మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఉత్తీర్ణత ధృవపత్రం చెల్లుబాటు గడువు ఏడేళ్ల నుంచి జీవితకాలానికి పొడిగింపు: శ్రీ రమేష్ పోఖ్రియాల్
Posted On:
03 JUN 2021 1:41PM by PIB Hyderabad
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఉత్తీర్ణత ధృవపత్రం చెల్లుబాటు గడువును ఏడేళ్ల నుంచి జీవితకాలానికి పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు. 2011 నుంచి ఇది వర్తిస్తుందన్నారు. ఇప్పటికే ఏడేళ్లు పూర్తయిన టెట్ ధృవపత్రాల పునఃధృవీకరణకు లేదా కొత్తగా జారీ చేయడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చర్యలు తీసుకుంటాయని చెప్పారు.
ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకునేవారికి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడానికి తీసుకున్న ముందడుగుగా ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అభివర్ణించారు.
పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియామకం పొందాలంటే టెట్ ఒక తప్పనిసరి అర్హత. టెట్‌ను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయని, ఆ ధృవపత్రం ఏడేళ్ల వరకు చెల్లుబాటు అవుతుందని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) 2011 ఫిబ్రవరి 11న మార్గదర్శకాలు విడుదల చేసింది.
*****
(Release ID: 1724040)
Visitor Counter : 233
Read this release in:
Odia
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada