భారత పోటీ ప్రోత్సాహక సంఘం
కోవిడ్ మహమ్మారి కారణంగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సాధారణ) నిబంధశనలు, 2009లో పొందుపరిచిన నిబంధన 35కు అనుగుణంగా వర్తమాన గోప్యతా పద్ధతిని సమీక్షించేందుకు ప్రజల నుంచి వ్యాఖ్యలకు ఆహ్వానం
నాడు పోస్టు చేయడమైనది:
18 MAY 2021 6:04PM by PIB Hyderabad
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) 13.04.2021న విడుదల చేసిన పత్రికా ప్రకటన సూచన ( https: //pib.gov.in/PressReleasePage.aspx? PRID = 1711420 లింకులో) పేర్కొన్న అంశం పై ప్రజా సంప్రదింపుల గోప్యత వలయం ఏర్పాటుకు వివరణాత్మక ముసాయిదా ప్రతిపాదనతో పాసాధారణ నిబంధనల సవరించిన నిబంధన 35 ముసాయిదాను కమిషన్ (www.cci.gov.in ) వెబ్‌సైట్‌లో పెట్టడం జరిగింది. ప్రజల నుంచి 12 మే 2021 నాటికి ప్రజల నుంచి వ్యాఖ్యలను ఆహ్వానించారు.
కోవిడ్ -19 నేపథ్యంలో తలెత్తుతున్న సమస్యల కారణంగా సమయాన్ని పొడింగించాలంటూ ఈ విషయంలో వివిధ భాగస్వాములు విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని, ప్రజల నుంచి వ్యాఖ్యల సమర్పణకు సమయాన్ని మరొక నెల పొడిగించిందని సంబంధిత వర్గాలన్నీ గమనించాలి. తదనుగుణంగా, ప్రజలు తమ వ్యాఖ్యలను atdregistry@cci.gov.in అన్న ఐడికి 12 జూన్, 2021 లోపల ఇ-మెయిల్ చేయవచ్చు.
***
(రిలీజ్ ఐడి: 1719786)
సందర్శకుల సూచీ సంఖ్య : : 167