో 37300 ఆర్ కిమీల మేర రైళ్లు ఒకదానితో ఒకటి ఢీ కొట్టకుండా నివారించే వ్యవస్థ ఏర్పాటు

ఇంతవరకు 2221 స్టేషన్ లలో ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ ( ఇఐ)ను నెలకొల్పిన రైల్వేలు

రానున్న మూడు సంవత్సరాలకాలంలో మరో 1550 ఇఎల్‌లను ఏర్పాటుచేయడానికి సన్నాహాలు

3447 రూట్ కిమీలలో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ ఏర్పాటు :ఎక్కువ రద్దీ ఉన్న మార్గాల్లో మరిన్ని రైళ్లను నడపడానికి అవకాశం

సరకుల రవాణా ఎక్కువగా జరుగుతున్న 15000 ఆర్ కిమీలలో యుద్ధప్రాతిపదికన ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు

లెవెల్ క్రాసింగుల వద్ద భద్రతకు రైల్వేల ప్రాధాన్యత : 11705 లెవెల్ క్రాసింగ్ గేట్లకు సిగ్నళ్లతో ఇంటర్ లాకింగ్ సౌకర్యం కల్పించిన రైల్వేలు

రైళ్లు, స్టేషన్లలో భద్రతా సౌకర్యాలను మెరుగుపరచడానికి రైల్వేలకు 700 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ లో 5 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ ను రైల్వేకు కేటాయించడానికి ఆమోదం తెలిపిన ప్రభుత్వం

ఒఎఫ్ సీ వ్యవస్థతో 92% మార్గాలను (62,205 ఆర్‌కెఎంలు) అనుసంధానం చేసిన

Posted On: 15 JUN 2021 3:50PM by PIB Hyderabad

రైల్వేభద్రతలో సిగ్నలింగ్ వ్యవస్థ కీలకంగా ఉంటుంది. భారతీయ రైల్వే తమ భద్రతా వ్యవస్థను నిరంతరం సమీక్షిస్తూ అవసరాలు, పరికరాల పరిస్థితి వనరుల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ఆధునీకరణ కార్యక్రమాలను అమలుచేస్తోంది.

రైళ్ల నిర్వహణలో భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, అదనంగా లైన్లను అందుబాటులోకి తీసుకుని రావడానికి భారతీయ రైల్వేలు  సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునీకరించడానికి ఈ కింది కార్యక్రమాలను అమలుచేస్తున్నాయి. 

1.    భద్రత ను మెరుగుపరచిసజావుగా కార్యక్రమాలు సాగేలా చూడడానికి  ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ (ఇఐ) ఏర్పాటు - రైళ్ల నిర్వహణలో  డిజిటల్ టెక్నాలజీల ప్రయోజనాలను పొందుతూ,  భద్రతను పెంచడానికి  ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థను పెద్ద ఎత్తున అమలుచేయడం జరుగుతోంది.30.04.2021 నాటికి 2221 స్టేషన్లకు   ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.  ఇది  భారతీయ రైల్వేలో  34%గా  ఉంది. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ (ఇఐ) ను అమలు చేయాలని  విధాన నిర్ణయం కూడా తీసుకోబడింది.  రాబోయే సంవత్సరాలలో 1550 ఇఐలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. దీనివల్ల  రైలు కార్యకలాపాల భద్రత మరియు సామర్థ్యాన్నిమరింత పెరుగుతుంది.

2.    లైన్ సామర్థ్యాన్ని పెంచడానికి ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ (ఎబిఎస్) వ్యవస్థ  -  ఎక్కువ రద్దీ ఉన్న మార్గాల్లో ఎక్కువ రైళ్లను నడపడానికి లైన్ సామర్థ్యాన్ని పెంచడానికి ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థ తోడ్పడుతుంది.  30.04.2021 నాటికి, 3447 రూట్ కి.మీ.లో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేస్తోంది.  రద్దీ ఎక్కువగా ఉన్న మరియు సరుకు రవాణా ఎక్కువగా జరుగుతున్న 15000  రూట్ కి.మీ  మార్గాల్లో ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటుచేయాలని రైల్వే  యోచిస్తోంది. యుద్ధప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఆటోమేటిక్ సిగ్నలింగ్ అమలుతో సామర్థ్యం పెరగడంతో పాటు ఎక్కువ రైలు సేవలు అందుబాటులోకి వస్తాయి.

3.    లెవల్ క్రాసింగ్ గేట్ల  వద్ద భద్రత - లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద భద్రతను పెంచే అంశానికి రైల్వేలు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. సిగ్నల్‌లతో లెవల్ క్రాసింగ్‌లను ఇంటర్‌లాక్ చేయడం ద్వారా భద్రత మెరుగుపడుతుంది. లెవల్ క్రాసింగుల వద్ద భద్రతను పెంచడానికి 30.04.2021 నాటికి భారత రైల్వే 11705 లెవల్ క్రాసింగ్ గేట్లను  సిగ్నళ్లతో తో ఇంటర్‌లాకింగ్ చేసింది.

4.    మానవ తప్పిదాలను నివారించడానికి లోకో పైలట్‌కు సహాయంగా ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ఎటిపి) వ్యవస్థ - లోకో పైలట్లకు సహాయంగా ప్రపంచంలోని ఆధునిక రైల్వే వ్యవస్థలు  ఎటిపి    వ్యవస్థలను ఉపయోగిస్తున్నాయి. లోకో పైలట్ చేసే మానవ పొరపాటు వల్ల రైళ్లు ఒకదానితో ఒకటి ఢీ కొట్టకుండా ఈ వ్యవస్థలు  నివారిస్తాయి. భద్రతను మెరుగుపరిచేందుకు ఎటిపి వ్యవస్థలను సాధ్యమైనంత వేగంగా అమలు చేయాలని రైల్వేలు నిర్ణయించాయి . ఇప్పటివరకు  ఎటిపి వ్యవస్థల కోసం విదేశీ సాంకేతిక పరిజ్ఞానంపై భారతీయ రైల్వేలు ఆధారపడ్డాయి.  భారతీయ సంస్థలతో కలిసి రైల్వేలు తక్కువ ఖర్చుతో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో  విజయవంతంగా ఎటిపిని అభివృద్ధి చేసింది.  దీనిని ట్రైన్ కొలిషన్ అవాయిడెన్స్ సిస్టమ్ (టిసిఎఎస్) అని పిలుస్తారు.ప్రధానమంత్రి ఇచ్చిన  'ఆత్మ నిర్భర్ భారత్మిషన్ లో భాగంగా  టిసిఎఎస్ ను భారత జాతీయ ఎటిపిగా అమలు చేయాలని  నిర్ణయించారు. 1 వ దశలో ముఖ్యమైన 37300 ఆర్‌కెఎమ్ మార్గాలలో  టిసిఎఎస్ ను అమలు చేయడం జరుగుతుంది .  టిసిఎఎస్ ను వినియోగించడం వల్ల రైళ్ల వేగం పెరిగి ప్రయాణ సమయం ఆదా అవడమే కాకుండా మానవ తప్పిదాల వల్ల జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి వీలవుతుంది. 

'ఆత్మనిర్భర్ భారత్మిషన్‌కు ప్రాధాన్యత ఇస్తూ  స్టేషన్లు  మరియు రైళ్లలో ప్రజల భద్రత మరియు భద్రతా సేవలను పెంపొందించడానికి  రైల్వేలకు 700 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లో 5 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ కేటాయించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఈ స్పెక్ట్రంతో  తన మార్గాలలో  దీర్ఘకాలిక పరిణామం (ఎల్‌టిఇ) ఆధారిత మొబైల్ రైలు రేడియో కమ్యూనికేషన్‌ను అందించాలని  భారతీయ రైల్వే  నిర్ణయించింది..

ఈ ప్రాజెక్టులో అంచనా రూ. 25,000కోట్లు.  రాబోయే సంవత్సరాలలో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది.
 

 రైల్వే కార్యకలాపాలు మరియు నిర్వహణ పాలనలో వ్యూహాత్మక మార్పును తీసుకుని వచ్చే ఈ వ్యవస్థ  భద్రతా ప్రమాణాలను మెరుగపరచడం, ప్రస్తుత మౌలిక సదుపాయాలను ఉపయోగించి ఎక్కువ రైళ్లను నడపడానికి లైన్ సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఆధునిక రైలు రవాణా వ్యవస్థ  వల్ల రవాణా వ్యయం తగ్గి రైల్వేల సామర్ధ్యం మెరుగుపడుతుంది. , 'మేక్ ఇన్ ఇండియామిషన్‌ కలను సాకారం చేయడమే కాకుండా  బహుళజాతి పరిశ్రమల పెట్టుబడులను ఆకర్షించి ఉపాధి అవకాశాలను కల్పించే  తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి అవకాశం కలుగుతుంది.

 భద్రత మరియు భద్రతా అవసరాల కోసం సురక్షితమైన మరియు నమ్మదగిన వాయిస్వీడియో మరియు డేటా కమ్యూనికేషన్ సేవలను అందుబాటులోకి తీసుకుని రావాలన్న లక్ష్యంతో  భారత రైల్వే కోసం ఎల్‌టిఇ ని ప్రవేశపెట్టాలని రైల్వేలు నిర్ణయించాయి. దీనిని కింది అవసరాల కోసం ఉపయోదించడం జరుగుతుంది :

·       ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్‌తో ఆధునిక  క్యాబ్ ఆధారిత  సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల రైళ్ల నిర్వహణలో  పూర్తి  భద్రత కలుగుతుంది.  పొగమంచు కురిసే సమయంలో ఇది సహాయకారిగా ఉంటుంది. 

·         డ్రైవర్గార్డ్స్టేషన్ మాస్టర్రైలు ట్రాఫిక్ కంట్రోలర్నిర్వహణ సిబ్బంది మధ్య రైలు నడిచే సమయంలో నిరంతరాయంగా మాట్లాడుకునే సౌకర్యాన్ని ఈ వ్యవస్థ అందిస్తుంది. 

·         ప్రయాణీకుల భద్రతను పెంచడానికి రైళ్లలోని సిసిటివి కెమెరాల ద్వారా మానిటరింగ్ లిమిటెడ్ వీడియో సర్వైలెన్స్ (లైవ్ ఫీడ్).

·         ఐఓటీ  ఆధారిత ఆస్తి పర్యవేక్షణముఖ్యంగా రవాణా అవుతున్న సరకుల పర్యవేక్షణ.

·         రైళ్లలో మరియు స్టేషన్లలో ప్రయాణీకుల సమాచార వ్యవస్థ (పిఐఎస్).

ఎల్‌టిఇతో పాటు రైల్వే టెలికాం లో అమలు జరుగుతున్న  ఇతర ప్రధాన కార్యక్రమాలు:

·         6002 స్టేషన్లలో వై-ఫై సౌకర్యం కల్పించబడింది. మిగిలిన 101 సాధ్యమయ్యే స్టేషన్లలో ఈ సౌకర్యం త్వరలో అందుబాటులోకి వస్తుంది. వీటిలో 70% స్టేషన్లు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి . ఈ సౌకర్యాన్ని ప్రయాణీకులుస్థానిక విక్రేతలుకూలీలు మొదలైనవారు ఉపయోగిస్తున్నారు.

·         భద్రతను మెరుగుపరచడానికి 801 స్టేషన్లలో సిసిటివి వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. మిగిలిన స్టేషన్లలో కూడా ఈ కార్యక్రమం అమలు జరుగుతుంది.

·         రైల్వే యొక్క 92% మార్గం ఓ ఎఫ్ సి ఆధారిత వ్యవస్థతో (62,205ఆర్ కిమీలు) అనుసంధాన చేయబడింది. రైల్వే అంతర్గత కమ్యూనికేషన్ కోసం ఇది ఉపయోగించబడుతోంది . మిగిలిన  సామర్థ్యాన్ని ఆర్‌సిఐఎల్ వాణిజ్యపరంగా ఉపయోగించుకుంటుంది.

·         భారత రైల్వే ఈ-ఫైలింగ్ వ్యవస్థను పెద్ద ఎత్తున అమలు చేస్తోంది. పరిపాలనా పనులను మెరుగుపరచడానికి అన్ని విభాగాలు, మండలాలు, సిటిఐలు మరియు పియులతో సహా 185 యూనిట్లలో ఇ-ఆఫీస్ విధానం అమలులో ఉంది. 1.35 లక్షలకు పైగా వినియోగదారులు దీనిని ఉపయోగిస్తున్నారు.  ఇప్పటి వరకు 15.0 లక్షలకు పైగా ఇ-ఫైల్ రూపుదిద్దుకున్నాయి . ఇప్పటికే ఉన్న భౌతిక ఫైళ్ళను డిజిటల్ ఫైళ్ళగా మారుస్తున్నారు.

సిగ్నలింగ్ మరియు టెలికమ్యూనికేషన్  ఆధునికీకరణ కోసం దాదాపు 55,000 కోట్ల రూపాయల పెట్టుబడి అవసరముంటుందని రైల్వేశాఖ అంచనా వేసింది. 

***



(Release ID: 1727370) Visitor Counter : 146