గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

గిరిజన వర్గాలను సమగ్రంగా చేర్చడాన్ని ప్రోత్సహిస్తున్న - ప్రభుత్వ పథకాలు


దేశవ్యాప్తంగా గిరిజనుల జీవనోపాధిని పెంచే పథకాల మెరుగైన అమలును నిర్ధారించడానికి పార్లమెంటు సభ్యుల కోసం వెబినార్ నిర్వహించిన - ట్రైఫెడ్

Posted On: 10 JUN 2021 3:25PM by PIB Hyderabad

కోవిడ్-19 యొక్క ఈ సవాలు సమయంలో, దేశవ్యాప్తంగా గిరిజన ప్రజలకు ఆరోగ్య భద్రత తో జీవనోపాధి కల్పించడం గిరిజన సంక్షేమం మరియు జీవనోపాధి కోసం పనిచేస్తున్న నోడల్ ఏజెన్సీ అయిన ట్రైఫెడ్ కి మరింత ముఖ్యమైనది.  ఈ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని, గిరిజనుల సాధికారత కోసం ట్రిఫెడ్ అనేక ముఖ్యమైన కార్యక్రమాలను అమలు చేస్తోంది.  జూన్ 9, 2021 న, వివిధ పథకాల గురించి అవగాహన పెంచుకోవడానికి పార్లమెంటు సభ్యుల కోసం ట్రైఫెడ్ ఒక వెబ్నార్ నిర్వహించింది.  తద్వారా వాటి అమలు వేగవంతం అవుతుంది.  దేశవ్యాప్తంగా ఈ పథకాల కింద గిరిజన వర్గాలను సమగ్రంగా చేర్చడం సాధించవచ్చు. ఈ వెబీనార్‌లో - కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి, శ్రీ ఫగ్గన్ సింగ్; గిరిజన వ్యవహారాల శాఖ, మాజీ మంత్రి, శ్రీ జువల్ ఓరం; శ్రీ బిశ్వేశ్వర్ తుడు; డాక్టర్ లోర్హో ఫోజ్ ప్రభృతులతో సహా,  30 మందికి పైగా గిరిజన పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు. 

ఈ వెబీనార్‌లో ఎం.ఎఫ్.పి. మరియు వన్ ధన్ వికాస్ యోజన కోసం ఎం.ఎస్.పి. గురించి విస్తృతంగా తెలియజేయడం జరిగింది.  ఈ సందర్భంగా ప్రదర్శన మరియు చర్చ సమయంలో, గిరిజన ఆర్థిక వ్యవస్థలో చిన్న అటవీ ఉత్పత్తుల ప్రాముఖ్యత;  ఎం.ఎఫ్.పి. నేతృత్వంలోని గిరిజన అభివృద్ధి యొక్క సమగ్ర నమూనాను ప్రభుత్వం ఎలా రూపొందించింది; అనే విషయాలతో పాటు,  వాటి కోసం అమలు చేస్తున్న వివిధ పథకాల అమలు తీరును ప్రస్తావించడం జరిగింది.   గత కొన్ని సంవత్సరాలుగా - పునరుద్దరించబడిన "కనీస మద్దతు ధర (ఎం.ఎస్.పి) ద్వారా చిన్న అటవీ ఉత్పత్తుల (ఎం.ఎఫ్.పి) ల మార్కెటింగ్ కోసం యంత్రాంగం మరియు ఎం.ఎఫ్.పి. ల కోసం సరఫరా వ్యవస్థ అభివృద్ధి" విధానం, గిరిజన పర్యావరణ వ్యవస్థను ప్రభావితం చేసిన విషయాన్నీ, అదేవిధంగా, ప్రభుత్వ ప్రోత్సాహంతో, ఇది గిరిజన ఆర్థిక వ్యవస్థలో కోట్లాది రూపాయలను చొప్పించిన విషయాన్నీ, ఈ సమావేశంలో వివరించారు. గిరిజన ఉత్పత్తుల సేకరణదారులు, అటవీ నివాసులు, గిరిజన చేతివృత్తుల వారికి ఉపాధి కల్పించడానికి, ఈ  వన్ ధన్ గిరిజన అంకురసంస్థలు ఆధారంగా నిలిచాయి.

ముఖ్యంగా మహమ్మారి సమయంలో, ఈ ప్రణాళిక బలహీన వర్గాల వారికి ఒక గొప్ప వరంగా ఉంది.  గత 18 నెలల్లో,  భారతదేశం అంతటా రాష్ట్ర నోడల్ మరియు అమలు సంస్థల సహాయం తో  త్వరగా అమలు చేయడం తో, వన్ ధన్ వికాస్ యోజన అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. స్థాపించబడిన 80 శాతం వి.డి.వి.కె. లతో ఈశాన్య ప్రాంతం ముందు వరుసలో ఉంది.  ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తో సహా ఇతర రాష్ట్రాలు, ఈ పథకాన్ని అమలుచేసి, అధిక ఫలితాలను పొందుతున్నాయి. 

అంతేకాకుండా, ఈ పథకం యొక్క అతిపెద్ద ఫలితాలలో ఒకటి మార్కెట్ అనుసంధానాలను సృష్టించగలిగింది. ఈ వి.డి.వి.కె. లలో దేశవ్యాప్తంగా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ వి.డి.వి.కె. ల నుండి 500 కంటే ఎక్కువ రకాల ఉత్పత్తులను విలువ-జోడించడం, ప్యాక్ చేయడం మరియు విక్రయించడం జరుగుతోంది.  వీటిలో భాగంగా ఫ్రూట్ క్యాండీ (ఉసిరి, అనాస, అడవి ఆపిల్, అల్లం, అత్తి, చింతపండు); జామ్ (అనాస, ఉసిరి, రేగు); జ్యూస్ & స్క్వాష్ (అనాస, ఉసిరి, అడవి ఆపిల్, రేగు, బర్మా ద్రాక్ష); సుగంధ ద్రవ్యాలు (దాల్చిన చెక్క, పసుపు, అల్లం);  ఊరగాయలు (వెదురు షూట్, కింగ్ మిరప) తో సహా ప్రాసెస్ చేసిన ఆయుర్వేద వాన మూలిక "గిలోయ్" వంటి విస్తృత శ్రేణి ఉత్పత్తులన్నీ మార్కెట్‌ కు చేరుకున్నాయి. వీటికి అదనంగా, దేశంలోని గిరిజన సమూహాలు ఉత్పత్తి చేస్తున్న  25 వేల రకాల చేనేత వస్త్రాలు, హస్త కళాకృతులు కూడా ఉన్నాయి. ఇవన్నీ "www.tribesindia.com" అనే వెబ్-సైట్ ద్వారా మరియు దేశవ్యాప్తంగా విస్తరించిన 137 "ట్రైబ్స్ ఇండియా" దుకాణాల ద్వారా విక్రయించబడుతున్నాయి. 

వెబీనార్ సందర్భంగా, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రవీర్ కృష్ణ, మాట్లాడుతూ, "ఆత్మ నిర్భర్ భారత్" ను రూపొందించడానికి "గిరిజన ఉత్పత్తుల స్థానిక కొనుగోలు కోసం ప్రచారం" గురించి మాట్లాడారు, ఇది ఇప్పుడు ట్రైఫెడ్ కోసం ఒక ఉద్యమంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.   ఇది "సబ్ కా సాత్, సబ్ కా వికాస్" యొక్క ప్రభుత్వ మార్గదర్శక సూత్రానికీ,  విలువను పెంచడం ద్వారా సంస్థలను ప్రోత్సహించడానికి దేశంలో 50,000 వి.డి.వి.కె. లను ఏర్పాటు చేయాలన్న ప్రధానమంత్రి సంకల్పానికి,  అనుగుణంగా ఉంటుంది.  గిరిజన ఉత్పత్తుల మార్కెటింగ్, "మేరా వన్, మేరా ధన్, మేరా ఉద్యమం" అనే సందేశం చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది. వన్ ధన్ విధానం నుండి గిరిజన సంస్థల విధానానికి పరివర్తన కోసం ట్రైఫెడ్ పనిచేస్తోంది. ఈ వన్ ధన్ వికాస్ కేంద్రాలను వన్ ధన్ క్లస్టర్లు, సంస్థలుగా మార్చడం ద్వారా, ఆర్థిక వ్యవస్థలను సాధించడంతో పాటు, అధిక విలువతో కూడిన ఉత్పత్తులను ప్రోత్సహించడం దీని లక్ష్యం.

వన్ ధన్ వికాస్ కేంద్ర సమూహాలను మరింతగా మార్చడానికి, వివిధ మంత్రిత్వ శాఖలు మరియు సంస్థలతో కలిసి, ట్రైఫెడ్  పనిచేస్తోంది.  ఎం.ఎస్‌.ఎం.ఇ; ఎం.ఓ.ఎఫ్.పి.ఐ; గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖల వంటి వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన ఇదే తరహా కార్యక్రమాలతో ఈ పథకాన్ని కలపడానికి వీలుగా, ఆయా మంత్రిత్వ శాఖలతో ఇది అవగాహన ఒప్పందాలను కలిగి ఉంది.  ఫలితంగా వన్ ధన్ వికాస్ కేంద్రాలు మరియు దాని సమూహాలను - గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని, ఎం.ఎస్.ఎం.ఈ. కి చెందిన ఎస్.ఎఫ్.యు.ఆర్.టి.ఐ; మరియు ఈ.ఎస్.డి.పి. లతోనూ; అదేవిధంగా, ఎం.ఓ.ఎఫ్.పి.ఎల్. కి చెందిన ఫుడ్ పార్కుల పధకం మరియు ఎన్.ఆర్.ఎల్.ఎం. లతోనూ  కలవడం జరిగింది. 

ఈ వివరణాత్మక సారాంశం మరియు సమాచార వ్యాప్తి సమావేశ వివరాలను శ్రీ కృష్ణ క్రోడీకరిస్తూ, పార్లమెంటు సభ్యుల నాయకత్వం, ప్రోత్సాహం, పథకాల అమలును వేగవంతం చేయడానికి మద్దతు కోసం అభ్యర్థించారు.  ఈ సమావేశం అనంతరం, పరస్పర సంభాషణల ద్వారా, పార్లమెంటు సభ్యుల వ్యాఖ్యలు మరియు ప్రశ్నలను పరిష్కరించారు.  భవిష్యత్ సూచన మరియు అమలు కోసం వారి విలువైన సలహాలను కూడా గుర్తించడం జరిగింది.  పథకాలను అమలు చేయడంలో ట్రిఫెడ్ బృందం చేసిన కృషినీ, గిరిజన నియోజకవర్గాల్లో గమనించిన పురోగతినీ, పార్లమెంటు సభ్యులు ప్రశంసించారు.

ట్రైఫెడ్ బృందం వారితో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తుందనీ, ఈ పథకాలను ముందుకు తీసుకెళ్లేందుకు వారికి చేరువవుతుందనే, శ్రీ కృష్ణ వారికి హామీ ఇచ్చారు.

*****


(Release ID: 1726108) Visitor Counter : 381