ప్రధాన మంత్రి కార్యాలయం

జి7 సమిట్ ఒకటో అవుట్ రీచ్ సెశన్ లో పాలుపంచుకొన్న ప్ర‌ధాన మంత్రి

Posted On: 12 JUN 2021 11:07PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న జరిగిన జి7 సమిట్ ఒకటో అవుట్ రీచ్ సెశన్ లో పాల్గొన్నారు.

 
ఈ సమావేశాన్ని ‘బిల్డింగ్ బ్యాక్ స్ట్రాంగర్ - హెల్థ్’ శీర్షిక తో, కరోనావైరస్ ప్రపంచవ్యాప్త వ్యాధి నుంచి ప్రపంచం కోలుకోవడం పై, భవిష్యత్తు లో మహమ్మారుల కు వ్యతిరేకం గా ప్రపంచాన్ని బలపరచడం పై దృష్టి ని సారించి నిర్వహించడమైంది.

భారతదేశం లో కోవిడ్ ఇటీవలి వేవ్ సందర్భం లో జి7 తో పాటు ఇతర అతిథి దేశాలు అందించిన మద్దతు కు గాను ప్రధాన మంత్రి ఈ సమావేశం లో తన ప్రశంస ను వ్యక్తం చేశారు.

మహమ్మారి తో పోరాడే దిశ లో ప్రభుత్వం, పరిశ్రమ, పౌర సమాజం తాలూకు అన్ని స్థాయిల లోనూ జరిగిన ప్రయత్నాల ను కలగలపడం గురించి, దీనితో పాటు భారతదేశం అనుసరించిన ‘సంపూర్ణ సమాజం’ దృష్టికోణాన్ని గురించి ఆయన ప్రముఖం గా ప్రస్తావించారు.
 
కాంటాక్ట్ ట్రేసింగ్ కు, టీకామందు నిర్వహణ కు ఓపెన్ సోర్స్ డిజిటల్ టూట్స్ ను భారతదేశం విజయవంతం గా వినియోగించిన సంగతి ని గురించి కూడా ఆయన వివరిరంచారు.  భారతదేశం తన అనుభవాన్ని, ప్రావీణ్యాన్ని అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాల తో పంచుకొనేందుకు సుముఖం గా ఉందని ఆయన అన్నారు.

ప్రపంచ ఆరోగ్య పాలన ను మెరుగుపరచే దిశ లో జరుగుతున్న సామూహిక ప్రయాసల కు భారతదేశం సమర్ధన పట్ల ప్రధాన మంత్రి తన వచనబద్ధత ను వ్యక్తం చేశారు.  కోవిడ్ సంబంధి సాంకేతికత ల విషయం లో టిఆర్ఐపిఎస్ మాఫీ చేయాలంటూ భారతదేశం, దక్షిణ ఆఫ్రికా లు డబ్ల్యుటిఒ లో చేసిన ప్రతిపాదన ను జి7 సమర్ధించాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు.

నేటి సమావేశం ద్వారా పూర్తి ప్రపంచానికి ‘‘ఒక పృథ్వి, ఒకే ఆరోగ్యం’’ తాలూకు సందేశం వెళ్లాలి అని ప్రధాన మంత్రి అన్నారు.  రాబోయే కాలాల్లోల ప్రపంచవ్యాప్త వ్యాధుల ను అడ్డుకోవడం కోసం ప్రపంచ ఐకమత్యం, నాయకత్వం, సంఘీభావం అవసరం అని ప్రధాన మంత్రి పిలుపునిస్తూ, ఈ విషయం లో ప్రజాస్వామిక, పారదర్శి సమాజాలకు ప్రత్యేకమైన బాధ్యత అంటూ ఉండాలి అని నొక్కిచెప్పారు.

ప్రధాన మంత్రి రేపటి రోజు న జి7 సమిట్ తాలూకు ఆఖరి దినం నాటి రెండు సమావేశాల ను ఉద్దేశించి ప్రసంగిస్తారు.   

***(Release ID: 1726793) Visitor Counter : 136