వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ప్రభుత్వ సేకరణ పోర్టల్, జిఈఎంలో మరింత మందికి ప్రాతినిధ్యం కల్పించాలన్న శ్రీ పీయూష్ గోయల్


రైల్వేల ఈ- ప్రొక్యూర్మెంట్ వ్యవస్థతో జిఈఎం పోర్టల్ ఏకీకరణ వల్ల ఎంతో ఆదా చేయడానికి అవకాశముంటుందని అన్నారు

Posted On: 01 JUN 2021 3:34PM by PIB Hyderabad

ప్రభుత్వ అవసరాల కోసం ఉత్పత్తులు మరియు సేవలను  సేకరించడానికి  ప్రభుత్వ సేకరణ పోర్టల్,  ప్రభుత్వ ఈ- మార్కెట్ ప్లేస్  జిఈఎం పరిమితిని విస్తరించాలని మరియు  పోర్టల్ లో మరింత మందికి ప్రాతినిధ్యం కల్పించాలని కేంద్ర రైల్వే, వాణిజ్య & పారిశ్రామిక మరియు వీనియోగదారుల వ్యవహారాలు ,  ఆహార మరియు ప్రజాపంపిణీ  శాఖల మంత్రి  శ్రీ  పీయూష్ గోయల్  పిలుపు ఇచ్చారు.  జిఈఎం మరియు కేంద్ర వాణిజ్య శాఖ అధికారులతో  జరిపిన సమావేశంలో మాట్లాడుతూ దీనివల్ల  అన్ని కేంద్ర మరియు రాష్ట్ర కార్యాలయాలు, ప్రభుత్వరంగ సంస్థల  అవసరాలు తీర్చే  ఏక  ఛత్ర దుకాణం (వన్ స్టాప్ షాప్)గా మార్చడమే కాక ఎంఎస్ఎంఈలు తమ ఉత్పత్తులను ప్రదర్శించే అవకాశం కలుగుతుందని  కూడా మంత్రి తెలిపారు.  

 పూర్తిగా  కాగితరహిత, నగదురహిత మరియు కంప్యూటర్ వ్యవస్థపై ఆధారపడిన ఈ- మార్కెట్ ప్లేస్ గా ఉండి సాధారణ  అవసరాలలో ఉపయోగించే వస్తువులు మరియు సేవలను అతి తక్కువ మానవ జోక్యంతో పొందగలుగుతున్నందుకు జిఈఎం పోర్టల్ ను  మంత్రి ప్రశంసించారు.     దీని  పనితీరుపట్ల  గౌరవనీయ ప్రధానమంత్రి ఎంతో ఆపేక్షతో ఉన్నారని,   పోర్టల్ తదనుగుణంగా పురోగమించాలని శ్రీ గోయల్ అన్నారు.   పోర్టల్ లో అమ్మకందారులు  జతకట్టి హెచ్చు ధరల సమాహారంగా మారకుండా పోర్టల్ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు.  

కొనుగోలుదార్లకు  ఐక్య సేకరణ వ్యవస్థ ఏర్పాటు కోసం  రైల్వేల ఈ- ప్రొక్యూర్మెంట్ వ్యవస్థతో  జిఈఎం పోర్టల్ ఏకీకరణను  వేగవంతం చేయాలనీ శ్రీ గోయల్ ఉద్ఘాటించారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు  ఎంతో  ఆదా అవుతుందని అన్నారు.  అంతేకాక  పెట్రోలియం ,  ఉక్కు రంగాల ఉత్పత్తుల భారీ సేకరణకు మార్గం సుగమం అవుతుందని  కూడా మంత్రి తెలిపారు.  

ఐక్య సేకరణ వ్యవస్థపై రైల్వే కొనుగోలుదారుల ప్రయోగాత్మక వేలంపాట ఆగస్టు చివరలో ప్రారంభం కాగలదని ఆశిస్తున్నారు.   పైన పేర్కొన్న ఏకీకరణ తరువాత జిఈఎం పోర్టల్ పై  రైల్వేలు  రూ. 50,000 కోట్ల  విలువైన వార్షిక కొనుగోళ్లను జరిపే అవకాశముంది.
 
జిఈఎం పరిమితి మరియు ప్రభావంలో  సత్వర ప్రగతి జరిగింది.  2020-21 ఆర్ధిక సంవత్సరంలో పోర్టల్ ఆర్దర్ల విలువ రూ 38,620 కోట్లకు పెరిగింది.   పోర్టల్  కేటలాగ్ లో  16,332 ఉత్పత్తులు,  187 సేవలు  ఉన్నాయి.   18.75  లక్షలకు పైగా అమ్మకందారులు,  52 వేలకు పైగా  కొనుగోలుదారులు  నమోదుచేసుకున్నారు.    ప్రత్యేకంగా  'వస్తువులు'  మరియు  'సేవల'  కోసం జాతీయ సేకరణ పోర్టల్ గా  జిఈఎంను ప్రారంభించడం జరిగింది.   అయితే  2020-21 బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న దార్శనిక దృష్టికి అనుగుణంగా ఇప్పుడు  ఈ పోర్టల్  వస్తువులు,  సేవలతో పాటు   "పనుల కాంట్రాక్టుల" కు  "ఐక్య సేకరణ వ్యవస్థ"గా  వృద్ధిచెందే దిశలో ముందుకు సాగుతోంది.  

అదేక్రమంలో  అనేక కోవిడ్-19  సంబంధ యత్నాలు కూడా  జిఈఎం చేపట్టింది.   వాటిలో ఉత్పత్తుల ప్రాధాన్యతను నిర్ణయించడం /  కేటగరీలను ఆమోదించడం ఉన్నాయి.    ముందుగా నిర్ణయించిన  పంపిణీ గడువును మరో 30 రోజులు పెంచారు.  బిడ్ కాల  వ్యవధిని 10 నుంచి 1 రోజుకు తగ్గించారు. అదేవిధంగా పంపిణీ సమయాన్ని  15 నుంచి 2 రోజులకు తగ్గించారు.  2020 మార్చి నుంచి 2021 మే నెల మధ్య కాలంలో  కోవిడ్ -19 సంబంధ ఆర్దరాల విలువ రూ.  7863 కోట్లు,  దానిలో  ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల విలువ రూ.  268 కోట్లు.  

కొనుగోలుదారులు,  అమ్మకందారుల నుంచి అందిన ప్రతిస్పందన ఆధారంగా అనేక కొత్త  అంశాలను, నిర్వాహక పద్ధతులను చేర్చారు:  
కొత్తగా అనేక వేలం నమూనాలను ప్రవేశపెట్టారు  
స్థాపన, ప్రారంభం, శిక్షణ ,  వార్షిక నిర్వహణ /  సమగ్ర నిర్వహణ కాంట్రాక్టులు  
కాంట్రాక్టులకు  వీలు కల్పించడంతో పాటు  ధరల మార్పునకు సంబంధించిన క్లాజు  
చెల్లింపులను జాప్యం చేసే కొనుగోలుదారుల నుంచి వడ్డీ వసూలు పద్ధతిని ప్రవేశపెట్టారు.  
అమ్మకందారుల రేటింగ్ వ్యవస్థను సంస్కరించడం వంటివి ఉన్నాయి.  

 

***


(Release ID: 1723996) Visitor Counter : 148