ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రపంచ పర్యావరణ దినం సందర్భం లో ప్రధాన మంత్రి  ప్రసంగం పాఠం

Posted On: 05 JUN 2021 3:15PM by PIB Hyderabad

కేంద్ర మంత్రివర్గం లోని నా సహచరులు శ్రీమాన్ నితిన్ గడ్ కరీ గారు, నరేంద్ర సింహ్ తోమర్ గారు, ప్రకాష్ జావడేకర్ గారు, పీయూష్ గోయల్ గారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు, గుజరాత్ లో ఖేడా పార్లమెంట్ సభ్యుడు దేవుసింగ్ జెసింగ్ భాయి చౌహాన్ గారు, ఉత్తర్ ప్రదేశ్ లోని హర్ దోయి పార్లమెంట్ సభ్యుడు భాయి జయ్ ప్రకాశ్ రావత్ గారు, పుణే మేయర్ మురళీధర్ మహౌల్ గారు, పింప్ రీ చించ్ వడ్ మ్యూనిసిపల్ కార్ పొరేశన్ మేయర్ సోదరి ఉషా గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఇతర మహానుభావులు మరియు ప్రియమైన నా సోదరులు, సోదరీమణులారా,

నేను మన రైతు సహచరుల తో మాట్లాడుతున్నప్పుడు, బయో ఫ్యూయల్ తో ముడిపడ్డ వ్యవస్థల ను వారు ఎలా సహజ రూపం లో అవలంబిస్తున్నదీ ఎంతో అద్భుతమైన పద్ధతి లో వెల్లడి చేయసాగారు.  అందులో విశ్వాసం కూడా కనుపించసాగింది.  స్వచ్ఛ శక్తి -క్లీన్ ఎనర్జీ- గురించి దేశం లో ఇంత భారీ ప్రచార ఉద్యమం నడుస్తున్నప్పుడు దాని తాలూకు చాలా పెద్ద ప్రయోజనం దేశ వ్యవసాయ రంగాని కి అందడమనేది స్వాభావికమే.  ఈ రోజు న, ప్రపంచ పర్యావరణ దినం సందర్భం లో, భారతదేశం మరో పెద్ద అడుగు ను వేసింది.  ఇథెనాల్ రంగం అభివృద్ధి కి వివరణాత్మక మార్గసూచీ ని ఈ రోజు న విడుదల చేసే భాగ్యం నాకు దక్కింది.  దేశవ్యాప్తం గా ఇథెనాల్ ఉత్పత్తి కోసం, ఇథెనాల్ పంపిణీ కోసం మహత్వాకాంక్షకలిగిన ఇ-100 ప్రయోగాత్మక పథకాన్ని కూడా పుణే లో ప్రారంభించడమైంది.  పుణే ప్రజల కు ఈ సందర్భం లో నేను అభినందనలను తెలియజేస్తున్నాను.  పుణే మేయర్‌ కు కూడా ఇవే నా అభినందన లు.  మనం మన నిర్ణీత లక్ష్యాల ను అనుకున్న కాలానికే సాధించగలిగాం.  దీనికి గాను నేను చాలా చాలా శుభాకాంక్షలను వ్యక్తం చేస్తున్నాను.

మిత్రులారా ,

మీరు గమనించినట్లయితే, ఈ రోజు నుంచి 7-8 సంవత్సరాల క్రితం, దేశం లో ఇథెనాల్ చాలా అరుదు గా చర్చ కు వచ్చేది.  ఎవరూ దీనిని గురించి చర్చించే వారే కాదు.  ఒకవేళ చర్చ జరిగినప్పటికీ, వాడుక లో మాట్లాడుకొనే విషయం లాగానే మాట్లాడేసే వారు.  కానీ ఇప్పుడు ఇథెనాల్ 21 వ శతాబ్దపు భారతదేశం లోని గొప్ప ప్రాధాన్యతల తో జతపడింది.  ఇథెనాల్ పై శ్రద్ధ తో పర్యావరణానికి తోడు రైతు ల జీవనంపై సైతం ఒక మంచి ప్రభావం ప్రసరిస్తోంది.  ఈ రోజు న మనం పెట్రోల్ లో 20 శాతం ఇథెనాల్ ను కలిపే లక్ష్యాన్ని 2025 వ సంవత్సరానికల్లా పూర్తి చేయాలని సంకల్పం తీసుకొన్నాం; మొదట లక్ష్యాన్ని గురించి ఆలోచించినప్పుడు. దీనిని 2030 వ సంవత్సరం నాటికి మనం సాధించాలనుకున్నాం.  కానీ గత కొద్ది రోజులు గా విజయాలు సాధించిన విధానం, ప్రజల నుంచి లభించిన మద్దతు లతో ప్రజల లో చైతన్యం వచ్చింది.  మరి ప్రతి ఒక్కరు దీని మహత్వాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు.  ఈ కారణం గా ఇప్పుడు మనం 2030 వ సంవత్సరం లో చేయాలనుకున్న దానిని, 5 సంవత్సరాలు తగ్గించి వేసి 2025 వ సంవత్సరానికల్లా చేయాలనే నిర్ణయాన్ని తీసుకొన్నాం. ఐదేళ్ల ముందుగానే.

సహచరులారా,

ఇంత పెద్ద నిర్ణయం తాలూకు నిబ్బరం, గత 7 సంవత్సరాల లో దేశం సాధించిన లక్ష్యాలు, దేశం చేసిన ప్రయత్నాలు, అది సాధించిన విజయాల ద్వారా అందింది.  ఆ కారణం గానే ఈ రోజు న నిర్ణయం చేసే ధైర్యం సమకూరింది.  2014 వ సంవత్సరం వరకు, భారతదేశం లో సగటు న 1.5 శాతం ఇథెనాల్ మిశ్రణం మాత్రమే జరిగేది.  నేడు ఇది దాదాపు గా ఎనిమిదిన్నర శాతానికి చేరుకొంది.  2013-14 లో దేశం లో 38 కోట్ల లీటర్ల ఇథెనాల్ ను కొనుగోలు చేయడం జరిగేది.  అదే ఇప్పుడు ఇది 320 కోట్ల లీటర్ల కు పైగా ఉంటుందని అంచనా.  అంటే దాదాపు ఎనిమిది రెట్లు ఎక్కువ గా ఇథెనాల్ ను కొనుగోలు చేయడం జరిగిందన్న మాట.  కిందటి ఏడాదే చమురు మార్కెటింగ్ కంపెనీ లు సుమారు 21,000 కోట్ల రూపాయల విలువైన ఇథెనాల్‌ ను కొనుగోలు చేశాయి.  ఖర్చు చేసిన 21,000 కోట్ల రూపాయల లో పెద్ద మొత్తం ఇప్పుడు దేశ రైతు ల జేబుల లోకి వెళ్లింది.  ముఖ్యం గా మన చెరకు రైతులకు దీనితో చాలా లాభం కలిగింది. 2025 వ సంవత్సరానికల్లా పెట్రోల్ లో 20 శాతం ఇథెనాల్ ను కలపడం సాధ్యపడుతుందో,  అది జరిగినప్పుడు చమురు కంపెనీల నుంచి నేరు గా రైతుల కు ఎంత పెద్ద మొత్తం లో డబ్బు అందుతుందో మీరు ఊహించవచ్చు.  దీనితో, చక్కెర అధిక ఉత్పత్తి తో ముడిపడ్డ సవాళ్లు కూడా కలిసి ఉన్నాయి; ఎందుకంటే కొన్ని సార్లు అధిక ఉత్పత్తి జరుగుతుంది.  అలా జరిగినప్పుడు ప్రపంచం లో ఎలాంటి కొనుగోలుదారు ఉండరు.  దేశం లోనూ ధర లు తగ్గుతాయి. అతి పెద్ద సవాలు ఉత్పత్తి; మరి దానిని ఎక్కడ ఉంచాలో అనేది కూడా సంక్షోభం గా మారుతుంది.  అటువంటి సవాళ్లన్నిటినీ తగ్గించడం లో, మరి దాని ప్రత్యక్ష ప్రయోజనం చెరకు రైతు భద్రత తో ముడిపడుతుంది.  చాలా ప్రయోజనాలు లభించబోతున్నాయి.

సహచరులారా,

21 వ శతాబ్ద కాలపు భారతదేశానికి, 21వ శతాబ్ది తాలూకు ఆలోచన, ఆధునిక విధానాల ద్వారానే శక్తి లభించగలుగుతుంది.  ఇదే ఆలోచన తో మా ప్రభుత్వం ప్రతి రంగం లో నిరంతరం విధాన నిర్ణయాలను తీసుకొంటోంది.  ఇథెనాల్ ఉత్పత్తి, ఇథెనాల్ కొనుగోళ్ల కోసం అవసరమైన మౌలిక సదుపాయాల నిర్మాణానికి చాలా ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరుగుతోంది.  ఇప్పటి వరకు, చాలా ఇథెనాల్ ను తయారు చేసే యూనిట్ లు ఎక్కువ గా చక్కెర ఉత్పత్తి అధికం గా ఉన్న 4-5 రాష్ట్రాలలోనే ఉన్నాయి.  ఈ యూనిట్ లను యావత్తు దేశం లో వ్యాప్తి చేయడం కోసం కుళ్ళిన అన్నం ఉన్న చోట్ల దానిని ఉపయోగించుకొంటూ ఫూడ్ గ్రెయిన్ బేస్డ్ డిస్టిలరీల ను ఏర్పాటు చేయడం జరుగుతోంది.  వ్యవసాయ వ్యర్థాల నుంచి ఇథెనాల్ ను ఉత్పత్తి చేయడం కోసం దేశం లో అత్యాధునిక సాంకేతికత ఆధారిత ప్లాంటుల ను కూడా స్థాపించడం జరుగుతోంది.

సహచరులారా,

జలవాయు పరివర్తన తాలూకు అపాయాలను ఎదుర్కోవడానికి జరుగుతున్న ప్రపంచ ప్రయత్నాల లో భారతదేశం ఒక ఆశా కిరణం గా మారింది.  మానవజాతి శ్రేయస్సు కోసం విశ్వసనీయ భాగస్వామి రూపం లో భారతదేశం తనకంటూ ఒక గుర్తింపు ను తెచ్చుకొంది.  ప్రపంచం ఒకప్పుడు భారతదేశాన్ని ఒక సవాలు రూపం లో చూసింది; జలవాయు పరివర్తన భారతదేశం లోని ఇంత పెద్ద జనాభా ను దృష్టి లో పెట్టుకొంటే సంక్షోభం ఇక్కడి నుంచే వస్తుందని భావించింది.  ఈ రోజు న స్థితి మారిపోయింది.  ఇవాళ మన దేశం జలవాయు సంబంధి న్యాయం తాలూకు మార్గదర్శి గా ఎదుగుతోంది.  ఇది ఒక భయానక సంకటానికి వ్యతిరేకం గా ప్రధానమైన శక్తి గా మారుతోంది.  వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్ (ఒక సూర్యుడు, ఒక సృష్టి, ఒక గ్రిడ్) తాలూకు వ్యవస్థ అనే విజన్ ను సాకారం చేసే ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్ ను నిర్మించడం కావచ్చు, లేదా కొయలిశన్ ఫార్ డిజాస్టర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తాలూకు చొరవ కావచ్చు- భారతదేశం ఒక భారీ ప్రపంచ దృష్టికోణం తో ముందుకు సాగుతున్నది. జలవాయు పరివర్తన సంబంధి ప్రదర్శన సూచీ లో భారతదేశం ప్రపంచం లోని అగ్రగామి 10 దేశాల లో ఇవాళ తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొంది.

సహచరులారా,

జలవాయు పరివర్తన కారణంగా ముందుకు వస్తున్న సవాళ్ల పట్ల భారతదేశం అప్రమత్తం గా ఉంది. అంతే కాదు, ఆ విషయం లో చురుకు గా పనిచేస్తోంది కూడా.  మనం ఒక పక్క, గ్లోబల్ సౌత్‌ లో ఎనర్జీ జస్టిస్ తాలూకు సున్నితత్వాని కి మరియు గ్లోబల్ నార్త్ తాలూకు ఉత్తరదాయిత్వానికి సమర్థకులంగా కూడా ఉన్నాం.  మరో పక్క, మనదైన భూమిక ను నిర్వహించడం లో పూర్తి గంభీరత ను అవలంబిస్తున్నాం.  భారతదేశం ఎనర్జీ ట్రాన్సిశన్ తాలూకు ఎటువంటి మార్గాన్ని ఎంచుకొందీ అంటే ఆ మార్గం లో మన విధానాలు, నిర్ణయాల లో కఠినమైన అంశాలకే కాకుండా మృదువైన అంశాల కు కూడా సమానమైన ప్రాధాన్యం ఉంది.  నేను హార్డ్ కాంపోనెంట్ ను గురించి మాట్లాడాల్సి వస్తే, అటువంటప్పుడు భారతదేశం ద్వారా ఖరారు చేయబడిన పెద్ద పెద్ద లక్ష్యాలు కావచ్చు, వాటిని అమలు చేయడం లో ఇదివరకు ఎరుగనంతటి వేగం కావచ్చు, వాటిని ప్రపంచం చాలా నిశితంగా పరిశీలిస్తోంది.  6-7 సంవత్సరాలలో, నవీకరణ యోగ్య శక్తి తాలూకు మన సామర్థ్యం 250 శాతానికి పైగా పెరిగింది.  స్థాపిత నవీకరణ యోగ్య శక్తి సామర్థ్యం పరం గా భారతదేశం నేటి కాలం లో ప్రపంచం లోని అగ్రగామి 5 దేశాల లో ఒక దేశం గా ఉంది.  ఇందులో కూడా సౌర శక్తి సామర్థ్యాన్ని గడచిన 6 సంవత్సరాలలో దాదాపు 15 రెట్ల మేరకు పెంచుకొంది.  ప్రస్తుతం భారతదేశం, గుజరాత్‌ లోని కచ్ఛ్ ఎడారి లో ప్రపంచం లోకెల్లా అతి పెద్దదైనటువంటి సౌర మరియు పవన శక్తి పార్కు ను నిర్మిస్తున్నది.  అలాగే భారతదేశం 14 గిగావాట్ సామర్థ్యం కలిగినటువంటి పాతదైన బొగ్గు ప్లాంటులను మూసివేసింది కూడా.   దేశం మృదు విధానం తో ఇటువంటి చారిత్రక చర్యల ను తీసుకొంది.  ప్రస్తుతం, దేశం లోని సామాన్య మానవులు పర్యావరణ అనుకూల ప్రచారం లో భాగస్తులు అయ్యారు; వారు దీనికి నాయకత్వం వహిస్తున్నారు.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించిన అవగాహన ఎలా ఏర్పడిందో మనం గమనించుదాం.  ప్రజలు  వారిదైన పద్ధతి లో కొంచెం కొంచెం గా ప్రయత్నాలను చేస్తున్నారు.  ఇంకా చాలా చేయవలసిన అవసరం ఉంది. కానీ విషయాన్ని గ్రహించడం, ప్రయాసలను మొదలుపెట్టడం అయితే జరిగింది.  మా సముద్రపుటొడ్డుల ను శుభ్రపరచడం సంగతి ని చూడండి- యువకులు చొరవ తీసుకొని ఈ పని ని చేస్తున్నారు. లేదంటే స్వచ్ఛ్ భారత్ వంటి ప్రచారాలు కానివ్వండి- వీటిని దేశం లోని సామాన్య మానవులు వారి భుజాలకు ఎత్తుకొన్నారు.  వారు దీనిని వారి బాధ్యత గా స్వీకరించారు.  మరి నా దేశవాసులు ఈ రోజు న దీనిని ముందుకు తీసుకువెళ్లారు.  దేశం లో 37 కోట్ల కు పైగా ఎల్‌ఇడి బల్బులు మరియు 23 లక్షల పైచిలుకు శక్తి ని ఆదా చేయగలిగిన పంకాలను ఇచ్చిన కారణం గా పర్యావరణాన్ని పరిరక్షించడానికి చేసిన కృషి ని గురించిన చర్చించే అలవాటు బహుశా ప్రజల కు తప్పిపోయింది.  కానీ అది చాలా పెద్ద చర్చనీయాంశం కావాలి.  అదేవిధంగా, ఉజ్వల యోజన లో భాగం గా, కోట్ల కొద్దీ కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ లభించడం వల్ల, సౌభాగ్య యోజన లో భాగం గా విద్యుత్ కనెక్షన్ లభించడం వల్ల ఇదివరకు పొయ్యి లో కట్టెల ను మండించి పొగ చూరిన బతుకు ను జీవించవలసి వచ్చేది; ఇవాళ అటువంటి వారు ఇలా కట్టె ల మీద ఆధారపడటం గణనీయం గా తగ్గింది.  దీని ద్వారా కాలుష్యం తగ్గడమే కాకుండా ఆరోగ్యం, మన తల్లుల, వారి పిల్లల స్వస్థత పర్యావరణ సంరక్షణ దిశ లో భారీ తోడ్పాటు కూడా లభించింది.  కానీ దీని గురించి కూడా పెద్ద గా చర్చ ఏమీ జరగడం లేదు.  భారతదేశం తన ఈ ప్రయత్నాల తో- కోట్ల కొద్దీ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నిలిపివేసింది; జలవాయు పరివర్తన తగ్గింపు దిశ లో భారతదేశాన్ని ఇవాళ అగ్రగామి గా నిలిపింది ఈ ప్రయత్నాలే.  అదేవిధంగా, 3 లక్షలకు పైగా ఎనర్జీ ఇఫిశంట్ పంప్స్- వీటి ద్వారా కూడా దేశం ఇవాళ లక్షల కొద్దీ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ను గాలి లో కలువకుండా అడ్డుకొంటోంది.

సహచరులారా,

పర్యావరణాన్ని పరిరక్షించే విషయం ప్రస్తావనకు వస్తే, దీని కోసం అభివృద్ధి కార్యాలను ఆపవలసిన అవసరం లేదు అంటూ ప్రస్తుతం భారతదేశం ప్రపంచానికి ఒక ఉదాహరణ ను అందిస్తోంది.  ఇకానమి, ఇకాలజి.. ఈ రెండూ కలిసికట్టుగా కూడా పయనించవచ్చును, ముందుకు సాగిపోవచ్చును; మరి భారతదేశం ఇదే దారి ని ఎంచుకొంది.  ఆర్థిక వ్యవస్థ కు బలాన్ని ఇవ్వడం తో పాటు, గత కొన్ని సంవత్సరాలు గా మన అటవీ విస్తీర్ణం కూడా 15,000 చదరపు కిలోమీటర్ల మేర పెరిగింది.  గత కొన్నేళ్లలో మన దేశం లో పులుల సంఖ్య రెట్టింపు అయింది.  చిరుతపులుల సంఖ్య లో కూడా 60 శాతం వృద్ధి ఉంది.  వీటన్నిటి మధ్య, పేంచ్ నేశనల్ పార్క్ లోని వైల్డ్ లైఫ్ ఫ్రెండ్లీ కారిడార్ కూడా సున్నితత్వాని కి ఒక ఉదాహరణ గా ఉండటం నేటి చర్చాంశం గా మారింది.

సహచరులారా,

స్వచ్ఛమైన శక్తి వ్యవస్థ లు, శక్తి ఆదా ను సాధ్యం చేసే వ్యవస్థ లు, రిజిలియంట్ అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ప్లాన్డ్ ఇకో-రెస్టరేశన్, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లో చాలా ముఖ్యమైన భాగం గా ఉన్నాయి. అది ఆకుపచ్చని చెట్ల హంగు తో కూడిన హైవే-ఎక్స్‌ప్రెస్ కావచ్చు, సౌర విద్యుత్తు తో నడిచే మెట్రో కావచ్చు, ఇలెక్ట్రిక్ వాహనాల పై శ్రద్ధ కావచ్చు, లేదా హైడ్రోజన్ తో నడిచే వాహనాల తో ముడిపడిన పరిశోధనలను ప్రోత్సహించడం కావచ్చు.. వీటన్నిటిని గురించిన ఒక విస్తృత వ్యూహం తో పనులు జరుగుతున్నాయి.  పర్యావరణం తో ముడిపడిన ఈ ప్రయాస ల కారణం గా దేశం లో పెట్టుబడుల తాలూకు కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయి; లక్షల కొద్దీ యువజనుల కు ఉపాధి సైతం లభిస్తున్నది.

సహచరులారా,

వాయు కాలుష్యం అనేది పరిశ్రమ ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది అని సాధారణం గా భావించే విషయం.  కానీ నిజం ఏమిటి అంటే, గాలి కాలుష్యం లో రవాణా, అపరిశుభ్ర ఇంధనాలు, డీజల్ జనరేటర్స్ వంటి అనేక అంశాలు దీనికి కొంతవరకు దోహదం చేస్తాయి.  మరి ఈ కారణం గా, భారతదేశం తన నేశనల్ క్లీన్ ఎయర్ ప్లాన్ ద్వారా ఈ దిశలన్నిటి లో సమగ్ర విధానం తో పనిచేస్తోంది.  జల మార్గాలు, మల్టీమాడల్ కనెక్టివిటీ పై ప్రస్తుతం జరుగుతున్న పనులు.. ఇవి గ్రీన్ ట్రాన్స్ పోర్ట్ మిశన్ ను బలోపేతం చేయడమే కాకుండా దేశ లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.  దేశం లోని వందలాది జిల్లాల లో సిఎన్‌జి ఆధారిత మౌలిక సదుపాయాల ను అందుబాటులోకి తీసుకు రావడం కానివ్వండి, ఫాస్టాగ్ వంటి ఆధునిక వ్యవస్థ కానివ్వండి- వీటి తో కాలుష్యాన్ని తగ్గించడం లో చాలా సహాయం అందుతోంది.  ఇవాళ దేశం లో మెట్రో రైలు సేవ లు 5 నగరాల నుంచి 18 నగరాలకు చేరుకొన్నాయి.  సబర్బన్ రైల్వే దిశ లో జరిగిన కృషి కారణం గా సొంత వాహనాల వాడకం తగ్గింది.

సహచరులారా,

ప్రస్తుతం దేశం లో రైల్వే నెట్‌వర్క్‌ లో ఒక పెద్ద భాగాన్ని విద్యుదీకరించడం జరిగింది.  దేశం లోని విమానాశ్రయాలను సైతం వేగం గా సౌర విద్యుత్తు పైన ఆధారపడేటటువంటివి గా దిద్ది తీర్చడం జరుగుతోంది.  2014వ సంవత్సరం కంటే ముందు, 7 విమానాశ్రయాల లో మాత్రమే సౌర విద్యుత్తు తాలూకు సదుపాయం ఉండింది, అదే ఇప్పుడు- ఈ సంఖ్య 50 కంటే పెరిగింది.  శక్తి ని ఆదా చేయడం కోసం 80 కి పైగా విమానాశ్రయాల లో ఎల్‌ఇడి  లైట్స్ ను ఏర్పాటు చేసే పని కూడా పూర్తి అయింది.  భవిష్యత్ సన్నాహాల తో ముడిపడ్డ మరొక ఉదాహరణ ను మీ ముందుకు తీసుకురావాలనుకొంటున్నాను.

స్టాచ్యూ ఆఫ్ యూనిటి- గుజరాత్‌ లో సర్ దార్ వల్లభ్ భాయి తాలూకు ప్రపంచం లోకెల్లా అతి ఎత్తయినటువంటి స్మారక చిహ్నం రూపొందింది.  స్టాచ్యూ ఆఫ్ యూనిటి ఉన్న అందమైన కేవడియా నగరాన్ని ఇలెక్ట్రిక్ వ్హీకల్ సిటీ వలె అభివృద్ధి చేసే పనులు సైతం జరుగుతున్నాయి. భవిష్యత్తు లో కేవడియా లో బ్యాటరీ తో నడిచే బస్సు లు, ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు మాత్రమే తిరుగుతాయి.  దీనికి గాను అక్కడ అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా అందుబాటు లోకి తీసుకు రావడం జరుగుతుంది.

సహచరులారా,

జలవాయు పరివర్తన తో వాటర్ సైకిల్ కు కూడా నేరు గా సంబంధం ఏర్పడుతోంది. నీటి చక్రం లో సమతౌల్యం చెదిరిపోతే దాని తాలూకు ప్రత్యక్షప్రభావం నీటి భద్రత పై ఉంటుంది. ప్రస్తుతం, దేశం లో నీటి భద్రత విషయం లో ఎంత కృషి జరుగుతోందో అంత కృషి ఇంతకు ముందు ఎన్నడూ జరుగలేదు.  దేశం లో జల వనరుల నిర్మాణం   నిర్మాణం, సంరక్షణ, ఉపయోగం ల పరం గా ఒక సంపూర్ణమైనటువంటి విధానం తో పనిచేయడం జరుగుతోంది.  జల్ జీవన్ మిశన్ కూడా దీనిలో ఓ చాలా పెద్ద మాధ్యమంగా ఉంది. ఈసారి జల్ జీవన్ మిశన్‌ లో ఒక కార్యక్రమం అమలవుతోందని మీకు నేను గుర్తు చేయాలనుకొంటున్నాను.  దీనిలో దేశ పౌరుల సహాయం నాకు కావాలి. అది ఏమిటి అంటే వర్షపు జలాల ను కాపాడండి, వాన నీటి ని ఒడిసిపట్టండి, మనం వర్షధార జలాలను అపుకొందాం, దానిని ఆదా చేసుకొందాం.

సోదరులు, సోదరీమణులారా,

దాదాపు 7 దశాబ్దాలలో, దేశం లోని సుమారు 3 కోట్ల గ్రామీణ కుటుంబాల కు గొట్టాలల ద్వారా నీరు అందింది, కాగా 2 సంవత్సరాల కన్నా తక్కువ కాలం లో 4 కోట్ల కన్నా ఎక్కువ  కుటుంబాలకు పంపు నుంచి నీటి ని సరఫరా చేయడమైంది.  ఒక పక్క, గొట్టం తో ప్రతి ఇంటి ని జోడించడం జరుగగా, మరో పక్క అటల్ భూజల్ యోజన, కేచ్ ది రేన్ ల వంటి ఉద్యమాల మాధ్యమం ద్వారా భూగర్భ జలాల స్థాయి ని పెంచడం పైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతోంది.

సహచరులారా,

అభివృద్ధి మరియు పర్యావరణం లో సమతౌల్యం, ఇది మన పురాతన సంప్రదాయం లో ఒక ముఖ్యమైన భాగం గా ఉంది, దీనిని మనం ఆత్మనిర్భర్ భారత్ (స్వయంసమృద్ధియుత భారతదేశం) బలం గా కూడా మార్చుతున్నాం.  జీవి,  ప్రకృతి సంబంధాల సమతౌల్యం, వ్యష్టి- సమష్టి ల సమతౌల్యం, జీవి మరియు శివుని యొక్క సమతౌల్యం ఎల్లప్పటికీ మన శాస్త్రాలు మనకు నేర్పడ జరిగింది. ‘ యత్ పిండే తత్ బ్రహ్మాండే ’ అని మన కు బోధించడం జరిగింది.  ఈ మాటల కు- ఏదయితే పిండం అదే జీవంలో ఉందో, అదే బ్రహ్మాండం లోనూ ఉంది- అని భావం.  మనం మనకోసం ఏది చేస్తామో, దాని ప్రత్యక్ష ప్రభావం మన పర్యావరణం పైన పడుతుంది.  ఈ కారణం గా, మన  వనరుల సామర్థ్యం పరం గా భారతదేశం ప్రయత్నాలు పెరుగుతూ పోతున్నాయి.  ఈ రోజు న మనం మాట్లాడుకొంటున్న వృత్తాకార ఆర్థిక వ్యవస్థ లో వనరుల పైన తక్కువ లో తక్కువ ఒత్తిడి ఉండుగాక. ప్రభుత్వం సైతం ఆధునిక సాంకేతిక విజ్ఞానం ద్వారా వనరుల ను రీసైకిల్ చేసి సద్వినియోగం చేయగల 11 రంగాల ను గుర్తించింది.  చెత్త నుంచి సంపద, మరో మాట లో చెప్పాలి అంటే, కచ్ రే సే కంచన్ అభియాన్ పట్ల గత కొన్నేళ్లు గా చాలా పనులు జరిగాయి, ఇప్పుడు అది ఉద్యమ రూపం లో చాలా వేగం గా ముందుకు తీసుకుపోవడం జరుగుతోంది. ఇళ్ల లో నుంచి, పొలాల్లో నుంచి వచ్చే వ్యర్థాలు కావచ్చు, లేదా స్క్రాప్ మెటల్ కావచ్చు, లేదా లిథియం అయాన్ బ్యాటరీ లు కావచ్చే, అటువంటి అనేక రంగాల లో రీసైకిలింగ్ ను కొత్త టెక్నాలజీ మాధ్యమం ద్వారా ప్రోత్సహించడం జరుగుతోంది. దీనితో ముడిపడ్డ కార్య ప్రణాళిక, దీనిలో నియంత్రణ పరమైన , అభివృద్ధి కి సంబంధించిన అన్ని అంశాలకు చోటు ఉంటుంది, ఈ కార్య ప్రణాళిక ను రాబోయే నెలల్లో అమలులోకి తీసుకురావడం జరుగుతుంది.

సహచరులారా,

జలవాయు రక్షణ కోసం, పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం మన ప్రయత్నాలను సంఘటితపరచడం చాలా అవసరం.  దేశం లోని ప్రతి ఒక్క వ్యక్తి నీరు, గాలి, నేల ల  సమతుల్యత ను సాధించడానికి ఐక్యం గా ప్రయత్నించినప్పుడే, మనం మన రాబోయే  తరాల కు ఒక సురక్షిత పర్యావరణాన్ని అందించగలుగుతాం. మన పూర్వీకులు కోరుకొన్నది - మరి మన పూర్వీకులు మన కోసం చెప్పిన చాలా మంచి విషయాన్ని చెప్పారు. మన పూర్వీకులు మన నుంచి కోరుకొన్నది ఏమిటి.  వారు చాలా గొప్ప మాటల ను చెప్పారు- అది ‘పృథ్వీ: పూ: చ ఉర్వీ భవ’ అనేదే.  ఈ మాటల కు- మొత్తం భూమి ని, మొత్తం పర్యావరణాన్ని, మనందరికీ ఉత్తమమైంది గా ఉండాలని, అవి మన కలల ను నిజం చేయాలి- అని భావం.   అదే శుభకామన తో, నేటి రోజు న- ప్రపంచ పర్యావరణ దినం సందర్భం లో- దీని తో సంబంధం ఉన్న మహానుభావులు అందరికీ అనేక శుభకాంక్షలను వ్యక్తం చేస్తున్నాను.   మిమ్మల్ని మీరు జాగ్రత్త గా చూసుకోండి, మిమ్మల్ని మీరు ఆరోగ్యం గా ఉంచుకోండి.   మీ కుటుంబ సభ్యుల ను ఆరోగ్యం గా ఉంచండి.  మరి కోవిడ్ నివారణ నియమాల పట్ల ఎలాంటి చిన్నచూపు వద్దు; ఇదే అపేక్ష తో చాలా చాలా ధన్యవాదాలు, కృత‌జ్ఞ‌త‌లూను.



 

***

 


(Release ID: 1724848) Visitor Counter : 316