కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

సామాజిక భ‌ద్ర‌త కోడ్‌, 2020 కింద ఉద్యోగుల న‌ష్ట‌ప‌రిహారానికి సంబంధించిన ముసాయిదా నియ‌మాల ప్ర‌క‌ట‌న‌

Posted On: 15 JUN 2021 2:45PM by PIB Hyderabad

ఉద్యోగుల న‌ష్ట‌ప‌రిహారానికి సంబంధించిన ముసాయిదా నియ‌మాల‌ను సామాజిక భ‌ద్ర‌త కోడ్ ,2020 కింద 03.06.2021న వాటాదారుల సూచ‌న‌ల‌ను, అభ్యంత‌రాల‌ను ఆహ్వానిస్తూ భార‌త ప్ర‌భుత్వ కార్మిక‌, ఉపాధి మంత్రిత్వ శాఖ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. ముసాయిదా నియమాల నోటిఫికేష‌న్ జారీ అయిన 45 రోజుల లోప‌ల ఈ సూచ‌న‌ల‌ను, అభ్యంత‌రాల‌ను స‌మ‌ర్పించాలి. 
సామాజిక భ‌ద్ర‌త కోడ్‌, 2020 వ్య‌వ‌స్థీకృత‌, అవ్య‌వ‌స్థీకృత రంగాల‌కు చెందిన ఉద్యోగుల‌కు, కార్మికుల‌కు సామాజిక భ‌ద్ర‌త‌ను విస్త‌రించే ల‌క్ష్యంతో సామాజిక భ‌ద్ర‌త‌కు సంబంధించిన చ‌ట్టాల‌ను, స‌వ‌రించి సంఘ‌టితం చేస్తుంది. 
సామాజిక భ‌ద్ర‌త కోడ్ ,2020లోని అధ్యాయం VII (ఉద్యోగ‌ల‌కు న‌ష్ట‌ప‌రిహారం) ప్రాణాంత‌క‌మైన ప్ర‌మాదాలు, తీవ్ర‌మైన శారీర‌క గాయాలు లేదా వృత్తిప‌ర‌మైన వ్యాధులు వ‌చ్చిన‌ప్పుడు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించే బాధ్య‌త య‌జ‌మానిదేన‌నే ప్రొవిష‌న్ల‌కు సంబంధించిన అంశాల‌ను ప‌రిశీలిస్తుంది. 
కేంద్ర ప్ర‌భుత్వం నోటిఫై చేసిన ఉద్యోగుల న‌ష్ట‌ప‌రిహార నియమాలలో ముసాయిదా క్లెయిము లేదా సెటిల్ మెంట్‌కు సంబంధించి ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి, న‌ష్ట‌ప‌రిహారం చెల్లింపులో జాప్యం జ‌రిగితే దానిపై వ‌డ్డీ రేటు, కార్య‌క‌లాపాల వేదిక‌, అంశాల బ‌దిలీ, నోటీసు, ఒక స‌మ‌ర్ధాధికారి నుంచి మ‌రొక‌రికి బ‌దిలీ, న‌ష్ట‌ప‌రిహారంగా చెల్లించిన డ‌బ్బును బ‌దిలీ చేసేందుకు ఇత‌ర దేశాల‌తో ఏర్పాట్ల గురించిన అంశాలు ఉన్నాయి. 
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌, ఉద్యోగుల రాష్ట్ర బీమా కార్పొరేష‌న్‌, గ్రాట్యుటీ, ప్ర‌సూతి ప్ర‌యోజ‌నం, సామాజిక భ‌ద్ర‌త‌, భ‌వ‌నాలు ఇత‌ర నిర్మాణ కార్మికుల‌కు సంబంధించిన సెస్‌, అవ్య‌వ‌స్థీకృత రంగంలోని కార్మికుల‌కు, గిగ్ కార్మికుల‌కు, ప్లాట్‌ఫాం కార్మికుల‌కు  సామాజిక భ‌ద్ర‌తకు సంబంధించిన అంశాలు, ఉపాధి స‌మాచారాన్ని  సామాజిక భ‌ద్ర‌త కోడ్‌, 2020 కింద ముసాయిదా నియ‌మాలను 14.11.2020న ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. 
సామాజిక భ‌ద్ర‌త కోడ్ (ఉద్యోగుల న‌ష్ట‌ప‌రిహారం) (కేంద్ర‌) నియ‌మావ‌ళిని, 2021 (హిందీ, ఇంగ్లీషు భాష‌ల‌లో)https://labour.gov.in/whatsnew/draft-social-security-employees-compensationcentral-rules-2021-framed-inviting-objections అన్న  లింక్ ను క్లిక్ చేయ‌డం ద్వారా పొంద‌వ‌చ్చు. 

 

***


 



(Release ID: 1727300) Visitor Counter : 234