ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ టీకా కేటాయింపు పై - తాజా సమాచారం
మే 16-31 తేదీల మధ్య కాలంలో, సుమారు 192 లక్షల కోవిడ్ టీకాలను రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా సరఫరా చేయనున్న - కేంద్ర ప్రభుత్వం
Posted On:
14 MAY 2021 12:49PM by PIB Hyderabad
దేశంలో ఇంతవరకు వినియోగించిన కోవిడ్-19 టీకా మోతాదుల మొత్తం సంఖ్య దాదాపు 18 కోట్లు (ఈ ఉదయం 7 గంటల వరకు రూపొందించిన తాత్కాలిక నివేదిక ప్రకారం - 17.93 కోట్లు) గా ఉంది. దేశంలో కోవిడ్-19 టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభమై విజయవంతంగా 118 రోజులు పూర్తయింది. ఈ కాలంలో, అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల సంయుక్త సహకార ప్రయత్నాల ద్వారా గుర్తించిన లబ్ధిదారులకు 17.89 కోట్ల మోతాదులను వేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా, 114 రోజుల్లో 17 కోట్ల లక్ష్యాన్ని చేరుకున్న వేగవంతమైన దేశంగా భారతదేశం నిలిచింది. ఈ లక్ష్యాన్ని చేరుకోడానికి అమెరికా కు 115 రోజులు పట్టగా, చైనాకి 119 రోజులు పట్టింది.
దేశంలో 2021 మే, 1వ తేదీ నుండి, "సరళీకృత ధర నిర్ణయం మరియు వేగవంతమైన జాతీయ కోవిడ్-19 టీకా వ్యూహం", అమలులో ఉంది. దీని ప్రకారం, అందుబాటులో ఉన్న మోతాదులలో 50 శాతం నిల్వలను రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు భారత ప్రభుత్వం ద్వారా ఉచితంగా సరఫరా చేయడానికి కేటాయించగా, మిగిలిన 50 శాతం నిల్వలు, టీకా తయారీదారుల నుండి రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రైవేట్ ఆసుపత్రులు ప్రత్యక్షంగా కొనుగోలు చేసుకోవడానికి వీలుగా అందుబాటులో ఉంటాయి.
వచ్చే 15 రోజుల్లో టీకాల వినియోగానికి అనుసరిస్తున్న విధానం, రెండవ మోతాదు టీకా తీసుకోవలసిన లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు టీకాల కేటాయింపును భారత ప్రభుత్వం నిర్ణయించింది. 2021 మే నెల, 16-31 తేదీల మధ్య కాలంలో, 191.99 లక్షల మోతాదుల టీకాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా సరఫరా చేయనున్నారు. వీటిలో 162.5 లక్షల మోతాదుల కోవిషీల్డ్ టీకాలు, 29.49 లక్షల మోతాదుల కోవాక్సిన్ టీకాలు ఉంటాయి.
ఈ కేటాయింపుల సరఫరా వివరాలు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. కేటాయించిన మోతాదులను హేతుబద్ధంగా, న్యాయంగా వినియోగించే విధంగా నిర్ధారించడం తో పాటు, టీకా వృధాను తగ్గించడానికి సంబంధిత అధికారులను ఆదేశించాలని, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది.
45 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల వారితో పాటు హెచ్.సి.డబ్ల్యూ.లు మరియు ఎఫ్.ఎల్.డబ్ల్యూ.ల కోసం ఉద్దేశించిన ఈ ఉచిత టీకా మోతాదుల యొక్క న్యాయమైన, గరిష్ట వినియోగం కోసం, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు, సమర్థవంతమైన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలనే ప్రాథమిక లక్ష్యంతో, రానున్న 15 రోజుల్లో అందుబాటులో ఉంచుతున్న ఈ ఉచిత టీకా మోతాదుల గురించి, వారికి, ముందుగానే తెలియజేయాలని, భారత ప్రభుత్వం సంకల్పించింది. ఇంతకూ ముందు 15 రోజుల కాలంలో అంటే, 2021 మే నెల 1-15 తేదీల మధ్య, మొత్తం 1.7 కోట్లకు పైగా టీకా మోతాదులను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా రాష్ట్రాలకు అందజేసింది.
వీటికి అదనంగా, 2021 మే నెలలో రాష్ట్రాలతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా ప్రత్యక్షంగా సేకరించడానికి మొత్తం 4.39 కోట్లకు పైగా మోతాదులు కూడా అందుబాటులో ఉన్నాయి.
*****
(Release ID: 1718671)
Visitor Counter : 240
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam