నీతి ఆయోగ్
విజయయవంతంగా ముగిసిన ఎఐఎం-ఐసిడికె వాటర్ ఇన్నొవేషన్ ఛాలెంజ్
Posted On:
19 MAY 2021 12:05PM by PIB Hyderabad
ఇండో -డానిష్ ద్వైపాక్షిక హరిత వ్యూహాత్మమక భాగస్వామ్యంలో భాగంగా , అటల్ ఇన్నొవేషన్ మిషన్ (ఎఐఎం), నీతి ఆయోగ్ లు డెన్మార్క్ ఇన్నొవేషన్ సెంటర్ తో కలసి తదుపరి జనరేషన్ జలకార్యాచరణ (ఎన్‌జిడబ్ల్యుఎ) వాటర్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇన్నొవేషన్ సెంటర్ ఫర్ డెన్మార్క్ సంస్థ ఎంబసీ ఆఫ్ డెన్మార్క్, డెన్మార్క్ టెక్నికల్ యూనివర్సిటీ కింద పనిచేస్తుంది.
ఎఐఎం- ఐసిడికె వాటర్ ఇన్నొవేషన్ ఛాలెంజ్‌ని ఇండియా నుంచి ఆవిష్కర్తలను గుర్తించేందుకు ఏర్పాటుచేయబడినది. వీరు ఇంటర్నేషనల్ వాటర్ అసోసియేషన్, డెన్మార్క్ టెక్నికల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ నెక్స్ట్ జనరేషన్ వాటర్ యాక్షన్ ప్రోగ్రామ్‌లో భారతదేశం తరఫున పాల్గొననున్నారు.ఈ చాలెంజ్ కింద 400 మందికి పైగా దరఖాస్తుదారులు ఇందులో తమ దరఖాస్తులు సమర్పించారు. దేశవ్యాప్తంగా ఇందులో 10 భారతీయ టీమ్‌లను గుర్తించారు. వీరిలో 6 విద్యార్ధి బృందాలు , 4 స్టార్టప్ టీమ్ లు ఉన్నాయి.
ఎంపికైన బృందాలతో నెక్స్ట్ జనరేషన్ వాటర్ యాక్షన్ గా భారత్ తరఫున పాల్గొనేందుకు ఏర్పడ్డాయి. దీనిని డిటియు అనుబంధంతో , వివిధ విశ్వవిద్యాలయాలలోని యువ ప్రతిభాంతులతో అలాగే 5 దేశాల ఇన్నోవేషన్ హబ్ తో రూపుదిద్దుకున్నది .( అవి ఇండియా, డెన్మార్క్, కెన్యా, ఘనా, దక్షిణ కొరియా దేశాలు) , స్మార్ట్, సౌకర్యవంతమైన జీవనానికి అనుకూలమైన నగరాల దిశగా నీటి సంబంధిత పరిష్కారాల సాధనకు వినూత్న సామర్ధ్యాలు, పరిష్కారాలను కనుగొనడం, తమ సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించినది ఇది.
భారతదేశ ఛాలెంజ్ లో భాగంగా , విద్యార్ధులు, స్టార్టప్ బృందాలను ఆహ్వానించి దిగువ పేర్కొన్న అంశాలపై వారి ఆలోచనలను పంచుకోవలసనదిగా కోరడం జరిగింది. అవి, డిజిటల్ వాటర్ మేనేజ్‌మెంట్ పరిష్కారాలు, నగర నీటిసరఫరాలో లీకేజిలను అరికట్టడం, దానిని పర్యవేక్షణ, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో వృధా నీటి నిర్వహణ, గ్రామ, పట్టణ ప్రాంతాలలో వాన నీటి సంరక్షణ, సురక్షిత , నిరంతరాయ తాగునీటి సరఫరా వంటి అంశాలపై వారి ఆలోచనలను పంచుకోవలసిందిగా ఆహ్వానించడం జరిగింది.
ఇండియా ఈ చాలెంజ్‌లో పాల్గొనేవారని పంపడంతో పాటు, ఈ ఛాలెంజ్‌కి హోస్ట్‌గా కూడా ఉంటోంది. ఎఐఎం- ఇండియా, ఘనా లోని ఘనా వాటర్ కంపెనీ, బ్రెజిల్‌కు చెందిన రాంబోల్ ఫౌండేషన్, డెన్మార్క్‌కు చెందిన గ్రండ్స్‌ఫోస్ ఫౌండేషన్ , దక్షిణ కొరియాకు చెందిన దాగు మెట్రోపాలిటన్‌లకు ఈ ఛాలెంజ్ హోస్ట్‌గా ఉంటోంది.వివిధ దేశాలకు చెందిన ఎంపికైన బృందాలు ఛాలెంజ్ భాగస్వాములతో కలిసి పనిచేశాయి.
ఇండియా , చాలెంజ్ పార్టనర్‌గా మూడు భారతీయ స్టూడెంట్ టీమ్‌లను , డెన్మార్క్, దక్షిణ కోరియాలనుంచి ఒక్కొక్క టీమ్‌ను హోస్ట్ చేసింది. ఈ బృందాలు భారత్ కు ప్రత్యేకించి న సవాళ్లకు సంబంధించి పరిష్కారాలను కనుగోనేందుకు పనిచేశాయి. అదనంగా, ఒక భారతీయ బృందం ఘనా, డెన్మార్క్, బ్రెజిల్ ప్రత్యేకంగా గలా సవాళ్లపై పాల్గొంటున్నది.
ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో 11 స్టార్టప్ టీమ్‌లు పాల్గొన్నాయి. ఇందులో నాలుగు ఇండియా నుంచి కాగా 3 డెన్మార్క్ నుంచి, 2 కెన్యా నుంచి, మరో రెండు ఘనా నుంచి ఉన్నాయి. స్టార్టప్ టీమ్‌లు అంతర్జాతీయ స్థాయిలో ఇన్నొవేషన్ అవార్డులకు తదుపరి జనరేషన్ వాటర్ యాక్షన్ ఫైనల్స్‌కు పోటీపడ్డాయి. ఇండియా నుంచి పాల్గొన్న నాలుగు స్టార్టప్ టీమ్‌లలో ఆగ్రోమార్ఫ్, డిజిటల్ ఎకో ఇన్నొవేషన్, ట్రాన్‌కార్ట్ సొల్యూషన్, మెసెంట్రో ఉన్నాయి. ఎఐఎం అకడమిక్ భాగస్వాములుగా ఐఐటి ఢిల్లీ, ఐఐటి బొంబాయి, ఐఐటి మద్రాస్ లోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ క్లియర్ వాటర్ ,ఇంక్యుబేటర్ భాగస్ఆములైన ఎఐసి సంగం, ఎఐసి ఎఫ్ఐఎస్ ఇ లను ఈ టీమ్‌లకు మార్గనిర్దేశం వహించేందుకు రంగంలోకి దించింది. ఇండియా సమస్యలపై పనిచేస్తున్న బృందాలకు , జల సంరక్షణ రంగంలోని నిష్ణాతులతో మెంటార్‌షిప్ ఇప్పించారు. అదనపు మద్దతును వర్చువల్ నాలెడ్జ్, మెంటార్‌షిప్, నెట్ వర్కింగ్ సెషన్ ల ద్వారా నెక్స్‌ట్ జనరేషన్ వాటర్ యాక్షన్ టీమ్ అందించింది.
ఈ బృందాలు తమ ఫైనల్ ఆవిష్కరణలకు సంబంధించిన వివరాలను 2021 ఏప్రిల్ 30న సమర్పించాయి. ఇందుకు ఈ బృందాలు మూడు నెలల పాటు నిర్విరా మ కృషి చేశాయి. 2021 ఫిబ్రవరి -ఏప్రిల్ మధ్య వీటి కృషి కొనసాగింది. 2021 మే 12న గ్లోబల్ సెమీ ఫైనల్స్‌లో పాల్గొన్నాయి. ఇందులో పాల్గొన్న 6 భారతీయ విద్యార్ధి బృందాలలో 4 బృందాలను ఫైనల్స్‌కు ఎంపిక చేశారు.
స్టార్టప్ టీమ్‌లు నేరుగా గ్లోబల్ ఫైనల్స్‌లో పాల్గొన్నాయి. ఈ ఈవెంట్‌ను డిటియు 2021 మే 18 న నిర్వహించింది. ఈ ఫైనల్ ఈవెంట్ డెన్మార్క్ టెక్నికల్ యూనివర్సిటీలో జరిగింది. ఇందులో స్థానిక హబ్‌లనుంచి 5 దేశాలు పాల్గొన్నాయి. ఇండియా తన ఫైనల్స్ ను వర్చువల్ గా నిర్వహించింది. పైనల్ ఈవెంట్‌లో భాగంగా పానల్ డిస్కషన్‌ను మిషన్ డైరక్టర్, అటల్ ఇన్నొవేషన్ మిషన్ డాక్టర్ చింతన్ వైష్ణవ్ నిర్వహించారు.
ఫైనల్ ఈవెంట్ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ చింతన్, నీటి సంబంధింత ఆవిష్కరణలలో పాల్గొన్న వారందరి కృషిని నేను అభినందిస్తున్నాను. సాంకేతికంగా , వ్యాపార పరంగా అనువైన నమూనాలు రూపొందడానికి ఎంతో కృషి , సృజనాత్మకత అవసరం. ఈ సందర్భంగా ఇన్నొవేషన్ సెంటర్ డెన్మార్క్ ఈ కార్యక్రమానికి హహోస్ట్‌గా ఉన్నందుకు కృతజ్ఞతలు అని తెలిపారు.
ప్యానలిస్టులు భారతదేశంలో భవిష్యత్ వాటర్ టెక్నాలజీలపై తమ ఆలోచనలను పంచచచుకున్నారు. ప్యానల్ చర్చ అనంతరం గ్లోబల్ ఫైనల్ ఈవెంట్ జరిగింది. ఇందులో అన్ని పాల్గొనేందుకు ఆసక్తి తెలిపిన అన్ని దేశాలు, భాగస్వాములు, ఇన్నొవేటర్లు పాల్గొన్నాయి. డాక్టర్ చింతన్ వైష్ణవ్ , కీలకోపన్యాసకర్తగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారినుద్దేశించి ప్రసంగించారు. అలాగే ఇండియన్ ఛాలెంజ్ విజేతలను అభినందించారు.
క్రింద పేర్కొన్న టీమ్‌లు నెక్స్ట్ జనరేషన్ వాటర్ యాక్షన్ ఫైనల్ ఈవెంట్‌లో ఫైనల్ విజేతలుగా నిలిచారు.
విద్యార్థి టీమ్‌లు :
1. యాక్సిలరేషన్ అవార్డు: వైశాలి, కౌశల్య. సొల్యూషన్ సస్టెయినబుల్ మేనేజ్‌మెంట్ బై అఫర్డబుల్ రికవరీ టెక్నాలజీ ( ఎస్.ఎం.ఎ.ఆర్.టి) పరిష్కారం.
2. అత్యంత ప్రామిసింగ్ పరిష్కారం : మిహిర్ పలవ్, ఏకత్వం టీమ్
3. ఇంటర్నేషనల్ వరల్డ్ వాటర్ కాంగ్రెస్ 2022 స్కాలర్‌షిప్‌లు : మిహిర్ పలవ్, ఎక్‌తావ్యామ్ టీమ్ . వారు వాటర్ గవర్నెన్స్ కు సంబంధించి టెక్నాలజీతో కూడిన మల్టీస్టేక్ హోల్డర్ ప్లాట్‌ఫాంకు లభించింది.
స్టార్టప్ టీమ్‌లు :
1. ఐదు అత్యున్నత స్టార్టప్‌లు : రెండు భారతీయ స్టార్టప్‌లు ఆకాంక్ష అగర్వాల్ నేతృత్వంలోని ఆగ్రోమార్ఫ్, మాన్సి జైన్ నేతృత్వంలోని డిజిటల్ ఇకోఇన్నొవిజన్‌లు ఎంపికచేసిన ఐదు అత్యున్నత స్టార్టప్‌లలో ఉన్నాయి.
2. ఇంటర్నేషనల్ వరల్డ్ వాటర్ కాంగ్రెస్ 2022 స్కాలర్‌షిప్‌లు : ఆకాంక్ష అగర్వాల్ నేతృత్వంలోని ఆగ్రోమార్ఫ్ ఎంపికైంది.
ఇండియా నుంచి అటల్ ఇన్నొవేషన్ మిషన్, నీతిఆయోగ్ అలాగే ఇన్నొవేషన్ సెంటర్ డెన్మార్క్ లమధ్య భాగస్వామ్యం ఇండియా, డెన్మార్క్ గ్రీన్ స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ విస్తృత లక్ష్యాలలో భాగంగా రూపుదిద్దుకుంది. ఇందుకు సంబంధించిన స్టేట్‌మెంట్ ఆఫ్ ఇంటెంట్ (ఎస్.ఒ.ఐ)పై రెండు పక్షాలు 2021 ఏప్రిల్ 12 న సంతకాలు చేశాయి. ఎఐఎం, ఐసిడికె సంస్థలు పర్యావరణం, సుస్థిరాభివృద్ధిపై విస్తృత మంచి లక్ష్యాలకోసం కలసి పనిచేయడం కొనసాగించనున్నాయి.
***
(Release ID: 1720121)
Visitor Counter : 228