శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఆక్సిజన్ సమర్ధ భారతదేశం కోసం ఎంఎస్ఎంఇలను సాధికారం చేసేందుకు ఏకోన్ముఖమైన సిఎస్ఐఆర్-సిఎంఇఆర్ ఐ, ఎంఎస్ఎంఇ డిఐ, ఇండోర్, ఇండియన్ మెడికల్ అసోసియేసన్ లఘు ఉద్యోగ్ భారతి
Posted On:
01 JUN 2021 5:05PM by PIB Hyderabad
ఆక్సిజన్ సమర్ధవంతమైన భారతదేశం కోసం ఎంఎస్ఎంఇలను సాధికారం చేసే కృషిలో భాగంగా ఎంఎస్ఎంఇ అభివృద్ధి సంస్థ లఘు ఉద్యోగ్ భారతి, ఎంపి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎంపి, ఇంక్లూసివ్ గ్రోత్ ఫౌండేషన్ సహకారంతో ఆక్సిజన్ శుద్ధి యూనిట్- అవకాశాలు& భారతీయ ఎంఎస్ఎంఇలకు ఆస్కారం అన్న అంశంపై వెబినార్‌ను నిర్వహించింది. దుర్గాపూర్ లోని సిఎస్ ఐఆర్ - సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ (డాక్టర్) హరీష్ హిరానీని ముఖ్యవక్తగా ఆహ్వానించగా, డిఐ, ఇండోర్, ఎంఎస్ఎంఇ జాయింట్ డైరెక్టర్ బి.సి. సాహూ . డిఐ, ఇండోర్, ఎంఎస్ఎంఇ అసిస్టెంట్ డైరెక్టర్ గౌరవ్ గోయల్, లఘు ఉద్యోగ్ భారతీ, ఎంపి, అధ్యక్షుడు మహేష్ గుప్తా, ఎంపి ఐఎంఎ అధ్యక్షుడు డాక్టర్ అర్వింద్ జైన్, వైద్య రంగానికి చెందిన వారితో సహా 100 మంది భాగస్వాములు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రస్తుతం ఆక్సిజన్ అవసరాలను ఒకమాదిరి స్థాయిలో తీర్చగలుగుతున్నప్పటికీ, ఇంజినీరింగ్, వైద్య రంగ, ఎంఎస్ఎంల మధ్య సహకారం అనేది నిలకడైన పరిష్కారానికి అత్యవసరమని సిఎస్ఐఆర్-సిఎంఇఆర్ ఐ ప్రొఫెసర్ (డాక్టర్) హరీష్ హిరానీ అన్నారు. అందరు భాగస్వాములు పని చేయడం అన్నది ఆత్మనిర్భర్ భారత్ అన్న నినాదపు వాస్తవ స్ఫూర్తి అని, ఆక్సిజన్ విషయంలో మనం స్వయం సమృద్ధిని కలిగి ఉండగలమని అన్నారు. సైన్సును సమాజంతో సహకార పద్ధతిలో సమన్వయం చేసినప్పుడు సమాజంలోని భాగస్వాములందరికీ ఇది ఉపయుక్తమైన పరిస్థితిని కల్పిస్తుందన్నారు. నిలకడైన, దీర్ఘకాలిక పరిష్కారాలకు పద్ధతుల గురించి ఆయన చర్చించారు. ఈ విషయంలో, గ్రామీణ ప్రాంతంలోని ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో వనరుల లభ్యత అవసరాన్ని నొక్కి చెప్పారు. అలాగే, ఎక్కువగా ఇన్ఫెక్షన్‌కు గురికానున్న శిక్షణ పొందిన వైద్య సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది లేమి గురించి ఆయన మాట్లాడారు.
FiO2 సరఫరా రేటు పై నియంత్రణ అవసరాన్నిపేర్కొంటూ, వైద్యులు తగిన ఆక్సిజన్ థెరపీని ఇచ్చేందుకు ఈ రెండు పారామితులు వైద్యులు చికిత్సనందించేటప్పుడు అవసరమని ప్రొఫెసర్ హిరానీ అన్నారు. ప్రస్తుతం ఆసుపత్రులలో ఉనికిలో ఉన్న మౌలిక సదుపాయాలను దృష్టిలో పెట్టుకుని హైబ్రిడ్ సిస్టం కన్ఫిగరేషన్ మోడల్‌పై సంస్థ పని చేస్తోందని చెప్పారు. ఇది చిన్న ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్స్‌కు ఎంతో తోడ్పుతుందన్నారు. దాని లాభాలను పరిగణనలోకి తీసుకుంటే, అటువంటి యూనిట్లు దేశంలో మరిన్ని రానున్నాయి. ఇవి ఆక్సిజన్ సిలెండర్లతో పోలిస్తే ఎక్కువగా ఉండనున్నాయి. ఎందుకంటే, యూనిట్లు పెరుగుతుండగా, ఒఇయు 50% తక్కువ ధరకు అందుబాటులోకి రానుంది.
ఆత్మనిర్భర్ మధ్య ప్రదేశ్ కోసం ఎంపిలోని ప్రతి జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు కోసం దార్శనికత తమ వద్ద ఉంని ఎంఎసిఎంఇ, డిఐ, ఇండోర్ జాయింట్ డైరెక్టర్ బి.సి. సాహూ అన్నారు. అటువంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు/ ఒఇయు కోసం 50% సబ్సిడీని ఎంపి ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం ప్రశంసనీయ చర్య అన్నారు. సమాజ లబ్ధి కోసం వివిధ పథకాల ద్వారా ఎంఎస్ ఎంఇ వ్యాపారవేత్తలు, సిఎస్ఐఆర్- సిఎంఇఆర్ ఐతో సహకరిస్తున్న స్టార్టప్‌లు సమస్యకు పరిష్కారాలను అందించేందుకు అవకాశాలను కల్పించేందుకు ఎంఎస్ఎంఇ సాధ్యమైనంత చేస్తుందని ఆయన అన్నారు. పలు ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకునేందుకు పిపిపి పద్ధతిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో ప్లాంట్లను ఏర్పాటు చేయవలసిందిగా వాణిజ్యవేత్తలను ఆయన ప్రోత్సహించారు.
తమతో, ముఖ్యంగా సిఎస్ఐఆర్-సిఎంఇఆర్ఐతో కలిసి అటువంటి సాంకేతికతను ఆవిష్కరిస్తూ ఎంఎస్ఎంఇ వెబినార్‌ను ఏర్పాటు చేయడాన్ని లఘు ఉద్యోగ్ భారతి, ఎంపి అధ్యక్షుడు మహేష్ గుప్తా కొనియాడారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఈ సాంకేతిక సర్వరోగ నివారిణి వంటిదని, దీనిని గ్రామీన ప్రాంతాలలో ఎక్కువగా స్వీకరించాలని ఆయన కోరారు. భవిష్యత్తులో కూడా ఈ ఉత్పత్తి అవసరం కొనసాగుతుందని అన్నారు. కనుక, మన దేశాన్ని ఆక్సిజన్‌లో స్వయం సమృద్ధి చేసేందుకు వివిధ ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకొని అటువంటి ఉత్పత్తి ఉత్పాదకతను గరిష్టం చేయడం కోసం లఘు ఉద్యోగ భారతి కృషి చేస్తోందన్నారు.
సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు సిఎస్ఐఆర్-సిఎంఇఆర్ ఐ నూతన పద్ధతిని అనుసరించడాన్ని ఐఎంఎ, ఎంపి అధ్యక్షుడు డాక్టర్ అనూప్ నిగమ్ కొనియాడారు. మార్కెట్లో అనేక కాన్సన్ట్రేటర్లు, సిలెండర్లు అందుబాటులో ఉన్నాయని, అయితే వ్యర్ధాలను, ధర, ఆక్సిజన్ దురపయోగాన్ని పరిగణనలోకి తీసుకుని, అటువంటి నూతన ఉత్పత్తిని అభివృద్ధికి సంస్థ చొరవ తీసుకోవడం కొనియాడదగిన అంశమన్నారు. ఆక్సిజన్ ఉపయోగంలో పొదుపు చాలా ముఖ్యమన్నారు. సంస్థ 10-15 పడకల ఆసుపత్రుల కోసం యూనిట్‌ను అభివృద్ధి చేయడాన్ని డాక్టర్ నిగమ్ ప్రశంసించారు. ఎంఎస్ఎంఇల కోసం అటువంటి ఉత్పత్తుల అభివృద్ధి కోసం ఐఎంఎ సహకారంతో చేస్తున్న కృషికి సాధ్యమైనంత మద్దతు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఆ ఉత్పత్తిని ప్రాణాలను కాపాడే పరికరంగా అభివర్ణిస్తూ, దేశంలో అటువంటి ఉత్పత్తిని అభివృద్ధి చేసినందుకు ప్రొఫెసర్ హిరానీని ఐఎంఎ, ఎంపికి చెందిన డాక్టర్ అర్వింద్ జైన్ అభినందించారు. అనేకమంది వ్యాపారవేత్తలు సిఎస్ఐఆర్-సిఎంఇఆర్ ఐ నుంచి ఈ సాంకేతికతను తీసుకున్నారన్నారు. ఇది ఆత్మనిర్భర్ భారత్ దిశగా గొప్ప అడుగు అని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో వివిధ స్థాయిల గురించి మాట్లాడుతూ, దానిని ప్రాథమిక స్థాయిలో ఉపయోగించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
ఒఇయుపై ఆరోగ్యకరమైన చర్చను అభినందిస్తూ, ముఖ్యంగా మహమ్మారిని నియంత్రించేందుకు ఆరోగ్య, ఫార్మా రంగ ఉత్పత్తుల ఉత్పాదకత కోసం ఎస్ఐడిబిఐ అందిస్తున్న ఆర్ధిక సహాయం గురించి వివరణాత్మకమైన ప్రెసెంటేషన్ ను ఎస్ఐడిబిఐ ఎజిఎం అమిత్ సేథీ ఇచ్చారు.
***
(Release ID: 1723546)
Visitor Counter : 198