విద్యుత్తు మంత్రిత్వ శాఖ
సంపూర్ణంగా ఆరంభమైన పవర్ గ్రిడ్
భారత దేశపు తొలి విఎస్ సి ఆధారిత హెచ్ వి డి సి వ్యవస్థ
Posted On:
08 JUN 2021 4:53PM by PIB Hyderabad
భారత ప్రభుత్వపు విద్యుత్ మంత్రిత్వశాఖ పరిధిలోని మహారత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (పవర్ గ్రిడ్) తాజాగా అటూ ఇటుగా 320 కెవి తేడాతో ఉండే 2000 మెగావాట్ల మోనోపోల్-1 ను ఈ రోజు ప్రారంభించారు.
ఇది తమిళనాడులోని పుగలూరు, కేరళలోని త్రిసూర్ మధ్య పనిచేసే వోల్టేజ్ సోర్స్ కన్వర్టర్ (వి ఎస్ సి) ఆధారిత హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ ( హెచ్ వి డి సి) వ్యవస్థ. ఇది దక్షిణాది విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ కింద మోనోపోల్-2 ను ప్రధాని శ్రీ నరేంద్రమోదీ 2021 ఫిబ్రవరి 21న ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మోనోపోల్-1 ప్రారంభించటంతో ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యాన్ని సంతరించుకున్నట్టయింది.
ఇప్పుడు పూర్తి చేసిన పులగూర్-త్రిస్సూర్ హెచ్ వి డి సి సిస్టమ్ విలువ రూ. 5070 కోట్లు కాగా, ఇది రాయగఢ్-పులగూర్-త్రిస్సూర్ 6000 మెగావాట్ల హెచ్ వి డి సి వ్యవస్థలో భాగం. దీనివలన కేరళకు 2000 మెగావాట్ల బదలీకి వెసులుబాటు కలుగుతుంది.
అత్యాధునిక వి ఎస్ సి టెక్నాలజీ ని ఈ ప్రాజెక్ట్ ద్వారా భారత దేశానికి మొదటిసారిగా తెచ్చిన ఘనత పవర్ గ్రిడ్ కే దక్కుతుంది. సంప్రదాయ హెచ్ వి డి సి సిస్టమ్ తో పోల్చుకున్నప్పుడు దీనికి తక్కువ స్థలం సరిపోతుంది. భూమి తక్కువగా అందుబాటులో ఉన్నచోట ఇది బాగా ఉపయోగకరంగా ఉంటుంది. వివిధ నిర్వహణ పరిస్థితులమధ్య సర్దుబాటుకాగలిగే వెసులుబాటు దీనికి ఉంటుంది. కేరళలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఓవర్ హెడ్, అండర్ గ్రైండ్ కేబుల్స్ రెండింటినీ సమన్వయం చేసుకోగల సామర్థ్యం ఉండటం దీని ప్రత్యేకత.
ఇంటర్ ఫేస్ ట్రాన్స్ ఫార్మర్లు, ఐజిబిటి ఆధారిత పవర్ కన్వర్టర్లు, గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్, స్విచ్ గేర్, కంట్రోల్స్, రిలే పానెల్స్ లాంటి ఎసి పరికరాలను భారత్ లోని సంస్థలే అందజేశాయి. ఆ విధంగా ప్రధాని పిలుపునిచ్చిన మేకిన్ ఇండియా కు, ఆత్మ నిర్భర్ భారత్ కు ఊతమిచ్చినట్టయింది.
***
(Release ID: 1725465)
Visitor Counter : 221