రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లపై వాణిజ్య మార్జిన్‌ను నియంత్రించిన ప్రభుత్వం
70%వరకు వాణిజ్య మార్జిన్ల నియంత్రణ
సవరించిన ఎంఆర్‌పిలను గురించి వారంలో వెల్లడించనున్న ఎన్‌పిపిఎ
Posted On:
04 JUN 2021 12:41PM by PIB Hyderabad
కోవిడ్ మహమ్మారి వల్ల ఏర్పడిన అసాధారణ పరిస్థితుల ఫలితంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల గరిష్ఠ రీటైల్ ధరలలో అస్థిరతను దృష్టిలో పెట్టుకుని, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల ధరలను క్రమబద్ధీకరించేందుకు రంగంలోకి దిగాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం సేకరించిన సమాచారం ప్రకారం పంపిణీదారు స్థాయిలో మార్జిన్ 198% దరిదాపుల్లో ఉంది.
ప్రజల విస్త్రత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని డిపిసిఒ, 2013లోని పారా 19 కింద అసాధారణ అధికారాలను ఉపయోగిస్తూ, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లపై పంపిణీదారు స్థాయిలో ధర (పిటిడి) పై వాణిజ్య మార్జిన్‌ను 70%గా ఎన్‌పిపిఎ నియంత్రించింది. ఇంతకుముందు, ఎన్‌పిపిఎ యాంటీ-కాన్సర్ మందులపై వాణిజ్య మార్జిన్‌ను ఫిబ్రవరి 2019లో విజయవంతంగా నియంత్రించింది. నోటిఫై చేసిన వాణిజ్య మార్జిన్ ఆధారంగా సవరించిన ఎంఆర్‌పిని మూడు రోజుల లోపల నివేదించవలసిందిగా ఎన్‌పిపిఎ ఉత్పత్తిదారులను/ దిగుమతిదారులను ఆదేశించింది. సవరించిన ఎంఆర్‌పి ధరలను ఎన్‌పిపిఎ వారం రోజులలో బహిరంగం చేయనుంది.
ఉత్పత్తిదారు అందచేసిన ధరల జాబితాను ప్రతి రీటైలర్, డీలరు, ఆసుపత్రి, సంస్థ తమతమ వాణిజ్య ప్రాంగాణాలలో అందరికీ కనిపించే విధంగా ప్రదర్శించాలి. తద్వారా ఈ విషయం గురించి తెలుసుకోవాలన్న ప్రతి వ్యక్తికీ అది అందుబాటులో ఉంటుంది. వాణిజ్య మార్జిన్‌పై నియంత్రించిన తర్వాత సవరించిన ఎంఆర్‌పికి అనుగుణంగా వ్యవహరించని ఉత్పత్తిదారులు/ దిగుమతిదారులు ఔషధాల (ధరల నియంత్రణ) ఉత్తర్వు, 2013ను, నిత్యావసరాల వస్తువుల చట్టం, 1955తో కలిపి అమలు చేస్తూ అందులోని ప్రొవిజన్ల కింద వారిపై 100%వరకు జరిమానా, 15% వడ్డీతో కలిపి అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి వస్తుంది. బ్లాక్ మార్కెటింగ్ ఉదంతాన్ని నివారించేందుకు సవిరించిన ఎంఆర్‌పికన్నా అధిక ధరకు ఉత్పత్తిదారు, డిస్ట్రిబ్యూటర్, రిటైలర్ వినియోగదారుకు అమ్మకుండా నియంత్రించేందుకు, వారు ఉత్తర్వులకు కట్టుబడి ఉన్నారా అనే విషయాన్ని పర్యవేక్షించేందుకు రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్లు (ఎస్‌డిసిలు) పని చేస్తారు.
సమీక్షకు లోబడి ఈ ఉత్తర్వులు 30 నవంబర్ 2021వరకూ అమలులో ఉన్నప్పటికీ,
దేశంలో కోవిడ్ 2.0 మహమ్మారి కారణంగా కేసులు పెరిగిన నేపథ్యంలో, మెడికల్ ఆక్సిజన్‌కు డిమాండ్ చెప్పుకోదగినంతగా పెరిగింది. మహమ్మారి కాలంలో దేశంలో ఆక్సిజన్ ను, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను తగిన పరిమాణంలో నిరాటంకంగా సరఫరా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అనేది జాబితాలో లేని ఔషధం, ప్రస్తుతం అది కేంద్ర ఔషధ ప్రామాణికత నియంత్రణ సంస్థ (సిడిఎస్‌సిఒ) స్వచ్ఛంద లైసెన్సింగ్ చట్రం కింద ఉంది. దాని ధరలను డిపిసిఒ 2013లోని ప్రొవిజన్ల కింద ధరలను పర్యవేక్షిస్తున్నారు.
***
(Release ID: 1724396)
Visitor Counter : 189