ఆర్థిక మంత్రిత్వ శాఖ

వేగంగా దావాలను పరిష్కారించడం కోసం, బీమా సంస్థల అధిపతులను కలిసిన - కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్


వేగవంతమైన దావాల పంపిణీని ప్రారంభించడానికి పథకాల కింద ప్రక్రియ మరియు డాక్యుమెంటేషన్ అవసరాలను క్రమబద్ధీకరించాలని నొక్కి చెప్పిన - కేంద్ర ఆర్ధిక మంత్రి


పి.ఎం.జె.జె.బి.వై. కింద , 2020 ఏప్రిల్, 1వ తేదీ నుండి ఇప్పటి వరకు, 99 శాతం మేర దావాల పరిష్కారం రేటుతో, 1.2 లక్షల దావాలకు, 2403 కోట్ల రూపాయలు చెల్లించారు



Posted On: 05 JUN 2021 4:51PM by PIB Hyderabad

కోవిడ్-19 తో పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తల కోసం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ (పి.ఎం.జి.కె.పి) బీమా పథకం కింద సాధించిన పురోగతిని సమీక్షించడానికి, అదేవిధంగా,  మహమ్మారి సమయంలో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పి.ఎం.జె.జె.బి.వై) కింద పెండింగ్‌లో ఉన్న దావాల పంపిణీని వేగవంతం చేయడం కోసం, కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు దృశ్య మాధ్యమం ద్వారా బీమా సంస్థల అధిపతుల తో సమావేశమయ్యారు.  పథకాల కింద ప్రక్రియ మరియు డాక్యుమెంటేషన్ అవసరాలను క్రమబద్ధీకరించడం యొక్క ప్రాముఖ్యతను కూడా ఆమె నొక్కి చెప్పారు, తద్వారా వాదనలు వేగంగా పంపిణీ చేయబడతాయి.  దావాల పంపిణీని వేగవంతం చేయడానికి, పథకాల కింద ప్రక్రియ మరియు డాక్యుమెంటేషన్ అవసరాలను క్రమబద్ధీకరించాలని కూడా, కేంద్ర ఆర్ధిక మంత్రి ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. 

పి.ఎం.జి.కె.పి. పథకం కింద, ఈ రోజు వరకు, మొత్తం 419 దావాలు పరిష్కరించి, వారి నామినీ ల ఖాతాల్లో 209.5 కోట్ల రూపాయలు పంపిణీ చేసినట్లు,  కేంద్ర ఆర్థిక మంత్రి, ఈ సమీక్ష సందర్భంగా, గమనించారు.   సంబంధిత రాష్ట్రాలు, ధృవపత్రాలను పంపడం వల్ల జరిగే జాప్యాన్ని పరిష్కరించడానికి, ఆర్థిక వ్యవస్థ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చిందని, కేంద్ర ఆర్ధిక మంత్రి చెప్పారు.  ఇందుకోసం జిల్లా మేజిస్ట్రేట్ (డి.ఎం) జారీ చేసిన ఒక సాధారణ ధృవపత్రం తో పాటు, రాష్ట్ర ఆరోగ్య శాఖ నోడల్ అధికారులు ఆ పత్రాన్ని  ఆమోదించినట్లు సంతకం పెడితే ఆ దావాలను పరిష్కరించడానికి సరిపోతుందని, ఆమె తెలియజేశారు.  ఈ పథకాన్ని నిర్వహిస్తున్న న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ ప్రయత్నాలను కూడా ఆమె ప్రశంసించారు. డి.ఎమ్. సర్టిఫికేట్ పొందిన 4 గంటల్లో ఒక దావా పరిష్కరించబడిన లడఖ్ యొక్క ఉదాహరణ ను ఆమె  ఉదహరిస్తూ, భవిష్యత్తులో ఇలాంటి విధానాన్ని కొనసాగించాలని ఆమె కోరారు.  ఆరోగ్య కార్యకర్తల కోవిడ్ దావాలను ప్రాధాన్యతతో చేపట్టాలనీ, ఇందుకోసం, అమల్లోకి తెచ్చిన ఈ సరళీకృత యంత్రాంగాన్ని గరిష్టంగా ఉపయోగించుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి రాష్ట్రాలను ఆదేశించారు.

పి.ఎం.జె.జె.బి.వై. కింద , మొత్తం 9,307 కోట్ల రూపాయల విలువైన, 4.65 లక్షల దావాలు ఉండగా, వాటిలో మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి, అంటే, 2020 ఏప్రిల్, 1వ తేదీ నుండి ఇప్పటి వరకు,  99 శాతం మేర దావాల పరిష్కారం రేటుతో, 1.2 లక్షల దావాలకు, 2403 కోట్ల రూపాయలు చెల్లించినట్లు, కేంద్ర ఆర్ధిక మంత్రి ఈ సందర్భంగా, గమనించారు.  మరణించిన పాలసీదారుల నామినీ లకు, ముఖ్యంగా మహమ్మారి కాలంలో సేవలు అందించేటప్పుడు బీమా సంస్థల అధికారులు సానుభూతితో వ్యవహరించాలని, కేంద్ర ఆర్థిక మంత్రి ఉద్ఘాటించారు.  దావాలను వేగంగా  పరిష్కరించడంలో  బీమా సంస్థలు, బ్యాంకులు ఇటీవల చేసిన ప్రయత్నాలను కూడా ఆమె ప్రశంసించారు.

పి.ఎం.ఎస్‌.బి.వై. పథకం కింద దావాల పరిష్కారం పై కూడా కేంద్ర ఆర్థిక మంత్రి, ఈ సందర్భంగా సమీక్ష నిర్వహించారు.  2021 మే, 31వ తేదీ నాటికి, మొత్తం 82,660 దావాలకు, 1629 కోట్ల రూపాయలు చెల్లించినట్లు, ఆమె తెలియజేశారు. 

మహమ్మారి సమయంలో  పి.ఎం.జె.జె.బి.వై. మరియు పి.ఎం.ఎస్.బి.వై. పధకాల  కింద దావాల పరిష్కార ప్రక్రియను సులభతరం చేయడానికి ఇటీవల చేపట్టిన ఈ క్రింది కార్యక్రమాలను కూడా ఆమె ప్రశంసించారు:

*          బీమా సంస్థలు, దావాల పరిష్కార ప్రక్రియను, 30 రోజులకు బదులుగా 7 రోజుల్లోపు పూర్తి చేయడం. 

*          బ్యాంకులు మరియు బీమా సంస్థల మధ్య దావాలు పరిష్కార ప్రక్రియ పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నిర్వహించడం.  

*          కాగితాల భౌతిక లావాదేవీల కారణంగా జరిగే జాప్యాన్ని తొలగిస్తూ, ఈ-మెయిల్ / యాప్ ద్వారా దావాల పత్రాల సమాచారాన్ని అందజేయడం. 

*          ప్రభుత్వ రంగంలోని బీమా సంస్థలు 2021 జూన్ నాటికి దావాల పరిష్కారానికి ఏ.పిఐ.- ఆధారిత యాప్ ను అమలు చేయనున్నాయి. 

*          పరిగణించవలసిన మరణ ధృవీకరణ పత్రానికి బదులుగా డాక్టర్ సర్టిఫికేట్ మరియు డి.ఎం. / అధీకృత అధికారి జారీ చేసిన ధ్రువపత్రం తో దావాలను పరిష్కరించడం. 

*          హేతుబద్ధమైన పత్రాలు మరియు సరళీకృత దావాల ప్రక్రియ త్వరలో జారీ కానుంది. 

ఈ దావా మొత్తాలు సన్నిహితులైన, కుటుంబ సభ్యులను కోల్పోయినవారి నామినీలకు ఎంతో అవసరమైన ఆర్థిక ఉపశమనాన్ని కలుగజేస్తాయి. ఈ ప్రక్రియను మరింత సౌలభ్యంగా, వేగవంతంగా పూర్తిచేయడానికి, ప్రభుత్వ చర్యలు, దోహదం చేస్తాయి.

పథకం ముఖ్యాంశాలు:

పి.ఎం.జె.జె.బి.వై. మరియు పి.ఎం.ఎస్.బి.వై. పధకాలు 2015 సంవత్సరంలో ప్రారంభించబడ్డాయి. జీవిత మరియు ప్రమాద బీమా కోసం, వరుసగా 330 రూపాయలు మరియు 12 రూపాయల వార్షిక ప్రీమియం చెల్లించి, తమ బ్యాంకు ద్వారా చేరిన లబ్ధిదారులందరికీ, ఈ పథకాల కింద, 2 లక్షల రూపాయల ప్రయోజనం లభిస్తుంది.  పి.ఎం.జె.జె.బి; మరియు పి.ఎం.ఎస్‌.బి.వై. కింద రోజుకు ఒక రూపాయి కన్నా తక్కువ ప్రీమియంతో నమోదు చేసుకోవడం ద్వారా, అసంఘటిత విభాగంలో పనిచేసే ఎక్కువ మంది వ్యక్తులకు, 4 లక్షల రూపాయల మేర  అవసరమైన ఆర్థిక భద్రత కల్పించాలన్నదే, ఈ పధకాల లక్ష్యం. 

ప్రభుత్వ ఆర్థిక చేరిక కార్యక్రమం ద్వారా, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పి.ఎం.జె.డి.వై) కింద 42 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు తెరవబడ్డాయి.  అదేవిధంగా పి.ఎం.జె.జె.బి.వై. కింద 10 కోట్లకు పైగా ఖాతాలు; పి.ఎం.ఎస్.బి.వై. కింద 23 కోట్లకు పైగా ఖాతాలు నమోదయ్యాయి.   జన ధన్-ఆధార్-మొబైల్ అనుసంధానం ద్వారా, వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాలకు నేరుగా ప్రభుత్వ ఆర్ధిక సహాయాన్ని పొందుతున్నారు.

*****



(Release ID: 1724821) Visitor Counter : 226