నౌకారవాణా మంత్రిత్వ శాఖ

సముద్రయానదారులకు కోవిడ్ టీకాలు ఇవ్వ‌డంలో ప్ర‌భుత్వం ప్రాధాన్యత


సముద్రయానదారులకు రాష్ట్ర ‘ప్రాధాన్యతా జాబితాలో’ చేర్చినందుకు త‌న
కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవియా

Posted On: 05 JUN 2021 4:43PM by PIB Hyderabad

సముద్రయానదారులకు టీకాలు వేస్తున్న తీరు, ప‌రిస్థ‌తిని గురించి కేంద్ర ఓడ రేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రి (స్వంతంత్ర హోదా), రసాయనాలు, ఎరువుల శాఖ స‌హాయ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవియా సమీక్షించారు. టీకా వేయకపోవడం వల్ల సముద్రయాన పరిశ్రమకు ఎలాంటి ఆటంకం కలగకూడదని
మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవియా సూచించారు. షెడ్యూల్ విధుల‌లోకి చేరే ముందు నౌకాదళంకు టీకా వేయడానికి అన్ని ర‌కాల‌ ప్రయత్నాలు చేయాలని ఉద్ఘాటించారు. ప్రపంచ నౌకాదళ పరిశ్రమలో భారత దేశం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వారి పని యొక్క స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని టీకా డ్రైవ్‌లో సముద్రయానదారులకు త‌గిన 'ప్రాధాన్యత' ఇవ్వాలని అనేక ప్రాంతాల నుండి డిమాండ్లు వ‌స్తున్నాయి. కోవిడ్ టీకాల డ్రైవ్‌ విష‌యంలో  నౌకాదళాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి వీలుగా ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ (పీఎస్‌ అండ్ డబ్ల్యూ) కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖల‌తో చురుకుగా సమన్వయం చేస్తోంది. మంత్రిత్వ శాఖ ఇటీవల జోక్యం చేసుకోవడంతో, ప్రధాన ఓడరేవులు టీకా కేంద్రాలను ప్రారంభించారు. ముంబై పోర్ట్ ట్రస్ట్, కొచ్చిన్ పోర్ట్ ట్రస్ట్, చెన్నై పోర్ట్ ట్రస్ట్, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్, టుటికోరిన్ పోర్ట్ ట్రస్ట్ వంటి ఆరు ప్రధాన ఓడరేవులు తమ పోర్టు ఆసుపత్రిలో నౌకాదళాలకు టీకాలు వేయడం ప్రారంభించాయి. దీనికితోడు కేరళలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రీ నౌకాదళాలకు కోవిడ్ టీకాల‌ను వేసే కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. మాసా(ఎంఏఎస్ఎస్ఏ), ఫోస్మా (ఎఫ్ఓఎస్ఎంఏ) మరియు నుసి ( ఎన్‌యూఎస్ఏ) వంటి సీఫరింగ్ యూనియన్లు / అసోసియేషన్లు కూడా కోవిడ్‌-19 టీకా కోసం ప్రత్యేక శిబిరాలను విజయవంతంగా నిర్వహించాయి. ఈ చర్యలే కాకుండా నౌకాదళాలను తమ రాష్ట్ర 'ప్రాధాన్యత' జాబితాలో చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలను బోర్డులోకి తీసుకురావడానికి పీఎస్ అండ్ డబ్ల్యూ మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. కేరళ, తమిళనాడు మరియు గోవా ఇప్పటికే అలాంటి హోదాను అందించాయి. మ‌న సముద్రయానదారులకు కోవిడ్ టీకా  సౌకర్యం  కల్పించడానికి భారత ప్రభుత్వం అందివ‌స్తున్న ఎలాంటి అవ‌కాశాన్ని కూడా వద‌ల‌డంలేదు.

                               

*****


(Release ID: 1724849) Visitor Counter : 182