సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

వివిధ రాష్ట్రాల్లో సేవ‌లందిస్తున్న‌ వృద్ధుల టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ 'ఎల్డర్‌లైన్' (14567)


2021 మే చివరి నాటికి అన్ని రాష్ట్రాల్లోనూ అందుబాటులోకి వ‌చ్చే అవకాశం

Posted On: 17 MAY 2021 3:20PM by PIB Hyderabad

ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న కోవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో వృద్ధుల‌ సమస్యలను పరిష్కరించడానికి సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ 'ఎల్డర్‌లైన్' ప్రాజెక్ట్ క్రింద ప్రధాన రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల వారీగా కాల్ సెంటర్లు ప్రారంభించింది. ఉత్త‌ర ప్ర‌దేశ్‌, మ‌ధ్య ప్ర‌దేశ్‌, రాజస్థాన్, త‌మిళ‌నాడు మరియు కర్ణాటకలోని త‌దిత‌ర‌ ప్రధాన రాష్ట్రాల్లో ఈ సౌకర్యం ఇప్పటికే పనిచేస్తోంది. తెలంగాణలో ఈ సౌకర్యం ఏడాదికి పైగా పనిచేస్తోంది. 2021 మే చివరి నాటికి అన్ని రాష్ట్రాల‌లో వాటిని క్రియాత్మకంగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కాల్ సెంటర్లను టోల్ ఫ్రీ నంబర్ 14567కు ఫోన్ చేయ‌డం ద్వారా చేరుకోవచ్చు. పెద్దలందరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాల‌ని సూచించ‌డ‌మైన‌ది. ఎల్డర్‌లైన్ అనేది టాటా ట్రస్ట్‌ మరియు ఎన్‌ఎస్ఈ ఫౌండేషన్ సౌజ‌న్యంతో పనిచేసే స‌దుపాయం.
కాల్ సెంటర్ల ప్రస్తుత స్థితి క్రింద ఇవ్వబడింది:

 

 

రాష్ట్రాలు

ప్రారంభించిన తేదీ

అధికారుల సంఖ్య

చర్య చేయగల కాల్‌ల సంఖ్య

సేవా అభ్యర్థనలు కోరిన‌వి

సేవా అభ్యర్థనలు పూరించిన‌వి

త‌మిళ‌నాడు

28 ఏప్రిల్‌, 2021

8

71

25

15

మధ్య‌ప్ర‌దేశ్‌

28 ఏప్రిల్‌, 2021

4

163

12

5

రాజ‌స్థాన్‌

28 ఏప్రిల్‌, 2021

4

25

8

3

క‌ర్ణాట‌క‌

28 ఏప్రిల్‌, 2021

3

122

6

1

ఉత్త‌ర ప్ర‌దేశ్‌

14 మే, 2021

6

94

13

7

           

 

 

******(Release ID: 1719485) Visitor Counter : 160