ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

అంగవైకల్యం కలిగిన వారు, పెద్దలకు వారి ఇళ్ల సమీపంలో కోవిడ్ వాక్సినేషన్ కేంద్రాల్లో (ఎన్ హెచ్ సి వి సి ) టీకాలు ఇవ్వడంపై రాష్ట్రాలు/ యూటీలకు మార్గదర్శకాలు జారీచేసిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ


సామాజిక భవనాలు, ఆర్‌డబ్ల్యుఎ కేంద్రం, గ్రూప్ హౌసింగ్ సొసైటీ కేంద్రం , పంచాయతీ భవనాలు , స్కూల్ భవనాలు మొదలైన వాటిలో సామూహిక టీకాల కార్యక్తమం

వాక్సిన్ తీసుకోని లేదా మొదటి డోస్ తీసుకున్న 60 సంవత్సరాలు పైబడినవారు, అంగవైకల్యం కలిగి 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగినవారు ఎన్ హెచ్ సి వి సిలో టీకాలు పొందడానికి అర్హత కలిగి ఉంటారు

సార్వత్రిక టీకాల కార్యక్రమం అనుభవాలతో ఎన్ హెచ్ సి వి సిలలో పెద్దలు. అంగవైకల్యం కలిగినవారికి టీకాలు

Posted On: 27 MAY 2021 4:47PM by PIB Hyderabad

పెద్దలు, అంగవైకల్యం కలిగినవారికి వారి ఇళ్లకు సమీపంలోనే ఎన్ హెచ్ సి వి సిలలో టీకాలు ఇచ్చే అంశంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నియమించిన నిపుణుల కమిటీ అందించిన ప్రతిపాదనలకు కోవిడ్-19 టీకాలపై ఏర్పాటైన నిపుణుల కమిటి ( ఎన్ ఇ జి వి ఏ సి ) ఆమోదం తెలిపింది. వీటికి ఆరోగ్యమంత్రిత్వశాఖ కూడా ఆమోదం తెలిపింది. పెద్దలు, అంగవైకల్యం కలిగినవారికి వారి ఇళ్లకు సమీపంలో ఉన్న కోవిడ్ వాక్సినేషన్ కేంద్రాల్లో టీకాలు ఇవ్వడానికి వారికి సౌకర్యవంతంగా ఉండేవిధంగా సమాజ ఆధార విధానాన్ని ఎన్ హెచ్ సి వి అనుసరిస్తుంది. 

వయస్సు, అంగవైకల్యం వల్ల ఎక్కువగా కదలలేని వారికి టీకాలు అందుబాటులోకి తీసుకుని రావడానికి నిపుణుల కమిటీ సిఫార్సులను చేసింది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, భద్రతా ప్రమాణాలను పాటిస్తూ వాక్సిన్ అందుబాటులోకి తీసుకుని రావలసిన ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన సిఫార్సులను అమలు చేయడానికి ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను విడుదల చేయడం జరుగుతోంది. 

ఇతరులకు కోవిడ్ వాక్సినేషన్ కేంద్రాల్లో టీకాల కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఈ కింది అర్హతలు కలిగివున్న పౌరులకు వారి ఇళ్లకు సమీపంలో టీకాల శిబిరాలను నిర్వహించడం జరుగుతుంది. 

 ఎన్ హెచ్ సి వి లో టీకాలు పొందడానికి అర్హత కలిగి వుండే ప్రజలు :

         i.   టీకా లేదా మొదటి మోతాదు టీకా పొందని  60 ఏళ్లు పైబడిన వ్యక్తులందరూ.

         ii.   శారీరక లేదా వైద్య పరిస్థితుల కారణంగా 60 ఏళ్లలోపు వైకల్యం ఉన్న వారందరూ.

దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అన్ని రాష్ట్రాలు/ యూటీలకు జారీ చేసింది. 

మార్గదర్శకాలు :

·         ఆరోగ్య సంబంధిత అంశాలతో సంబంధం లేకుండా టీకాలు ఇవ్వడానికి అవకాశం కలిగి  ఇళ్లకు సమీపంలో ఉండే సామజిక సౌకర్యాలు.  ఉదా.  కమ్యూనిటీ సెంటర్, నివాస ప్రాంతాల సంక్షేమ సంఘం కేంద్రం  / ఆఫీస్, పంచాయతీ కార్యాలయం , పాఠశాల భవనాలు, వృద్ధాప్య గృహాలు మొదలైనవి .

·         అర్హతగల ప్రజల సంఖ్య ఆధారంగా  జిల్లా టాస్క్ ఫోర్స్ (డిటిఎఫ్) / అర్బన్ టాస్క్ ఫోర్స్ (యుటిఎఫ్) ఎన్‌హెచ్‌సివిసి  నిర్వహించే కేంద్రాన్ని నిర్ణయిస్తుంది. సాధ్యమైనంత ఎక్కువ మందికి సేవలను అందించి, వ్యాక్సిన్ వ్యర్థాలను తగ్గించడంతో పాటు ప్రస్తుత ఆరోగ్యంపై ఒత్తిడిని తగ్గించేవిధంగా ఈ సేవలకు రూపకల్పన చేస్తారు.

·          టీకాల కార్యక్రమంలో సామాజిక వాక్సిన్ కేంద్రం పర్యవేక్షణలో ఈ  ఎన్ హెచ్ సి వి సి పనిచేస్తుంది.  టీకాల సరఫరా ,రవాణా  మరియు టీకాలు ఇవ్వడానికి అవసరమైన సిబ్బందిని అందించే బాధ్యత సివిసి ఇన్‌ఛార్జిపై  ఉంటుంది.

·     సామాజిక  సంస్థలు, నివాస ప్రాంతాల సంక్షేమ సంఘాల సహకారంతో  ఎన్ హెచ్ సి వి సి ఏర్పాటు చేయడానికి  ముందుగా స్థలం  గుర్తించబడుతుంది. ఇటువంటి కేంద్రాలు  తగినంత స్థలం కలిగిన సామాజిక భవనాలు ,ఆర్‌డబ్ల్యుఎ ఆవరణ , పోలింగ్ బూత్‌లు, పాఠశాలలు, పంచాయతీ భవనాలు , ఆరోగ్య ఉప కేంద్రాలు మరియు హెల్త్  వెల్నెస్ కేంద్రాల్లో ఏర్పాటు అవుతాయి. వీటిలో టీకాలు వేసే గది మరియు వేచి ఉండే సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలి.టీకాలు తీసుకోవడానికి వచ్చే వారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వీల్ చైర్ సౌలభ్యం, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మార్గదర్శకాల ప్రకారం టీకా తీసుకున్న తరువాత 30 నిమిషాలపాటు వేచి ఉండడానికి సౌకర్యాలను వీటిలో ఏర్పాటు చేయాలి. 

·         సివిసి ప్రమాణాలకు అనుగుణంగా గుర్తించబడి  ధృవీకరించిన తర్వాత, అటువంటి  కేంద్రాలు కోవిన్ పోర్టల్‌లో ఎన్‌హెచ్‌సివిసిగా నమోదు  చేయబడతాయి .

·         స్థానిక పరిస్థితులు మరియు అవసరాలకు అనుగుణంగా ప్రతిపాదిత ప్రణాళికను సర్దుబాటు చేయడానికి పూర్తి సౌలభ్యంతో, ఎన్‌హెచ్‌సివిసి వద్ద టీకాల ప్రణాళిక మరియు అమలుకు డిటిఎఫ్ / యుటిఎఫ్ బాధ్యత వహిస్తుంది.

·         NHCVC లోని ప్రతి బృందంలో   ఐదుగురు సభ్యులు ఉంటారు - టీమ్ లీడర్ (తప్పనిసరిగా డాక్టర్), టీకా, కో-విన్ రిజిస్ట్రేషన్ మరియు / లేదా లబ్ధిదారుని ధృవీకరించడానికి టీకా అధికారి 1, మరియు గుంపు నియంత్రణ కోసం టీకా అధికారి -2 మరియు 3, వ్యాక్సినేటర్ సహాయం, ఏదైనా AEFI మరియు ఇతర మద్దతు కోసం టీకాలు వేసిన తరువాత లబ్ధిదారుల యొక్క 30 నిమిషాల పరిశీలనను నిర్ధారిస్తుంది.

 

·         ఎన్‌హెచ్‌సివిసిలోని  ప్రతి బృందంలో   ఐదుగురు సభ్యులు ఉంటారు - టీమ్ లీడర్ (తప్పనిసరిగా డాక్టర్), టీకా ఇచ్చేవారు , కో-విన్ రిజిస్ట్రేషన్ మరియు / లేదా లబ్ధిదారుని ధృవీకరించడానికి టీకా అధికారి 1, మరియు ప్రజల నియంత్రణ కోసం టీకా అధికారి -2 మరియు 3, వ్యాక్సినేటర్ కు సహాయకారి, టీకా తీసుకున్న తరువాత 30 నిమిషాల పాటు పర్యవేక్షణ చేయడానికి సిబ్బంది .

·         వృద్ధాప్య గృహం వంటి ప్రాంతాల్లో ఎక్కువ మంది లబ్ధిదారులను గుర్తించినప్పుడు  మార్గదర్శకాల ప్రకారం ఈ కేంద్రాలను ఆ ప్రదేశంలో నిర్వహించవచ్చు.

మార్గదర్శకాలకు సంబంధించి ఇతర వివరాలు :

·         లబ్ధిదారుల నమోదు మరియు సమయం కేటాయింపుకు కేంద్రాల వద్ద లేదా  కో-విన్ లో ముందుగానే  ఆన్-సైట్  రిజిస్ట్రేషన్ ప్రక్రియ

·         లబ్ధిదారుల  జాబితా

·                గుర్తించిన కేంద్రం  ఇప్పటికే పనిచేస్తున్న సామాజిక వాక్సిన్ కేంద్రంతో  అనుసంధానం

·         ఎన్‌హెచ్‌సివిసిలో టీకాలను ఇవ్వడానికి స్మూక్షస్థాయి ప్రణాళిక 

·         అవసరమైన చోట వృద్ధులు మరియు ప్రత్యేక అవసరాలున్న వ్యక్తుల కేంద్రానికి సులువుగా చేరడానికి రవాణా సౌకర్యాలను కల్పించడం 

·         టీకా కేంద్రానికి వచ్చే  వృద్ధులు , ప్రత్యేక అవసరాలున్న వ్యక్తులతో  స్నేహపూర్వకంగా మెలగడం 

 అన్ని రాష్ట్రాలు/ యూటీలలో సంబంధిత అధికారులు ఈ మార్గదర్శకాల ప్రకారం తక్షణం సమగ్ర ప్రణాళికను రూపొందించి దానిని ప్రస్తుతం కొనసాగుతున్న నేషనల్ కోవిడ్ -19 టీకా కార్యక్రమంలో భాగంగా అమలు చేయడానికి ఆదేశాలు జారే చేయాలని    కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు మరియు యుటిలకు సూచించింది.

 

***



(Release ID: 1722236) Visitor Counter : 265