రైల్వే మంత్రిత్వ శాఖ
'కోవిడ్ సమయంలో రైల్వేలు అందించిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.సరకుల రవాణాకు ఆటంకం లేకుండా ప్రగతిపథంలో రైల్వేలు పయనిస్తున్నాయి'... శ్రీ పియూష్ గోయల్
కోవిడ్ సమయంలో మూలానిధి కేటాయింపులను పూర్తిగా ఉపయోగించుకుంటూ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూ ఉపాధి అవకాశాలను మరింతగా అందించాలి.. శ్రీ గోయల్
రైల్వే బోర్డు సీఈఓ, జనరల్ మేనేజర్లు, డివిజనల్ రైల్వే మేనేజర్లతో ఈ రోజు జోన్లు, డివిజన్ల పనితీరును సమీక్షించిన రైల్వే, వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖల మంత్రి శ్రీ పియూష్ గోయల్
Posted On:
26 MAY 2021 5:39PM by PIB Hyderabad
కోవిడ్ కట్టడి నివారణకు జరుగుతున్న ప్రయత్నాలకు రైల్వేలు అందించిన సహకారం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.సరకుల రవాణాకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూస్తూ వేగంగా అభివృద్ధి జరిగేలా చూడడానికి రైల్వేలు సహకరించాయి' అని రైల్వే, వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖల మంత్రి శ్రీ పియూష్ గోయల్ అన్నారు. జోన్లు, డివిజన్ స్థాయిలో రైల్వేలు సాధించిన ప్రగతిని ఆయన ఈరోజు రైల్వేశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు.
గత 14 నెలల కాలంలో రైల్వేలు నైతిక బలంతో పనిచేసి ఏ పరిస్థితిని అయినా ఎదుర్కొని పనిచేయగల సామర్ధ్యం తమకు ఉందని రుజువు చేశాయని మంత్రి అన్నారు.
మూలానిధి కేటాయింపులను పూర్తిగా ఉపయోగించుకుంటూ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టే పనుల వల్ల కోవిడ్ సమయంలో ఉపాధి అవకాశాలను కల్పించడానికి అవకాశం కలుగుతుందని మంత్రి అన్నారు.
జాతి సేవలో ప్రాణాలను అర్పించిన రైల్వే ఉద్యోగులకు దేశం రుణపడి ఉంటుందని పేర్కొన్న మంత్రి మరణించినవారికి నివాళులు అర్పించారు.
ఒకప్పుడు కేవలం రవాణా వ్యవస్థగా మాత్రమే ఉన్న రైల్వేలు ప్రస్తుతం దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తూ ముందుకు సాగుతున్నాయని మంత్రి అన్నారు. రైల్వేల అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతిఒక్కరి సహకారంతో రైల్వేలు స్వయం సమృద్ధి సాధిస్తున్నాయని మంత్రి అన్నారు.
కోవిడ్ కు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలోభాగంగా ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లను నడిపి రైల్వేలు దేశానికి ఊపిరి అందించాయని శ్రీ పియూష్ గోయల్ అన్నారు. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లను నడపడానికి వేగంగా స్పందించిన రైల్వేలు తమ సేవలతో ప్రజల ప్రాణాలను రక్షించాయని అన్నారు. రైల్వేలు అందించిన సేవలను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారని మంత్రి అన్నారు. రైల్వేలో ప్రతి ఒక్క ఉద్యోగి పరిస్థితిని అనుగుణంగా పనిచేశారని అన్నారు.
రైల్వేలు తమ కార్యకలాపాలను మరింత సమర్ధంగా నిర్వహించడానికి మానవ వనరులను మరింత ఎక్కువగా ఉపయోగించుకోవలసిన అవసరం ఉందని మంత్రి అన్నారు. వర్కుషాపుల నిర్వహణ మరింత మెరుగుపడవలసి అవసరం ఉందని అన్నారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా రైల్వేలకు ఈసారి మూలానిది కేటాయింపులు ఎక్కువగా జరిగాయని తెలిపిన మంత్రి వీటిని పూర్తిగా ఉపయోగించుకుంటూ మౌలిక వసతులను కల్పించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు.
కోవిడ్ రూపంలో ఎదురైన సవాల్ కు స్పందించిన రైల్వేలు తమ సామర్ధ్యాన్ని మరోసారి నిరూపించుకుని మరింత బలోపేతం అయ్యాయని మంత్రి అన్నారు. ఏ సవాల్ నైనా తాము ఎదుర్కొని విజయం సాధించగలమని రైల్వేలు తెలిపాయని అన్నారు.
2019-20 ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే సరకు రవాణాలో రైల్వేలు 10% అభివృద్ధిని సాధించాయి. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో రైల్వేలు 203.88 మిలియన్ టన్నుల సరకులను రవాణా చేశాయి. 2019-20 ఆర్ధిక సంవత్సరం (184.88 మిలియన్ టన్నులు )తో పోల్చి చూస్తే ఇది 10% ఎక్కువ.
లక్ష్యాల మేరకు సరకులను రవాణా చేయడానికి అహర్నిశలు పనిచేసిన అధికారులను మంత్రి అభినందించారు. గూడ్స్ షెడ్లు, టెర్మినళ్లు, షెడ్ల విద్యుద్దీకరణ, సరకుల రవాణాను యాంత్రీకరించడం లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక సదుపాయాలను మెరుగు పరచాలని మంత్రి సూచించారు.
***
(Release ID: 1722044)
Visitor Counter : 178