ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో వాక్సినేషన్ ప్రగతిపై సమీక్ష నిర్వహించిన కేంద్రప్రభుత్వం
జూన్ 2021 నాటికి చెప్పుకోదగిన స్థాయిలో వాక్సిన్ అందుబాటులోకి రానున్నందున వాక్సినేషన్‌ను వేగవంతంగ చేసేందుకు మార్గాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ఇంటికి దగ్గరలో వాక్సినేషన్ కేంద్రాల ఏర్పాటును గరిష్ఠస్థాయికి తీసుకువెళ్లనున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
వాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు ప్రైవేటు ఆస్పత్రుల ప్రమేయం పెంపు
Posted On:
31 MAY 2021 6:27PM by PIB Hyderabad
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కోవిడ్ -19 వాక్సినేషన్ కార్యక్రమాన్ని సమీక్షించడం, పర్యవేక్షించడం, సానుకూల మార్గనిర్దేశం చేయడంలో భాగంగా కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ (ఎం.ఒ.హెచ్.ఎఫ్.డబ్ల్యు) ఈరోజు వీడియా కాన్ఫరెన్సుద్వారా సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పాలనా యంత్రాంగాలు పాల్గొన్నాయి. రాష్ట్రాలలో వాక్సినేషన్ కార్యక్రమం పురోగతిపై ఈ సమావేశంలో సమీక్ష నిర్వహించారు. వాక్సినేషన్ ప్రక్రియను పెంచేందుకు రాష్ట్రాలకు మరింత వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో అలాగే 2021 జూన్‌కు వాక్సిన్ సరఫరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంలో సాగిస్తున్న సమష్టి కృషిని అభినందించారు. మే 2021 కి సంబంధించి సరఫరా అయిన ఆక్సన్ పూర్తి కావచ్చింది. అలాగే ముందు ముందు కూడా వాక్సిన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు అవకాశం ఉందని ఆయన అన్నారు. 2021 జూన్‌లో అందుబాటులోకి వచ్చే మొత్తం వాక్సిన్ పెరగనుంది. (వాక్సిన్ విజిబిలిటీ క్యాలండర్ ద్వారా ఇప్పటికే వారికి ఈ సమాచారం అందించడం జరిగింది)సుమారు 12 కోట్ల డోస్‌లు ( 11,95,70,000) రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలకు 2021 జూన్‌లో అందుబాటులోకి రానున్నాయి. దీనితో అవి తమ వాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత పెంచడానికి వీలుకలుగుతుంది.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలవద్ద తరిగిపోతున్న నిల్వలకు అందుబాటులో ఉన్న బఫర్ నిల్వలనుంచి వాక్సిన్‌ను సమకూర్చనున్నదన, దీనివల్ల వాక్సినేషన్ ప్రక్రియ స్థిరంగా కొనసాగడానికి వీలు కలుగుతుందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి హామీ ఇచ్చారు.
కోవిడ్ -19 మహమ్మారి నుంచి దేశంలోని ప్రజలను కాపాడేందుకు వాక్సినేషన్ ఒక ఉపకరణమని, ఇందుకు సంబంధించి అత్యున్నత స్థాయిలో సమీక్షించడం, పర్యవేక్షించడం జరుగుతుందని ఆయన అన్నారు. వాక్సినేషన్‌కు సంబంధించి అందరు భాగస్వాములతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన మీదట చేపట్టిన దశలవారీ, ముందస్తు, సానుకూల విధానం ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నదని , రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మరింత వెసులుబాటు కల్పిస్తుందని ఆయన అన్నారు.
కమ్యూనిటీ ఆధారిత ఔట్ రీచ్ విధానం పై దృష్టి కేంద్రీ కరించడం జరిగింది. దీనిని నాన్ హెల్త్ ఫెసిలిటీ ఆధారిత ప్రదేశాలలో , వయోధికులు, దివ్యాంగులకు ఉపయోగపడే రీతిలో ఇంటికి దగ్గరలో ( ఉదాహరణకు కమ్యూనిటి సెంటర్, ఆర్.డబ్ల్యు ఎ సెంటర్, కార్యాలయం, పంచాయత్ ఘర్, పాఠశాల భవనం, వయోధికుల సంరక్షణాలయాలు వంటివి) వీటిని ఏర్పాటు చేయడంపై దృష్టిపెట్టడం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపడం జరిగింది. ఈ మార్గదర్శకాలు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
https://www.mohfw.gov.in/pdf/GuidanceNeartoHomeCovidVaccinationCentresforElderlyandDifferentlyAbledCitizens.pdf]
ఇంటికి దగ్గరలో ఏర్పాటయ్యే వాక్సినేషన్ కేంద్రాల సంఖ్యను పెంచాలని, ఈ సివిసిలను వినియోగించడంపై ప్రజలలో అవగాహన కల్పంచాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరడం జరిగింది.
ఎన్.హెచ్‌సివిసి ప్రదేశాల గుర్తింపు, ప్రస్తుత సివిసిలతో అనుంధానం గురించి పునురుద్ఘాటించడం జరిగింది. వాక్సినేషన్‌ను ఎన్.హెచ్‌సివిసి ని చేపట్టేందుకు రాష్ట్రాలు ,కేంద్రపాలిత ప్రాంతాలు ప్రస్తుత కోవిడ్ వాక్సినేషన్ కేంద్రాల(సివిసి)ను గుర్తించి , ప్రత్యేకంగా ప్రకటించాలి. డిజిగ్నేట్ చేసిన సివిస నోడల్ అధికారి, ప్రతిపాదిత ఎన్‌హెచ్ సివిసిల కు మూడు రూములు, వాక్సినేషన్‌కు తగిన వసతి, సీనియర్ సిటిజన్లకు , ప్రత్యేక అవసరాల వారికి అందుబాటులో ఉండడం, ఎఇఎఫ్ ఐని నిర్వహించడం, ఇంటర్నెట్ సదుపాయం ఉండడం వంటివి చూసుకోవాలి. సివిసి కి ఏర్పాటు చేసిన ఇంఛార్జ్ నోడల్ అధికారి వాక్సిన్, లాజిస్టిక్‌లు, వాక్సినేషన్ టీమ్ వాక్సినేషన్ రోజు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
కోవిడ్ వాక్సినేషన్‌కు సంబంధించచి ప్రైవేట్ ఆస్పత్రుల పాత్రను సానుకూలంగా పెంచేందుకు చర్యలు తీసుకోవలసిందిగా సూచించడం జరిగింది వాక్సిన్ తయారీదారులు, ప్రైవేటు ఆస్పత్రులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని వాక్సిన్ సకాలంలో అందుబాటులో ఉండేట్టు చూసేందుకు ఇద్దరు లేదా ముగ్గురితో ఒక బృందాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు.
.
అలాగే కోవిడ్ వాక్సినేషన్ సమయంలో వృధాను గణనీయంగా తగ్గించేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు స్పష్టం చేయడం జరిగింది. ఇది ప్రజారోగ్య ఉత్పత్తి కనుక దీనిని గరిష్టంగా ప్రజలకు వినియోగించాలని తెలియజేసింది. మోత్తం మీద చూసినపుఉడు వృధాను చెప్పుకోదగిన స్థాయిలో తగ్గించడం జరిగిందని , అయిత ఇంకా పలు రాష్ట్రాలలో వృధాను చాలావరకు తగ్గించాల్సి ఉందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి అన్నారు. వాక్సిన్‌ను జాగ్రత్తగా వినియోగించేందుకు వీలుగా వాక్సినేటర్లకు పునశ్చరణ నిర్వహించాలని , పునఃశిక్షణ ఇవ్వాలని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు.
***
(Release ID: 1723257)