వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
పిఎంజికెఎవై కింద మే నెలలో 55కోట్ల మంది ,జూన్ నెలలో 2.6 కోట్ల మంది లబ్ధిదారులు ఉచిత ఆహరధాన్యాలు అందుకున్నారు: శ్రీ పాండే
పిఎంజికెఎవై-3 కింద అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుమారు 63.67 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల పంపిణీ.
వంటనూనెల ధరలు దిగివస్తున్నాయి. ప్రభుత్వం ప్రతి వారం పరిస్థితిని సమీక్షిస్తోంది. : శ్రీ పాండే
19.8 కోట్ల పోర్టబిలిటి లావాదేవీలు కోవిడ్ 19 సమయంలో జరిగాయి. అంటే 2020 ఏప్రిల్ నుంచి 2021 మే వరకు.
పిఎంజికెఎవై-3 , ఒఎన్ఒఆర్‌సి, ఆహారధాన్యాల సేకరణ లో పురోగతి గురించి మీడియాకు తెలిపిన డిఎఫ్‌పిడి కార్యదర్శి.
Posted On:
03 JUN 2021 6:22PM by PIB Hyderabad
ఆహారం, ప్రజా పంపిణీ విభాగం కార్యదర్శి శ్రీ సుధాంశు పాండే , పిఎంజికెఎవై -3 ఒక దేశం, ఒక రేషన్ కార్డు పథకం కింద ఆహార ధాన్యాల పంపిణీలో పురోగతి గురించి ఈరోజు మీడియాకు వివరించారు.
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పిఎం-జికెఎవై-3) గురించి మాట్లాడుతూ ఆయన, 63.67 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఆహార ధాన్యాలను ( అంటే సుమారు 80 శాతం మొత్తం పిఎంజికెఎవై కి మే, జూన్ 2021 నెలలకు కేటాయించినది) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎఫ్.సి.ఐ గోడౌన్ల నుంచి తీసుకున్నాయి. సుమారు 28 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 55 కోట్ల ఎన్.ఎఫ్.ఎస్.ఎ లబ్ధిదారులకు 2021 మే నెలకు, సుమారు 1.3 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను జూన్ 2021 నెలకు 2.6 కోట్ల మందికి కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ పంపిణీ చేశారు.
అలాగే, 2021 జూన్ 3 వ తేదీ నాటికి జాతీయ ఆహార భద్రతా చట్టం కింద, ఆహార ధాన్యాలను ఎన్.ఎఫ్.ఎస్.ఎ లబ్ధిదారులకు మే నెలకు 90 శాతం, జూన్ నెలకు 12 శాతం పంపిణీ చే సినట్టు చెప్పారు. దీనితో ఆహార సబ్సిడీ మే, జూన్ 2021 నెలలకు రూ 13,000 కోట్ల రూపాయలు అయిందన్నారు పిఎంజికెఎవై కి ఇప్పటి వరకు 2021 మే, జూన్ నెలలకు ఆహార సబ్సిడీ రూ 9,200 కోట్లకంటే ఎక్కువ అయిందని అన్నారు.
ఆహారం,ప్రజాపంపిణీ విభాగం ఈ పథకానికి సంబంధించి నిరంతరం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సమీక్ష నిర్వహిస్తున్నదని, పిఎం-జికెఎవై -3 గురించి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తున్నదని అన్నారు. చౌకధరల దుకాణాల వద్దకూడా బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
ఒక దేశం, ఒక రేషన్ కార్డు (ఒఎన్ఒ ఆర్ సి) ప్రాధాన్యత గురించి నొక్కిచెబుతూ , డిఎఫ్‌పిడి కార్యదర్శి ఇది గొప్ప లక్ష్యంతో కూడుకున్న కార్యక్రమమని, దేశవ్యాప్తంగా జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 (ఎన్.ఎఫ్.ఎస్.ఎ) కింద రేషన్ కార్డు పోర్టబిలిటీకి ఈ విభాగం కృషి చేస్తున్నట్టు తెలిపారు.
ఒ.ఎన్.ఒ.ఆర్.సి పథకం కింద (రాష్ట్రంలోని లావాదేవీలతో సహా) ప్రస్తుతం నెలకు సగటున 1.35 కోట్ల పోర్టబిలిటి లావాదేవీలు ఒక దేశం ఒక రేషన్ కార్డు పథకం కింద నమోదు అవుతున్నాయని తెలిపారు. అలాగే 2019 ఆగస్టులో ఒక దేశం, ఒక రేషన్ కార్డు పథకం ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 27.8 కోట్ల లావాదేవీలు చోటుచేసుకున్నట్టు ఆయన తెలిపారు. ఇందులో సుమారు 19.9 కోట్ల పోర్టబిలిటీ లావాదేవీలు కోవిడ్ -19 కాలంలో 2020 ఏప్రిల్ నుంచి 2021 మే మధ్య చోటుచేసుకున్నట్టు తెలిపారు.
కోవిడ్ సంక్షోభ సమయంలో ఎన్.ఎఫ్.ఎస్.ఎ లబ్ధిదారులైన వలస కూలీలకు ఆహార ధాన్యాలను అందుబాటులో ఉంచడంలో ఒక దేశం, ఒక రేషన్ కార్డు కార్యక్రమానికిగల శక్తిని దృష్టిలో ఉంచుకుని ఈ విభాగం రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలతో వర్చువల్ సమావేశం ద్వారా , అడ్వయిజరీలు, లేఖల ద్వారా ఈ కార్యక్రమాన్ని పూర్తిశక్తిసామర్ధ్యాలతో అమలు చేసి వలసలబ్దిదారులకు అందేట్టు చూడాలని కోరుతూ వస్తున్నది.
ఒక దేశం, ఒక రేషన్ కార్డు కార్యక్రమానికి సంబంధించి విస్తృత ప్రచారం కల్పించాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరడం జరిగింది. ఇందుకు సంబంధించి 14445 టోల్‌ఫ్రీ నెంబర్, మేరా రేషన్ మొబైల్ అప్లికేషన్‌ను ఎన్.ఐ.సి ఆధ్వర్యంలో ఎన్.ఎఫ్.ఎస్.ఎ లబ్ధిదారుల కోసం అభివృద్ధి చేయడం జరిగింది. ప్రత్యేకించి వలస ఎన్.ఎఫ్.ఎస్.ఎ లబ్ధిదారులకు పది బాషలలో అంటే ఇంగ్లీషు, హిందీ, ఒరియా, పంజాబి, తమిళం, తెలుగు, మళయాళం, కన్నడ, గుజరాతి, మరాఠీ భాషలలో సమాచారం అందిస్తున్నారు.
మేరా రేషన్ యాప్‌లో మరిన్ని ప్రాంతీయ భాషలు చేర్చేందుకు కృషి జరుగుతోంది.
వంటనూనెల సుంకం తగ్గించడం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ శ్రీ పాండే, వంటనూనెల ధరలు ఇప్పటికే అంతర్జాతీయ మమార్కెట్‌లో దిగివస్తున్నాయని, డిమాండ్ 15 నుంచి 20 శాతం తగ్గిందని అన్నారు. ధరలు మరింతగా దిగి రానున్నాయని, అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తున్నదని అన్నారు. అందువల్ల సుంకం తగ్గించా్సిన అవసరం లేదని అన్నారు. ప్రభుత్వం , ప్రతివారం పరిస్థితిని సమీక్షిస్తున్నదని అన్నారు.
మరో ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన, ప్రస్తుత కోవిడ్ పరిస్థితులలో అత్యంత నిరుపేద ,ఆర్దికంగా బలహీన వర్గాలకు చెందిన వారు అంటే చెత్త ఏరుకునే వారు, నిరాశ్రయులు, హాకర్లు, రిక్షానడిపేవారు, వలస కార్మికులను ఆతీయ ఆహార భద్రతా చట్టం కింద చేర్చడం తమ విభాగం ముందున్న అత్యంత ప్రాధాన్యతా అంశమని అన్నారు. ఇందుకు సంబంధించి ఎన్.ఎఫ్.ఎస్.ఎ కింద అర్హులైన వారిని గుర్తించి వారికి రేషన్ కార్డులు మంజూరు చేయడం , దీనిని నిరంతరం సమీక్షించడం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలపై ఉన్నదని చెప్పారు.
రేషన్ కార్డులు లేని పైన పేర్కొన్న కేటగిరీలకు చెందిన వారికి ఎన్.ఎఫ్.ఎస్.ఎ రేషన్ కార్డులను ఇచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవలసిందిగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తమ విభాగం ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. ఇందుక సంబంధించి వారు మొత్తంగా ఎన్.ఎఫ్.ఎస్.ఎ పరిమితికింద తమకు అందుబాటులో ఉన్ప కవరేజ్ ని వాడుకోవాలని సూచించడం జరిగింది.
మొత్తం ఎన్.ఎఫ్.ఎస్.ఎ కవరేజ్ పరిమితి 81.35 కోట్లు సుమారు 1.97 కోట్ల గ్యాప్‌ను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇందుకోసం వినియోగించుకోవచ్చు.
***
(Release ID: 1724492)
Visitor Counter : 220