ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్స కోసం ఉపయోగించే యాంఫోటెరిసిన్-బి యాంటీ ఫంగల్ ఔషధ సరఫరా మరియు లభ్యతను పెంచడానికి భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది.
దేశంలో అదనంగా ఐదుగురు తయారీదారులకు లైసెన్స్ ఇచ్చారు
ఇప్పటికే ఉన్న ఐదుగురు తయారీదారులచే ఉత్పత్తి గణనీయంగా పెంపొందించబడింది
Posted On:
21 MAY 2021 2:02PM by PIB Hyderabad
"హోల్ ఆఫ్ గవర్నమెంట్" విధానం ద్వారా కొవిడ్ 19 నిర్వహణ కోసం మందులు మరియు విశ్లేషణలను సేకరించడంలో భారత ప్రభుత్వం రాష్ట్రాలు మరియు యుటిలకు మద్దతు ఇస్తోంది. ఏప్రిల్ 2020 నుండి అవసరమైన మందులు, వైద్య పరికరాలు, పిపిఇ కిట్లు, మాస్క్‌లు మొదలైన వాటి యొక్క లభ్యతను పెంచేందుకు రాష్ట్రాలు మరియు యుటిలకు కేంద్ర ప్రభుత్వం ముందుగానే మద్దతు ఇస్తుంది.
ఇటీవలి రోజుల్లో అనేక రాష్ట్రాలు మరియు యుటిల్లో కొవిడ్ సమస్యలతో బాధపడుతున్న రోగులు ముకార్మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) బారిన పడుతున్నారు. అలాగే ఈ నేపథ్యంలో బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్సకు ఉపయోగించే యాంటీ ఫంగల్ ఔషధమైన యాంఫోటెరిసిన్-బి కొరత ఉందని రాష్ట్రాలు, యుటీలు చెబుతున్నాయి.
యాంఫోటెరిసిన్-బి ఔషధ దేశీయ ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖతో పాటు ఫార్మాస్యూటికల్స్ విభాగం మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఇఎ) చురుకైన ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రపంచ తయారీదారుల నుండి సరఫరాను పొందడం ద్వారా దేశీయ లభ్యతను భర్తీ చేయడంలో కేంద్ర ప్రభుత్వం సమర్థవంతమైన ప్రయత్నాలు చేసింది.
దేశంలో ప్రస్తుతం ఐదుగురు యాంఫోటెరిసిన్-బి తయారీదారులు మరియు ఒక దిగుమతిదారు ఉన్నారు:
1. భారత్ సీరమ్స్ & వ్యాక్సిన్స్ లిమిటెడ్
2. బిడిఆర్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్
3. సన్ ఫార్మా లిమిటెడ్
4. సిప్లా లిమిటెడ్
5. లైఫ్ కేర్ ఇన్నోవేషన్స్
6. మైలాన్ ల్యాబ్స్ (దిగుమతిదారు)
ఈ సంస్థల ఉత్పత్తి సామర్థ్యం ఏప్రిల్ 2021 నెలలో చాలా పరిమితం చేయబడింది. భారత ప్రభుత్వం హ్యాండ్‌హోల్డింగ్ ఫలితంగా, ఈ దేశీయ తయారీదారులు మే 2021 లో యాంఫోటెరిసిన్-బి 1,63,752 వయల్స్ ఉత్పత్తి చేస్తాయి. జూన్ 2021 నెలలో అది 2,55,114 వయల్స్‌కు పెరుగుతాయి.
ఇది కాకుండా, దిగుమతి ద్వారా ఈ ఫంగల్ వ్యతిరేక ఔషధం యొక్క దేశీయ లభ్యతను భర్తీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మే 2021 లో యాంఫోటెరిసిన్-బి యొక్క 3,63,000 వయల్స్ దిగుమతి చేయబడతాయి. తద్వారా దేశంలో మొత్తం లభ్యత (దేశీయ ఉత్పత్తితో సహా) 5,26752 వయల్స్‌గా ఉంటుంది.
జూన్ 2021 లో 3,15,000 వయల్స్ దిగుమతి అవుతాయి. అందువల్ల, దేశీయ సరఫరాతో పాటు, దేశవ్యాప్తంగా యాంఫోటెరిసిన్-బి లభ్యత జూన్ 2021 లో 5,70,114 వయల్స్‌కు పెంచబడుతుంది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క చురుకైన ప్రయత్నాల ఫలితంగా, మరో ఐదుగురు తయారీదారులకు దేశంలోనే ఫంగల్ వ్యతిరేక ఔషధాన్ని ఉత్పత్తి చేయడానికి లైసెన్స్ ఇవ్వబడింది. అవి:
1. నాట్కో ఫార్మాస్యూటికల్స్, హైదరాబాద్
2. అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్, వడోదర
3. గుఫిక్ బయోసైన్సెస్ లిమిటెడ్, గుజరాత్
4. ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్, పూణే
5. లైకా, గుజరాత్
ఈ కంపెనీలు జూలై 2021 నుండి నెలకు 1,11,000 యాంఫోటెరిసిన్-బి వయల్స్‌ను ఉత్పత్తి చేయటం ప్రారంభిస్తాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు ఫార్మాస్యూటికల్స్ డిపార్ట్‌మెంట్ కలిసి ఈ ఐదు తయారీదారులను ఉత్పత్తిలో కొంత భాగాన్ని ముందస్తుగా అందించడానికి ప్రయత్నిస్తున్నాయి. తద్వారా ఈ అదనపు సరఫరా జూన్ 2021 లో ప్రారంభమవుతుంది.
దీనికి మించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎంఈఎ సహకారంతో ఇతర ప్రపంచ వనరులను కూడా చురుకుగా అన్వేషిస్తోంది. ఇక్కడ నుండి యాంఫోటెరిసిన్-బి ఔషధాన్ని దిగుమతి చేసుకోవచ్చు. బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగించే ఇతర యాంటీ ఫంగల్ ఔషధాలను సేకరించడానికి కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోంది.
****
(Release ID: 1720600)
Visitor Counter : 228