భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం
కోవిడ్-19 ప్రాజెక్టులకు త్వరితగతిన ఆమోదిస్తున్న ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం : ఆసుపత్రుల విస్తరణ
Posted On:
13 JUN 2021 11:02AM by PIB Hyderabad
కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతున్న సమయంలో ఆసుపత్రుల్లో ఎదురవుతున్న మౌలిక సదుపాయాల కొరతను నివారించే అంశంలో మాడ్యులర్ ఆస్పత్రుల సేవలు ఉపశమనం కలిగిస్తున్నాయి. వినూత్నంగా రూపకల్పన జరిగిన మాడ్యులర్ ఆస్పత్రులను పనిచేస్తున్న ఆసుపత్రుల పక్కనే వాటి విస్తరణ ఆసుపత్రులుగా అందుబాటులోకి వస్తున్నాయి. వీటి నిర్మాణాన్ని చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం ప్రైవేట్ రంగ సంస్థలు, దాతలు,వ్యక్తులు, సంఘాల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. జాతీయ ప్రాధాన్యత కలిగిన మాడ్యులర్ ఆస్పత్రుల నిర్మాణంలో సహకరించాలని ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం కోరింది. కోవిడ్-19 నివారణ, వ్యాప్తిని నిరోధించడానికి వినూత్నరీతిలో కార్యక్రమాలను అమలు చేయవలసి ఉందని ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం గుర్తించింది. దీనిలోభాగంగా ఆసుపత్రుల విస్తరణ కార్యక్రమం రూపుదిద్దుకుంది. కోవిడ్-19 కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల్లో కనీసం 50 మాడ్యులర్ ఆస్పత్రులను నిర్మించవలసి ఉంటుందని ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం గుర్తించింది. మద్రాస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీలో అంకుర సంస్థగా ఏర్పాటైన మాడ్యులస్ హౌసింగ్ సంస్థ తక్కువకాలంలో నిర్మించడానికి వీలుగా మెడికాబ్ ఆసుపత్రులకు రూపకల్పన చేసింది. ఈ విధానంలో మూడు వారాల వ్యవధిలో పనిచేస్తున్న ఆసుపత్రికి విస్తరణగా 100 పడకలతో మాడ్యులర్ ఆసుపత్రిని నిర్మించవచ్చును. ప్రాణ రక్షణకు అవసరమైన అన్ని సౌకర్యాలు. వైద్య సౌకర్యాలతో ప్రత్యేకంగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల (ఐసియు)ను ఏర్పాటు చేయడానికి అనువుగా డిజైన్ ను అభివృద్ధి చేశారు. 25 సంవత్సరాల మన్నిక కలిగే ఈ మాడ్యులర్ ఆసుపత్రులను వారం రోజుల్లో అవసరమైన ప్రాంతాలకు తరలించవచ్చును. మాడ్యులర్ ఆసుపత్రులను నిర్మించడం ద్వారా దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, చిన్న నగరాల్లో వైద్య సేవల కొరతను అధిగమించడానికి అవకాశం కలుగుతుంది. దేశం వివిధ ప్రాంతాల్లో మాడ్యులర్ ఆసుపత్రుల నిర్మాణాన్ని చేపట్టడానికి సంస్థల సిఎస్ఆర్ నిధుల నుంచి సహకారం అందేలా చూడడానికి ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం ప్రయత్నిస్తున్నది.
అమెరికన్ ఇండియన్ ఫౌండేషన్, మాస్టర్ కార్డ్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, జెస్కాలర్, పిఎన్బి హౌసింగ్, గోల్డ్ మాన్ సాచ్స్, లెనోవా సహకారంతో మేడి క్యాబ్ ఆసుపత్రుల నిర్మాణాన్ని ప్రారంభించింది. నాస్కామ్ ఫౌండేషన్ ప్రాజెక్టుకు సిఎస్ఆర్ మద్దతును ప్రకటించింది. మొదటి దశలో బిలాస్‌పూర్ (ఛత్తీస్‌ఘర్) అమరావతి, పూణే, మరియు జల్నా (మహారాష్ట్ర); మొహాలి (పంజాబ్)లలో 100 పడకలతో ఆసుపత్రులు ఏర్పాటుకానున్నాయి. రాయ్‌పూర్ (ఛత్తీస్‌ఘర్) వద్ద 20 పడకల ఆసుపత్రి. బెంగళూరు (కర్ణాటక)లో ఈ తరహా ఆసుపత్రుల నిర్మాణానికి సన్నాహాలు సాగుతున్నాయి.
పంజాబ్ మరియు ఛత్తీస్‌ఘర్ లోని పలుప్రాంతాల్లో మాడ్యులర్ ఆస్పత్రులను నిర్మించడానికి సహకరించాలని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌ను పిఎస్‌ఎ కార్యాలయం కోరింది. గురుదాస్‌పూర్ మరియు ఫరీద్‌కోట్ (పంజాబ్) లోని 48 పడకల మాడ్యులర్ ఆసుపత్రుల పనులను టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ చేపట్టింది. ఛైటీస్‌ఘర్ లోని రాయ్‌పూర్, జష్‌పూర్, బెమెతారా, కాంకర్, గౌరెల్లాతో సహా పలు ఆసుపత్రులలో ఐసియు విస్తరణ కూడా జరుగుతోంది.
ఈ ప్రాజెక్ట్ వివరాలను industry-engagement[at]psa[dot]gov[dot]in నుంచి పొందవచ్చును.
వివిధ COVID-19 ప్రాజెక్టులపై వివరాలను https://www.psa.gov.in/innovation-science-bharat ద్వారా తెలుసుకోవచ్చును.
***
(Release ID: 1726819)
Visitor Counter : 216