ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రసిద్ధ కన్నడ రచయిత డాక్టర్‌ సిద్దలింగయ్య మృతికి ప్రధానమంత్రి సంతాపం

प्रविष्टि तिथि: 11 JUN 2021 8:22PM by PIB Hyderabad

    ప్రసిద్ధ కన్నడ రచయిత డాక్టర్‌ సిద్దలింగయ్య కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా సందేశమిస్తూ- “విశిష్ట రచనలు, పద్యకవితలతోపాటు సామాజిక న్యాయం దిశగా డాక్టర్‌ సిద్దలింగయ్య చేసిన కృషి చిరకాలం గుర్తుండిపోతాయి. ఆయన మరణం నాకెంతో విచారం కలిగింది. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను... ఓం శాంతి” అని ప్రధాని పేర్కొన్నారు.

 

 

***

DS/SH


(रिलीज़ आईडी: 1726410) आगंतुक पटल : 158
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada