ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
హెచ్ ఐ వి/ఎయిడ్స్ నియంత్రణపై ఐరాస సర్వప్రతినిధి సభ
75వ సమావేశంలో డాక్టర్ హర్ష వర్ధన్ ప్రసంగం
హెచ్ ఐ వి మీద పోరులో మనందరిదీ ఒకటే మాట: డాక్టర్ హర్షవర్ధన్
“దాదాపు 14 లక్షలమందికి భారత్ యాంటీ రెట్రో వైరల్ చికిత్స ఉచితంగా అందిస్తోంది”
వచ్చే పదేళ్ళలో ఎయిడ్స్ కనుమరుగు కావాలంటే
హెచ్ ఐ వి వ్యాప్తి సున్నా అయ్యేలా చూడాలి
Posted On:
11 JUN 2021 10:27AM by PIB Hyderabad
75వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో వర్చువల్ పద్ధతిలో పాల్గొని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రసంగించారు. హెచ్ ఐ వి/ఎయిడ్స్ మీద సంస్థ నిర్ణయాన్ని అమలు చేసే కమిటీ చేసిన 75/260 తీర్మానం మీద ఆయన ప్రసంగించారు
ఆయన ప్రసంగం ఇలా సాగింది:
ఈరోజు ప్రతిష్ఠాత్మకమైన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ వేదికమీద మాట్లాడటం గౌరవప్రదంగా భావిస్తున్నాను. మా ప్రభుత్వం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినవారిని అభినందిస్తున్నాను. ఎయిడ్స్ మీద ఏర్పాటైన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో భారతదేశం పాలుపంచుకోవటం ఆనందం గాను, ప్రతిష్ఠాత్మకంగాను ఉంది. హెచ్ ఐ వి మహమ్మారి అదుపులోనే ఉందని అనిపించినప్పటికీ ఇలాంటి మహమ్మారులు మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది గనుక అత్యంత అప్రమత్తంగా ఉంటూ సకాలంలో నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
కోవిడ్ సంక్షోభ సమయంలో నిస్వార్థ సేవలందించినవారందరికీ ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఇలాంటి విపత్కర సమయంలో సైతం హెచ్ ఐ వి బాధితులకు వైద్య సేవలు నిత్యం కొనసాగేలా కృషి చేయటం చాలా గొప్ప విషయం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాఈ కరోనా సమయంలో మరణించిన హెచ్ ఐ వి/ ఎయిడ్స్ బాధితులకు నివాళులర్పిస్తున్నాను.
సంక్షోభానికి స్పందించిన తీరులో భారతదేశం తన బలమైన రాజకీయ నాయకత్వాన్ని ప్రదర్శిమ్చింది. అసమానతలను పరిష్కరించగలిగింది. పౌరసమాజాన్ని, అభివృద్ధి భాగస్వాములను భాగస్వాములను చేయటం ద్వార కోవిడ్ ప్రభావం హెచ్ ఐ వి బాధితులమీద పడకుందా భారత్ చాలా వేగంగా, సానుకూలంగా స్పందించింది. భారత్ లో 2017 నాటి హెచ్ ఐవి, ఎయిడ్స్ నిరోధక, నియంత్రన చట్టం బాధితులను కాపాడటానికి, మానవహక్కుల రక్షణ కలిగించటానికి ఒక చట్టపరమైన చట్రాన్ని రూపొందించింది.
భారతదేశందాదాపు 14 లక్షలమందికి యాంటీ రెట్రో వైరల్ చికిత్స అందిస్తోంది. ఆఫ్రికాలో ఎయిడ్స్ తో బాధపడే వారికి భారతదేసపు ఔషధాలు అందుతున్నాయి. సులభంగా చేరుకోలేని జనాభాకు, రిస్క్ ఉన్న జనాభాకు అందటానికి జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం విశేషంగా కృషి చేస్తోంది. హెచ్ ఐ వి బాధితులను క్రమంగా సురక్షితమైన యాంటీ రెట్రో వైరల్ మందుల వైపు నడిపిస్తున్నాం.
వైరల్ లోడ్ పరీక్షాకేంద్రాల సంఖ్య పెంచాం. తల్లి నుంచి బిడ్డకు సంక్రమించకుండా హెచ్ ఐ వి కౌన్సిలింగ్, పరీక్షలు, తొలిదశలోనే గుర్తించటం లాంటి సౌకర్యాలు పెంచాం. అందరి ఎదుగుదలకోసం కలసి పనిచేద్దామన్న భారత ప్రభుత్వ విధానానికి అనుగుణంగా జాతీయ ఎయిడ్స్ నియంత్రణ పథకం ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల సహకారం అందుకోవటానికి అవగాహనాఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ భయంకర వ్యాధితో బాధపడుతున్నవారిని 100% అందుకోవటానికి భారత్ కృషిచేస్తోంది.
పదేళ్లలో ఎయిడ్స్ ను సమూలంగా అంతం చేయాలన్న లక్ష్య సాధనకు ఇంకా కేవలం 115 నెలలే ఉండగా ముందుగా హెచ్ ఐ వి సంక్రమణను సున్నా స్థాయికి తీసుకురావాల్సిన అవసరం ఉందని గుర్తించాం. మా ముందు సుదీర్ఘ యాత్ర ఉంది. ఎదురయ్యే సవాళ్ళను ముందుగానే గుర్తించటం, లోపాలు భర్తీచేయటం, కార్యక్రమాన్ని మెరుగ్గా తీర్చిదిద్దటం, పరిజ్ఞానాన్ని ఇతరులకు పంచటం, మెరుగైన ఆచరణ విధానాలు అవలంబించటం ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించటం తక్షణ కర్తవ్యం. ఈ పోరులో మనందరిదీ ఉమ్మడి లక్ష్యం.
****
(Release ID: 1726226)
Visitor Counter : 251