ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ టీకాలు – అపోహలు, వాస్తవాలు

Posted On: 15 JUN 2021 2:43PM by PIB Hyderabad

టీకాలు వేయించుకోవటానికి ముందుగా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్న తప్పానిసరి నిబంధన ఏదీ లేదు. 18 ఏళ్ళు పైబడ్డ ఎవరైనా నేరుగా దగ్గర్లో ఉన్న టీకా కేంద్రానికి వెళ్ళి అక్కడికక్కడే రిజిస్ట్రేషన్ చేయించుకొని అదే రోజు టీకా తీసుకోవచ్చు. మళ్లీ ఇంకోసారి రానక్కర్లేదు.

 

కోవిన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి అనేక మార్గాలుండగా కామన్ సర్వీస్ సెంటర్స్ అనేది ఒక ఐచ్చికం మాత్రమే. ఈ కార్యక్రమంలో సాయపడే ఆశా కార్యకర్తల వంటివారు గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ కూడా లబ్ధిదారులను సమీకరించి టీకా వేసే చోటనే రిజిస్ట్రేషన్ చేయించటంతోబాటు టీకాలు వేయిస్తారు.  అదే విధంగా 1075 ద్వారా రిజిస్ట్రేషన్ కు కూడా వీలు కల్పించారు.

 

కాబట్టి పైన పేర్కొన్న అన్ని పద్ధతులూ ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకొని చేసిన ఏర్పాట్లే. అందరికీ తీకాలు సులభంగా అందుబాటులో ఉండటం కోసం గ్రామీణ ప్రాంతాలకు అనుగుణంగా చేసినవే. జూన్ 13,2021 నాటికి 28.36 కోట్ల లబ్ధిదారులు కోవిన్ పోర్టల్ లో నమోదు చేసుకోగా అందులో 16.45 కోట్లు ( 58% మంది) ఆ విధంగా టీకా ప్రదేశంలో అక్కడికక్కడే రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారే ఉన్నారు. అదే విధంగా జూన్ 13 నాటికి ఇచ్చిన 24.84 కోట్ల టీకా డోసులలో  19.84 కోట్ల డోసులు (80%)ఆ విధంగా అక్కడికి వచ్చి వేయించుకున్నవారివే.

 

మే 1 నుంచి జూన్ 12 వరకు మొత్తం 1,03,585 కోవిడ్ టీకా కేంద్రాలలో  26,114 ఉప ఆరోగ్య కేంద్రాలలో ఉండగా, 26,287 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోను, 9,441 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలోను ఉన్నాయి.  ఇవన్నీ గ్రామీణ ప్రాంతాలలోని ఆరోగ్య కేంద్రాలే. ప్రజలు అక్కడికి నడుచుకుంటూ నేరుగా వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకొని వెంటనే టీకాలు వేయించుకునే వీలుంది.  మొత్తం కోవిన్ పోర్టల్ లే పేర్కొన్న  69,995 టీకా కేంద్రాలలో 49,883 కేంద్రాలు (71%) గ్రామీణ ప్రాంతాలలో ఉన్నవే.  కోవిన్ పోర్టల్ లో జూన్ 3న అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం గిరిజన ప్రాంతాల్లో  పరిస్థితి ఇలా ఉంది:

1.      గిరిజన జిల్లాలలో ప్రతి పదిలక్షల జనాభాలో టీకాలు వెసుకున్నవారు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్నారు.

2.      176 గిరిజిన జిల్లాలకు గాని 128 జిల్లాలో టీకాల పరిస్థితి బాగానే ఉంది.

3.      నేరుగా టీకా కేంద్రానికే వచ్చి టీకాలు వేయించుకున్నవారిలో గిరిజనులే మిగిలినవారికంటే సగటున ఎక్కువగా ఉన్నారు.

4.      టీకాలు వేస్తున్నవారిలో లింగ నిష్పత్తి కూడా గిరిజన జిల్లాలో మెరుగ్గా ఉంది.  

 

 అంశం

   జాతీయం

గిరిజన జిల్లాలు

 ప్రతి పది లక్షల జనాభాకూ డోసులు

1,68,951

1,73,875

పురుషులు:స్త్రీలు నిష్పత్తి

54 : 46

53 : 47

నేరుగా వచ్చినవారు : ఆన్ లైన్ టీకా

81     19

88:12

 

పైన ఉన్న గణాంకాలే గ్రామీణ, పట్టణ ప్రాంత టీకాల మీద ఉన్న అపోహలను తొలగిస్తాయి. కోవిన్ వ్యవస్థలో ఉన్న పారదర్శక సమాచారాన్ని, గ్రామీణ ప్రాంతాల్లో, మరీ ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో  సులువుగా సమాచారం ఎక్కించటానికి వీలున్న అవకాశాన్ని తెలియజేస్తుంది.  

 

*****



(Release ID: 1727317) Visitor Counter : 226