జల శక్తి మంత్రిత్వ శాఖ

జల్ జీవన్ మిషన్ కేంద్ర గ్రాంటుగా ఈశాన్య రాష్ట్రాలకు 1,605 కోట్ల రూపాయలు విడుదల


2020-21లో ఈశాన్య రాష్ట్రాల్లో 11 లక్షల కొళాయి కనెక్షన్ల మంజూరు

Posted On: 25 MAY 2021 3:16PM by PIB Hyderabad

జల్ జీవన్ మిషన్ ను అమలు చేయడానికి కేంద్రం ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలకు 1,605 కోట్ల రూపాయలను విడుదల చేసింది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో తొలి విడతగా కేంద్రం ఈ నిధులను విడుదల చేసింది. ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు మరింత వేగంగా అభివృద్ధి సాధించడానికి ఈ నిధులు దోహదపడతాయి. ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తున్న కేంద్రం రక్షిత మంచి నీరు సరఫరా చేసి గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి భారీగా నిధులను విడుదల చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకుంది. 

 

జల్ జీవన్ మిషన్: నిధుల కేటాయింపు, విడుదల

(మొత్తం రూ. కోట్లలో)

ఎస్.

రాష్ట్రం

కేటాయింపు

విడుదల

1.

అరుణాచల్ ప్రదేశ్

  1,013.53

253.38

2.

అస్సాం

  5,601.16

700.00

3.

మణిపూర్

 481.19

120.30

4.

మేఘాలయ

 678.39

169.60

5.

మిజోరం

 303.89

75.97

6.

నాగాలాండ్

 444.81

111.20

7.

సిక్కిం

 124.79

31.20

8.

త్రిపుర

 614.09

142.91

మొత్తం

  9,261.85

   1,604.56

 

ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఈశాన్య ప్రాంత అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. దీనిలో భాగంగాఈ రాష్ట్రాల్లో జల్ జీవన్ మిషన్ అమలుకు 2021-22 ఆర్ధిక సంవత్సరంలో 9,262 కోట్ల రూపాయలను కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. ఈశాన్య ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కొళాయి ద్వారా రక్షిత మంచి నీరు సరఫరా చేయడానికి రూపొందించిన పథకాలు, వీటిని అమలు చేయడానికి విడుదల చేస్తున్న నిధులతో ఈ ప్రాంతాల ఆర్ధిక వ్యవస్థలు మెరుగుపడతాయి. 

కేంద్రం విడుదల చేసిన నిధుల్లో 93 శాతం నిధులను నీటి సరఫరా వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు, అయిదు శాతం నిధులను అనుబంధ పనులకు మిగిలిన రెండు శాతం నిధులను నీటి నాణ్యత పర్యవేక్షణ నిఘా కార్యక్రమాలకు వెచ్చించవలసి ఉంటుంది. రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో అందించవలసిన కొళాయి కనెక్షన్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వాటాల వినియోగం అంశాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులను విడుదల చేస్తుంది. 

కేంద్ర నిధులు విడుదల అయిన 15 రోజులలోగా సంబంధిత రాష్ట్రాలు తమ మాచింగ్ నిధులతో కలిపి ఒక సింగిల్ నోడల్ ఖాతాకు బదిలీ చేయవలసి ఉంటుంది. పనులను చేపట్టి పూర్తి చేసిన సంస్థలకు చెల్లింపులు సక్రమంగా జరిగేలా చూడడానికి రాష్ట్రాలు చర్యలను తీసుకోవలసి ఉంటుంది. ఏడాది పొడవునా నిధులు అందుబాటులో చూడడానికి రాష్ట్రాలు కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించుకోవలసి ఉంటుంది. 

ఈశాన్య రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 90 లక్షల కుటుంబాలు నివసిస్తున్నాయి. వీటిలో అత్యధికంగా అస్సాంలో 63.35 కుటుంబాలు ఉన్నాయి. 2020-21లో ఈ రాష్ట్రాల్లో 11 లక్షల వరకు కొళాయి కనెక్షన్లను ఇచ్చారు. తాజా సమాచారం ప్రకారం ఈశాన్య ప్రాంతంలో 16.27 లక్షల కుటుంబాలకు(18%) కొళాయి ద్వారా మంచి నీరు సరఫరా అవుతోంది. 2019 ఆగస్ట్ 15వ తేదీన ప్రధానమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించిన సమయంలో ఈ సంఖ్య 3.2 లక్షలు (3%)గా ఉంది. 

జల్ జీవన్ మిషన్ అమలుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న కేంద్రం దీనికి బడ్జెట్ కేటాయింపులను కూడా గణనీయంగా పెంచింది. 2021-22లో ఈ పథకానికి కేంద్ర బడ్జెట్ లో 50,011 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. వీటితోపాటు 15వ ఆర్ధిక సంఘం 'నీరు, పారిశుధ్య'పద్దు కింద పంచాయతీరాజ్ సంస్థలకు కేటాయిస్తున్న 26,940 కోట్ల రూపాయలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇవికాకుండా రాష్ట్రాలు తమ వంతు వాటాగా విడుదల చేసే నిధులు, విదేశీ నిధులు కూడా ఉంటాయి. మొత్తం మీద 2021-22 ఆర్ధిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా కార్యక్రమాలపై లక్ష కోట్లకు పైగా నిధులను పెట్టుబడులుగా పెట్టే అవకాశాలు ఉన్నాయి. 

' హర్ ఘర్ జల్' లక్ష్యంగా రానున్న మూడు సంవత్సరాల పాటు ఈ రంగంలో గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే పెట్టుబడులతో స్థానిక ప్రజలకు ఉపాధి లభించడంతో పాటు గ్రామీణ ఆర్ధిక వ్యవస్థలు అభివృద్ధి చెందుతాయి. 

2019 ఆగస్టు 15వ తేదీన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ పథకం రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో కేంద్రం అమలు చేస్తోంది. కోవిడ్-19 రూపంలో ఎదురైన సవాళ్లు, ఆ తరువాత లాక్ డౌన్ వల్ల ఎదురైనా ఇబ్బందులను అధిగమిస్తూ జల్ జీవన్ మిషన్ కింద 4.20 కోట్ల కుటుంబాలకు పైగా (21.8%) కొళాయి కనెక్షన్లను అందిచడం జరిగింది. ప్రస్తుతం దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 7.44 కోట్ల కుటుంబాలు (39%) కొళాయిల ద్వారా నీరు పొందుతున్నాయి. గోవా, తెలంగాణ, అండమాన్  నికోబార్ దీవులు మరియు పుదుచ్చేరి 'హర్ ఘర్ జల్' రాష్ట్రం / యుటిగా మారాయి.పరిపూర్ణత సమానత్వం ప్రాతిపదికన గ్రామంలో ప్రతి ఇంటికి  కొళాయి కనెక్షన్ ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ పథకం అమలు జరుగుతోంది. 61 జిల్లాల్లో ఉన్న 90వేలకు పైగా గ్రామాల్లో ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ అందించడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. తమకు నిర్ధేశించిన లక్యాలను సాధించడానికి కేంద్రపాలిత ప్రాంతాలు/ రాష్ట్రాలు కృషి చేస్తున్నాయి. 

2021-22 కేంద్ర బడ్జెట్ ప్రకటించిన తరువాత జల్ జీవన్ మిషన్ ప్రణాళిక మరియు అమలు గురించి చర్చించడానికి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి  అన్ని రాష్ట్రాల / యుటిల గ్రామీణ నీటి సరఫరా / పిహెచ్‌ఇడి ఇన్‌చార్జి మంత్రులతో సమావేశం అయ్యారు.ఏప్రిల్ తొమ్మిదవ తేదీన  2021-22 ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యే సమయానికి మిషన్ అమలుకు సంబంధించి అనేక సమావేశాలను నిర్వహించిన కేంద్రం కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించింది. గత రెండు సంవత్సరాలుగా సాధించిన ప్రగతిని ఆధారంగా చేసుకుని కీలకమైన మూడవ సంవత్సరంలో అమలు చేయవలసి కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.   

***



(Release ID: 1721661) Visitor Counter : 142