ప్రధాన మంత్రి కార్యాలయం

యుఎస్ఎ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ గారి తో మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 03 JUN 2021 9:42PM by PIB Hyderabad

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉపాధ్యక్షురాలు మాననీయురాలు కమలా హ్యారిస్ గారి తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బుధవారం నాడు ఫోన్ లో మాట్లాడారు.

ఉపాధ్యక్షురాలు హ్యారిస్ కోవిడ్-19 కి వ్యతిరేకం గా పనిచేసే టీకా మందు ను యుఎస్ అనుసరిస్తున్న ‘‘ప్రపంచవ్యాప్తం గా టీకా మందు ను పంచుకొనే వ్యూహం’’ లో భాగం గా, భారతదేశం తో సహా ఇతర దేశాల కు అందుబాటు లోకి తెచ్చేందుకు యుఎస్ దగ్గరున్న ప్రణాళికల ను గురించి ప్రధాన మంత్రి కి తెలియజేశారు.

యుఎస్ తీసుకొన్న నిర్ణయానికి, అలాగే యుఎస్ ప్రభుత్వం వైపు నుంచి, వ్యాపారాల నుంచి, యుఎస్ లోని  నిర్వాసితుల నుంచి ఇటీవలి కాలం లో భారతదేశం అందుకొన్న ఇతరేతర రూపాల్లోని తోడ్పాటు కు, సంఘీభావానికి గాను ఉపాధ్యక్షురాలు హ్యారిస్ కు ప్రధాన మంత్రి తన ప్రశంస ను వ్యక్తం చేశారు.  

టీకా మందు తయారీ రంగం సహా, యుఎస్ కు, భారతదేశానికి మధ్య ఆరోగ్య సంబంధి సరఫరా శ్రేణి ని బలపరచే దిశ లో ప్రస్తుతం సాగుతున్న ప్రయాసల ను గురించి నేత లు చర్చించారు.  వారు భారతదేశం- అమెరికా భాగస్వామ్యానికి గల కార్య సామర్థ్యాన్ని, దీనితో పాటు మహమ్మారి తాలూకు దీర్ఘకాలిక ఆరోగ్య సంబంధి ప్రభావాన్ని పరిష్కరించడం లో క్వాడ్ తాలూకు టీకా మందు సంబంధి కార్యక్రమాన్ని గురించి కూడా ప్రముఖం గా ప్రస్తావించారు.

ప్రపంచం లో ఆరోగ్య స్థితిగతులు సాధారణ స్థాయి కి వచ్చిన అనంతరం ఉపాధ్యక్షురాలు హ్యారిస్ గారి ని త్వరలోనే భారతదేశం సందర్శన కు స్వాగతించాలని ఆశ పడుతున్నానని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.




 

***



(Release ID: 1724276) Visitor Counter : 216