సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

జాతీయ హెల్ప్ లైన్ నెంబర్లకు ప్రాచుర్యం కల్పించడానికి సూచనలు

Posted On: 30 MAY 2021 5:21PM by PIB Hyderabad

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అన్ని ప్రైవేట్ టెలివిజన్ ఛానెళ్లకు టిక్కర్ ద్వారా లేదా తగిన మార్గాల ద్వారా జాతీయ హెల్ప్‌లైన్ నంబర్లపై అవగాహన కల్పించడానికి ప్రత్యేకించి ప్రైమ్ టైం లో ప్రచారం కల్పించడానికి సలహా సూచనలను జారీ చేసింది.

 

1075

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 

1098

కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద ఉన్న చైల్డ్  హెల్ప్ లైన్ నెంబర్. 

14567

కేంద్ర సామజిక న్యాయం, సాధికార మంత్రిత్వ శాఖ వృద్ధుల హెల్ప్ లైన్ నెంబర్

(ఎన్‌సిటి ఢిల్లీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్)

 

08046110007

మానసిక సమస్యలకు సంబంధించిన నిమ్హాన్స్ హెల్ప్‌లైన్ నెంబర్ 

 

ఈ జాతీయ హెల్ప్‌లైన్ నంబర్లు పౌరుల ప్రయోజనం కోసం ప్రభుత్వం సృష్టించాయి మరియు ప్రచారం చేశాయి. 

గత కొన్ని నెలలుగా, ముద్రణ, టీవీ, రేడియో, సోషల్ మీడియాతో సహా వివిధ మాధ్యమాలు, మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కోవిడ్ చికిత్స ప్రోటోకాల్, కోవిడ్  తగిన ప్రవర్తన మరియు టీకా అనే మూడు కీలకమైన అంశాలపై అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వం తగు సూచనలు చేసింది. ప్రజలకు అవగాహనను కలిపించడం ద్వారా ఈ అంటువ్యాధిని ఎదుర్కోవడంలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను భర్తీ చేయడంలో ప్రైవేట్ టీవీ ఛానెల్స్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించినందుకు అడ్వైజరీ ప్రశంసిస్తుంది. పైన పేర్కొన్న మూడు సమస్యల గురించి ప్రజలలో ఇంకా చైతన్యం తేవడానికి మరింత అవగాహన పెంచడానికి, నాలుగు జాతీయ స్థాయి హెల్ప్‌లైన్ సంఖ్యలపై అవగాహన పెంచాలని, ప్రైవేట్ టీవీ ఛానెళ్లకు తగు సూచనలు చేయాలనీ అడ్వైజరీ ద్వారా విజ్ఞప్తి చేశారు.

***(Release ID: 1723068) Visitor Counter : 48