ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 తాజా సమాచారం

Posted On: 12 JUN 2021 9:16AM by PIB Hyderabad

భారత్ లో చికిత్స పొందుతూ ఉన్న వారి సంఖ్య 63 రోజుల తరువాత 11లక్షల లోపుకు తగ్గి 10,80,690కు చేరాయి. 

గత 24 గంటల్లో చికిత్స పొందుతూ ఉన్న వారి సంఖ్య c 40,981 తగ్గింది.

దేశంలో గత 24 గంటల్లో 84,332 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది 70 రోజులు అత్యల్పం. 

2,79,11,384 మంది ఇప్పటికే కోలివుడ్ నుంచి కోలుకుని బైటపడ్డారు.

1,21,311 మంది బాధితులు గత 24 గంటల్లో కోలుకున్నారు. 

వరుసగా 30వ రోజు కూడా కొత్త కేసుల కంటే కోలుకున్నవారే అధికం. 

కోలుకున్న వారి శాతం పెరుగుతూ 95.07% చేరింది.

వారపు పాజిటివిటీ 5శాతం లోపుకు పడిపోయి ప్రస్తుతం 4.94%గా నమోదైంది.

రోజువారి పాజిటివిటీ 4.39% నమోదై, 19 రోజులుగా  10% లోపే ఉంటోంది.

పరీక్షల సామర్ధ్యం పెరుగుతూ వస్తోంది. ఇప్పటివరకూ 37.62 కోట్ల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు జరిగాయి.

దేశవ్యాప్త టీకాల కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 24.96 కోట్ల డోసుల టీకాల పంపిణీ పూర్తయింది. 

 

****



(Release ID: 1726470) Visitor Counter : 120