రైల్వే మంత్రిత్వ శాఖ
రుతుపవనాల కాలంలో రైల్వేలు అప్రమత్తంగా ఉండాలి. ముంబయిలో మరింత అప్రమత్తత అవసరం.. శ్రీ పియూష్ గోయల్
వానాకాలంలో రైల్వేల సంసిద్ధతను సమీక్షించిన శ్రీ పియూష్ గోయల్
వర్షాకాలంలో రైల్వేలు అనుసరిస్తున్న సాంకేతిక, సివిల్ పనులపై ఐఐటీ ముంబై లాంటి సంస్థలతో కలసి అధ్యయనం చేయాలని సూచించిన మంత్రి
అంతరాయం లేకుండా సురక్షితంగా సర్వీసులను కొనసాగించడానికి వినూత్న పద్దతులను అనుసరించాలి-శ్రీ పియూష్ గోయల్
ప్రజలు, ప్రయాణీకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి
పట్టాలు నీటమునగకుండా చూడాలి- శ్రీ గోయల్
Posted On:
10 JUN 2021 7:18PM by PIB Hyderabad
రుతుపవనాల కాలంలో కురిసే వర్షాలవల్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా చూడడానికి అవసరమైన చర్యలను అమలు చేయాలి రైల్వేవాణిజ్య, పరిశ్రమ, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రి శ్రీ శ్రీ పియూష్ గోయల్ అధికారులను ఆదేశించారు. రుతుపవనాల రాక నేపథ్యంలో పరిస్థితిని ఎదుర్కోవడానికి ముంబై సబర్బన్ రైల్వే సిద్ధం చేసిన కార్యాచరణ కార్యక్రమాన్ని మంత్రి సమీక్షించారు.
ప్రమాదకర ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన మంత్రి రైళ్లను అంతరాయం లేకుండా సజావుగా నడపడానికి సిద్ధం చేసిన ప్రణాళికను పరిశీలించారు.
వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముంబై వాసులకు రైల్వే సేవలను అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.
సబర్బన్ రైళ్ల సంసిద్ధతను సమీక్షించిన మంత్రి వర్షాకాలంలో అమలు చేస్తున్న సాంకేతిక, సివిల్ పనుల సామర్ధ్యాన్ని ఐఐటీ ముంబై లాంటి సంస్థలతో కలసి అధ్యయనం చేయాలని సూచించారు.
అంతరాయం లేకుండా నిరంతరం రైళ్లు నడిచేలా చూడడానికి వినూత్నంగా ఆలోచించి తగిన కార్యక్రమాలను చేపట్టవలసిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.
కోవిడ్-19 పరిస్థితుల్లో కూడా 2,10,000 క్యూబిక్ మీటర్ల చెత్త/వ్యర్ధాలు/మట్టిని తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రికి అధికారులు వివరించారు. దీనికోసం ముంబైలో ప్రత్యేకంగా తయారుచేసిన ఈఎంయూ రైళ్లను ఉపయోగిస్తున్నారు.
గత వర్షాకాలంలో ముంపుకు గురైన ప్రాంతాలను గుర్తించి ఈసారి ఈ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలను అమలుచేయాలని నిర్ణయించారు. బాంద్రా, అంధేరి, మహిమ్, గ్రాంట్ రోడ్, గోరేగావ్ ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయని గుర్తించారు.
వర్షపాతం వివరాలను తెలియజేయడానికి భారత వాతావరణశాఖతో కలసి నాలుగు ఆటోమేటిక్ రెయిన్ గేజ్ లను నెలకొల్పిన పశ్చిమ రైల్వే స్వయంగా మరో 10 ఆటోమేటిక్ రెయిన్ గేజ్ లను ఏర్పాటు చేసుకుంది.
రైల్వే పట్టాలు , డిపోలలో నీటిని తొలగించడానికి ఏర్పాటు చేసిన మురుగునీరు మరియు సబ్మెర్సిబుల్ పంపుల సంఖ్యని 33% వరకు పెంచడం జరిగింది.
బోరివాలి విరార్ విభాగంలో కాల్వలను శుభ్రం చేయడానికి అమలు చేస్తున్న పనులను పర్యవేక్షిండానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. వంతెనలను శుభ్రం చేయడానికి సక్షన్/డి-స్లడ్జింగ్ యంత్రాలను ఉపయోగిస్తున్నారు.
నీరు ఎక్కువ సమయం నిల్వ ఉండకుండా చూడడానికి మైక్రో టన్నెలింగ్ పద్ధతిలో కల్వర్టుల నిర్మాణానన్ని చేపట్టారు. సమావేశంలో రైల్వే బోర్డు, ముంబై ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
***
(Release ID: 1726103)
Visitor Counter : 147