రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

తౌక్టే తుఫాను స‌న్న‌ద్ధ‌త‌ను కొన‌సాగిస్తున్న ఐఏఎఫ్‌

Posted On: 17 MAY 2021 8:30AM by PIB Hyderabad

తౌక్టే బీక‌ర తుఫానును ఎదుర్కొనే దిశ‌గా భార‌త వైమానిక ద‌ళం (ఐఏఎఫ్‌) త‌న స‌న్న‌ద్ధ‌త‌ను కొన‌సాగిస్తోంది. తౌక్టే తుఫాను స‌న్న‌ద్ధ‌త‌లో భాగంగా 16 మే 2021 (ఆదివారం) ఐఏఎఫ్‌ 167 మంది సిబ్బందిని రవాణా చేయడానికి 2 సీ -130 జే మరియు 1 ఏఎన్-32 విమానాల్ని రంగంలోకి దింపింది. ఈ విమానాల్ని కోల్‌కతా నుండి అహ్మదాబాద్‌కు 16.5 టన్నుల మేర ఎన్‌డీఆర్‌ఎఫ్ సామ‌గ్రిని ర‌వాణాకు ఉప‌యోగించారు. ఏఎన్‌ -32 ప్రస్తుతానికి అహ్మదాబాద్ వెళ్లే మార్గంలో ఉంది.
మరో సీ-130 జే, 2 ఏఎన్‌-32 విమానాలు 121 ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని, 11.6 టన్నుల లోడ్‌ను తీసుకొని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజయవాడ నుంచి అహ్మదాబాద్‌కు ప‌య‌న‌మ‌య్యాయి. దీనికి తోడుగా 2 సీ -130 జే విమానం దాదాపు 110 మంది ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని, 15 టన్నుల సరుకును పూణె నుంచి అహ్మదాబాద్‌కు రవాణా చేసింది.

 

***


(Release ID: 1719474) Visitor Counter : 202