ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశం లో టీకామందు ను వేయించే కార్యక్రమం ప్రగతి పై సమీక్ష ను నిర్వహించిన ప్రధాన మంత్రి
టీకామందు ఉత్పత్తిదారుల కు మరిన్ని ఉత్పత్తి
విభాగాల ఏర్పాటు కు మార్గాన్ని సుగమం చేయడం లో, ముడి పదార్థాల విషయం లో ఆర్థిక సాయాన్ని అందించడం లో, ముడిపదార్థాల సరఫరా లో భారత ప్రభుత్వం సాయపడుతోంది
టీకా వృథా ను తగ్గించడం కోసం చర్యలను తీసుకోవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి ఆదేశించారు
ఆరోగ్య సంరక్షణ కార్యకర్త లు, ముందు వరుస లోని సిబ్బంది 45 ఏళ్లకు పైగా వయస్సు కలిగిన, 18-44 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన సమూహాలకు టీకామందు తాలూకు రక్షణ ను అందించే స్థితి ని సమీక్షించిన ప్రధాన మంత్రి
Posted On:
04 JUN 2021 8:38PM by PIB Hyderabad
భారతదేశం లో టీకామందు ను వేయించే కార్యక్రమం తాలూకు ప్రగతి పై సమీక్ష ను నిర్వహించడం కోసం జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. సమావేశం సాగిన క్రమం లో, టీకా వేయించే కార్యక్రమం లోని వివిధ అంశాల పై అధికారులు అన్ని విషయాల ను సమగ్రంగా తెలియజేశారు.
ప్రస్తుతం టీకా ల అందుబాటు, దానిని పెంచే పథకానికి సంబధించిన సమాచారాన్ని ప్రధాన మంత్రి కి వివరించడం జరిగింది. వివిధ టీకామందు ల ఉత్పత్తిదారులకు టీకాల ఉత్పత్తి ని శరవేగం గా పెంచడం లో సాయపడటానికి చేసిన ప్రయాసల ను ఆయన దృష్టి కి తీసుకురావడమైంది. భారత ప్రభుత్వం టీకామందు ఉత్పత్తిదారుల తో కలసి సక్రియాత్మకంగా పని చేస్తోంది. మరిన్ని ఉత్పత్తి విభాగాల ఏర్పాటు కు మార్గాన్ని సుగమం చేయడం లో, ముడి పదార్థాల కు ఆర్థిక సహాయాన్ని అందించడం లో, ముడిపదార్థాల ను సరఫరా చేయడం లో వాటికి సాయపడుతోంది.
https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/Collage-4copyW69L.jpg
ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల తో పాటు ముందువరుస లలోని సిబ్బంది కి టీకామందు ను వేయించే కార్యక్రమం తాలూకు స్థితి ని ప్రధాన మంత్రి సమీక్షించారు. 45 ఏళ్లు పైబడిన వయస్సు కలిగిన వారు సహా 18-44 ఏళ్ల వయస్సు వర్గం లోని వారికి కూడా టీకామందు ను వేయించే పని ఎంతవరకు వచ్చిందీ ఆయన అడిగి తెలుసుకొన్నారు. వివిధ రాష్ట్రాల లో టీకామందు వృథా తాలూకు స్థితి ని కూడా ప్రధాన మంత్రి సమీక్షించారు. టీకామందు వృథా తాలూకు సంఖ్య ఇప్పటికీ అధికం గా ఉందని, దీని ని తగ్గించే దిశ లో తగిన చర్యల ను తీసుకోవలసిన అవసరం ఉందంటూ ప్రధాన మంత్రి ఆదేశించారు.
టీకామందు ను వేయించే ప్రక్రియ ను ప్రజల కు మరింత ఎక్కువ అనుకూలం గా మలచడం కోసం సాంకేతికత పరం గా చేపడుతున్నటువంటి ఉపాయాల ను గురించి కూడా ప్రధాన మంత్రి కి తెలియజేశారు.
ప్రధాన మంత్రి కి టీకామందు అందుబాటు పై రాష్ట్రాల కు ఇస్తున్న ముందస్తు సమాచారాన్ని గురించి ప్రధాన మంత్రి కి అధికారులు వివరించారు. ప్రజల కు ఎలాంటి అసౌకర్యం ఎదురవకుండా ఈ సమాచారాన్ని జిల్లా స్థాయి వరకు అందించవలసిందంటూ రాష్ట్రాలకు చెప్పినట్లు కూడా ప్రధాన మంత్రి కి అధికారులు తెలిపారు.
సమావేశం లో రక్షణ శాఖ మంత్రి, హోం మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, వాణిజ్యం-పరిశ్రమ శాఖ మంత్రి, సమాచారం- ప్రసార శాఖ మంత్రుల తో పాటు ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రట్రి, కేబినెట్ సెక్రట్రి, ఆరోగ్య కార్యదర్శి, ఇంకా ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
***
(Release ID: 1724606)
Visitor Counter : 187
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam