ఆర్థిక మంత్రిత్వ శాఖ
15సీఏ/15సీబీ ఆదాయపన్ను పత్రాల ఎలక్ట్రానిక్ దాఖలులో వెసులుబాటు
Posted On:
14 JUN 2021 5:47PM by PIB Hyderabad
ఆదాయపన్ను చట్టం-1961 ప్రకారం, 15సీఏ/15సీబీ ఫారాలను ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే దాఖలు చేయాలి. ప్రస్తుతం, పన్ను చెల్లింపుదారులు ఫారం 15సీఏను, ఫారం 15సీబీలో చార్టర్డ్ అకౌంటెంట్ సర్టిఫికెట్‌తో కలిపి ఈ-ఫైలింగ్ చేస్తున్నారు. విదేశీ చెల్లింపులు ఏమైనా ఉంటే, ఆ పత్రాన్ని అధీకృత డీలర్‌కు సమర్పించే ముందే వీటిని ఈ-ఫైలింగ్ చేస్తున్నారు.
ఫారం 15సీఏ, 15సీబీని ఎలక్ట్రానిక్ పద్ధతిలో సమర్పించడంలో పన్ను చెల్లింపుదారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, వాటిని భౌతిక రూపంలోనే అధీకృత డీలర్లకు సమర్పించే వెసులుబాటు కల్పించారు. ఇందుకు ఈ నెల 30 వరకు గడువిచ్చారు. విదేశీ చెల్లింపుల ప్రయోజనం కోసం అధీకృత డీలర్లు ఆ ఫారాలను ఈ నెల 30 వరకు అంగీకరించాలని సూచించారు. డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఇవ్వడానికి, ఈ ఫారాలను తర్వాతి తేదీలో అప్‌లోడ్ చేసే సౌకర్యాన్ని కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో కల్పిస్తారు.
***
(Release ID: 1727083)
Visitor Counter : 234