మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
కోవిడ్ పరిస్థితులను ఎదుర్కొవడం, ఆన్ లైన్ విద్య తదితర అంశాలపైఐఐఎస్‌సి, ఐఐటిలు, ట్రిపుల్ ఐటిలు, ఐఐఎస్ఇఆర్‌లు, ఎన్.ఐ.టి డైరక్టర్లతో సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్
Posted On:
20 MAY 2021 5:26PM by PIB Hyderabad
కేంద్ర విద్యా శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఐఐఎస్‌సిలు, ఐఐటిలు, ట్రిపుల్ ఐటిలు ఐఐఎస్ఇఆర్, ఐఐఎస్ఇఆర్, ఎన్.ఐ.టి ల డైరక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్సుకు అధ్యక్షత వహించారు.విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధౌత్రే కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే విద్యామంత్రిత్వశాఖ కు చెందిన ఉన్నత విద్య కార్యదర్శి శ్రీ అమిత్ ఖరే, ఐఐటిలు, ఐఐఎస్‌సిలు, ఐఐఎస్ఇఆర్‌లు, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటిల డైరక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కోవిడ్ -19 పరిస్తితిని సమర్ధంగా ఎదుర్కొనేందుకు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవడంతోపాటు, జాతీయ ప్రాధాన్యతగల ఈ సంస్థలలో విద్యానాణ్యతను పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సంస్థలలో ఆన్‌లైన్ విద్య, వర్చువల్ లేబరెటరీ కోర్సులకు సంబంధించి కూడా కేంద్ర మంత్రి సమీక్షజరిపారు. 2020 మార్చి లొ తొలుత లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఈ విద్యా సంస్థలలో ఆన్‌లైన్ విద్యను ప్రారంభించినట్టు ఈ సంస్థల డైరక్టర్లు తెలిపారు. కొన్ని విద్యా సంస్థలు తమకు ప్రత్యేకంగా ఆన్‌లైన్ టీచింగ్, ఎవాల్యుయేషన్ కోసం యాప్‌లను రూపొందించినట్టు తెలిపారు. కొందరు విద్యార్ధులు కనెక్టివిటి సమస్యలు ఎదుర్కోనే అవకాశం ఉన్నందున లెక్చర్లను తరువాత కూడా వినేందుకు వీలుగా ఎక్కడినుంచైనా డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం కల్పించనట్టు కూడా వారు తెలిపారు. అధ్యాపకులు ఆన్‌లైన్ ద్వారా విద్యార్ధులతో మాట్లాడి వారి సందేహాలు తీర్చడంతోపాటు వారికి మార్గనిర్దేశనం చేస్తున్నారని తెలిపారు.
.ఈ విద్యాసంస్థలలో కోవిడ్ కేసుల పరిస్థితి, దీనిని ఎదుర్కొనేందుకు ఈ సంస్థలు తీసుకుంటున్న చర్యలు కూడా ఈ సందర్భంగా చర్చించారు. ప్రస్తుత పరిస్థితులలో సానుకూల దృక్ఫథం, సానుకూలస్పందనల వల్ల విద్యార్ధులలో, అధ్యాపకులలో అనవసర గందరగోళానికి తావులేకుండా ఉంటుందని మంత్రి అన్నారు. ఈ సంస్థల కృషి సమాజంలో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచడానికి వీలు కలుగుతుందని అన్నారు.
కోవిడ్ -19 నిర్వహణకు సంబంధించి ఆయా సంస్థలు చేపట్టిన వ్యూహాలు ,కోవిడ్ పై ప్రజలకు అవగాహన కల్పించడంలో స్థానిక యంత్రాంగాలకు స్వచ్ఛంద సేవలు అందించడం, ఆయా రాష్ట్రాలలో పరిస్థితులకు అనుగుణంగా తగిన మద్దతు ఇవవ్వడం వంటి విషయాలను వారు వివరించారు. ఆయా విద్యాసంస్థలలో నివశిస్తున్న వారికి వాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయా స్థానిక పాలనా యంత్రాంగాలతో కలసి ప్రభుత్వ మార్గదర్శకాలు అనుగుణంగా చేపట్టిన విషయాన్ని ఆయా సంస్థలు ఈ సందర్భంగా వివరించాయి.
ఈ సమావేశంలో ప్రధాన చర్చ, జాతీయ ప్రాధాన్యతగల ఈ సంస్థలు కోవిడ్ పరిస్థితిని ఎదుర్కొనేందుకు చేపట్టిన పరిశోధనలపై సాగింది. తక్కువ ఖర్చుకాగల ఆర్‌టి-పిసిఆర్ యంత్రాలు, కిట్లు, వెంటిలేటర్లు, కోవిడ్ -19 కు సంబంధించిన ట్రెండ్ ను అంచనా వేయడానికి వీలైన గణిత నమూనాలను ఈ సంస్థలు అభివృద్ధి చేసినందుకు, వీటిని ఆయా రాష్ట్రాల ఆరోగ్య విభాగాలకు అందుబాటులో ఉంచినందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి అభినందనలు తెలిపారు. ఈ పరిశోధన ఉత్పత్తులలో చాలా వరకు ఇంక్యుబేషన్ సెల్స్ , ఆయా సంస్థలు ఏర్పాటు చేసిన స్టార్టప్ సెల్స్ ద్వారా వాణిజ్యపరంగా వినియోగం లోకి కూడా తెచ్చారు.
ఈ సంస్థలు సాగించిన పరిశోధన ఫలితంగా రూపుదిద్దుకున్న వాటిలో కరోనా టెస్టింగ్‌కిట్ కోరోస్యూర్ అలాగే, గది ఉష్ణోగ్రత వద్ద నిల్వచేయడానికి వీలైన వాక్సిన్ అభివృద్ధికి పరిశోధన, వివిధ కరోనా వైరస్ వేరియంట్ల ను గుర్తించేందుకు జెనోమ్ సీక్వెన్సింగ్, పాథోజనిక్ ఇన్‌ఫెక్షన్‌ను సత్వరం గుర్తించేందుకు కోవిరాప్ పరికరం, వెంటిలేటర్లలో ఆక్సిజన్‌ను గరిష్ఠంగా వినియోగించే పద్ధతి,ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ల అభివృద్ది, తక్కువ ఖర్చుకాగల పోర్టబుల్ వెంటిలేటర్లు తదితరాలు ఉన్నాయి.
జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించి, చాలావరకు సంస్థలు కొత్త విభాగాలు, మల్టీ డిప్లినరీ ప్రోగ్రామ్‌లను ఇప్పటికే ప్రారంభించాయి. ఐఐఎస్‌సి బెంగళూరు, ఐఐటి ఖరగ్‌పూర్‌లు వైద్య విద్యలో కొత్త కోర్సులను ప్రారంభించనున్నాయి. అలాగే టీచర్ ట్రైనింగ్, మెంటార్‌షిప్, ఇంటర్నేషనలైజేషన్ ,అకాడమియా, ఇండస్ట్రీ ఇంటరాక్షన్ లపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది.
***
(Release ID: 1720569)
Visitor Counter : 191