విద్యుత్తు మంత్రిత్వ శాఖ

ప‌వ‌ర్‌గ్రిడ్ ద్వారా టీకాల కార్య‌క్ర‌మం

Posted On: 20 MAY 2021 10:32AM by PIB Hyderabad

 

కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని మహారత్న ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ అయిన పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తన ఉద్యోగుల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల‌లో టీకా శిబిరాలను నిర్వహిస్తోంది. కోటా, భివాడి, మిసా, నామ్సాయ్, రూర్కెలా, అరా, బిహార్షరీఫ్, సహర్సా, మరియు ముజఫర్‌పూర్ మొదలైన ప్రాంతాల‌లో టీకా శిబిరాల‌ను ఏర్పాటు చేసింది. ఆయా శిబిరాలలో టీకాలు వేసే ఖర్చును పవర్‌గ్రిడ్ కార్పొరేష‌న్ భరించింది. దేశంలోని వివిధ ప్రదేశాలలో ఏర్పాటు చేసిన శిబిరాల్లో మే 10 -17 2020 వరకు టీకా డ్రైవ్ నిర్వ‌హించారు.   గురుగ్రామ్ సెక్టార్ 43లో మాక్స్ హాస్పిటల్ సహకారంతో మల్టీ పర్పస్ హాల్‌లో (ఎంపీ హాల్) 1600 మందికి పైగా వ్య‌క్త‌లకు టీకాలు వేశారు. టీకాలు తీసుకున్న వారిలో సంస్థ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, వ‌యోవృద్ధులైన సంస్థ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. మాక్స్ హాస్పిటల్స్, ఫోర్టిస్ మరియు ఆర్టెమిస్‌ల సహకారంతో 2021 మార్చి 31 నుండి మే 6 వరకు గురుగ్రామ్‌లోని ఎంపీ హాల్‌లో నిర్వ‌హించిన మరో టీకాల శిబిరంలో 700 మందికి పైగా టీకాలు వేయించుకున్నారు. ఢిల్లీలోని కట్వారియా సారాయ్ కార్యాలయంలో కూడా ప‌వ‌ర్ గ్రిడ్ సంస్థ ఒక టీకా శిబిరాన్ని నిర్వహించింది. ఇక్కడ దాదాపు 290 మందికి పైగా కోవిడ్-19 టీకా తీసుకున్నారు. ఇందులో విద్యుత్ మంత్రిత్వ శాఖ, ఇతర విద్యుత్ పీఎస్‌యులకు చెందిన 80 మందికి పైగా ఉద్యోగులు మరియు వారి కుటుంబ స‌భ్యులు ఉన్నారు. ఈ శిబిరాన్ని అపోలో హాస్పిటల్స్ సహకారంతో ఏర్పాటు చేశారు. ఎన్‌సీఆర్ ప‌రిస‌ర భూభాగంలో ఏర్పాటు చేసిన ఈ మూడు శిబిరాల్లో మొత్తం 2600 మందికి పైగా ప‌వ‌ర్‌గ్రిడ్‌కు చెందిన వారు టీకా తీసుకున్నారు.
ఈ శిబిరాలు 18-44 సంవత్సరాల వయస్సు గల వారికి మరియు 45 ఏళ్లు పైబడిన వారికి కూడా టీకాలు వేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా డ్రైవ్‌ను పూర్తి చేయాలన్న భారత ప్రభుత్వ
ఆలోచ‌న‌కు ప‌వ‌ర్‌గ్రిడ్ ఐక్య‌త‌తో తోడుగా నిలుస్తోంది.
                                 

***


(Release ID: 1720314) Visitor Counter : 157