విద్యుత్తు మంత్రిత్వ శాఖ
హైడ్రోజన్ ఇంధన అణు ఆధారిత పైలట్ ప్రాజెక్టుల కోసం 'ఈవోఎల్' ఆహ్వానించిన ఎన్‌టీపీసీ
ఎన్‌టీపీసీ ప్లాంటు ఆవరణల్లో పైలెట్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆహ్వానం
Posted On:
14 JUN 2021 11:27AM by PIB Hyderabad
కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని, భారత్‌లోనే అతి పెద్ద సమీకృత విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన ఎన్‌టీపీసీ, తన ప్లాంటు ప్రాంగణాల్లో రెండు పైలెట్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయ 'ఆసక్తి వ్యక్తీకరణలను' (ఈవోఎల్) ఆహ్వానించింది. ఆ ప్రాజెక్టులు 'స్వతంత్ర ఇంధన అణు ఆధారిత బ్యాకప్ విద్యుత్ వ్యవస్థ', 'ఎలక్ట్రోలైజర్ ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తితో స్వతంత్ర ఇంధన అణు ఆధారిత మైక్రోగ్రిడ్ వ్యవస్థ'. ఈ ప్రాజెక్టుల ద్వారా పర్యావరణహిత, స్వచ్ఛ ఇంధనం ఉత్పత్తి దిశగా తన అడుగులను ఎన్‌టీపీసీ బలోపేతం చేసుకుంటుంది. ప్రాజెక్టుల అమలు, వాణిజ్యీకరణకు ఆయా సంస్థలకు సాయపడుతుంది.
విద్యుత్ కోసం హైడ్రోజన్ సాంకేతికతను వినియోగించాలన్న ఎన్‌టీపీసీ ప్రయత్నాల్లో ఈ ప్రాజెక్టులు భాగం. విద్యుత్ ప్లాంట్ ఫ్లూ గ్యాస్, హైడ్రోజన్ నుంచి విద్యుత్ విశ్లేషణ ద్వారా తీసుకున్న మెథనాల్ ఇంటిగ్రేటింగ్ కార్బన్ తయారీ కోసం సంస్థ ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. కార్బన్ సంగ్రహణం, గ్రీన్ హైడ్రోకార్బన్ సంశ్లేషణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఇది బలమైన అడుగు.
ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడానికి, బ్యాకప్ విద్యుత్ అవసరాల కోసం హైడ్రోజన్ ఆధారిత ఇంధన కణాలు-ఎలక్ట్రోలైజర్ వ్యవస్థల వినియోగాన్ని ఎన్‌టీపీసీ పరిశీలిస్తోంది. ప్రస్తుతానికి బ్యాకప్ విద్యుత్, మైక్రోగ్రిడ్ అవసరాలు డీజిల్ ఆధారిత విద్యుత్ జనరేటర్ల ద్వారా తీరుతున్నాయి. హైడ్రోజన్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాల ముందస్తు వినియోగపరంగా చూస్తే, డీజిల్ జనరేటర్లకు పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను రూపొందించడానికి ఎన్‌టీపీసీ కృషి చేస్తోంది.
***
(Release ID: 1726955)