రైల్వే మంత్రిత్వ శాఖ

దేశానికి 7115 ఎంటీల మెడికల్ ఆక్సిజన్ ను అందించిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు

80 ఎంటీల ఆక్సిజన్ తో తమిళనాడుకు చేరనున్న తొలి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌

ఎన్‌సిఆర్ ప్రాంతంలో ఇప్పటివరకు 3900 ఎమ్‌టి ఎల్‌ఎమ్‌ఓను సరఫరా చేసిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు

పంజాబ్ కోసం 40 ఎంటీల ఎల్‌ఎమ్‌ఓను డెహ్రాడూన్ కు సరఫరా చేసిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్

ప్రతిరోజూ 800 ఎంటీల ఎల్‌ఎమ్‌ఓను అందిస్తున్న ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు

ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానా, తెలంగాణ, రాజస్థాన్ , ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఊపిరి పోసిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు

మహారాష్ట కు 407 ఎంటీలు, ఉత్తరప్రదేశ్ కు 1960 ఎంటీ, మధ్యప్రదేశ్ కు 361 ఎంటీ, హర్యానా కు 1135 ఎంటీ, తెలంగాణకు 188ఎంటీ, రాజస్థాన్ కు 72ఎంటీ, కర్ణాటక కు 120 ఎంటీ,ఢిల్లీకి 2748ఎంటీ ల ఆక్సిజన్ ను సరఫరా చేసిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు

Posted On: 13 MAY 2021 5:23PM by PIB Hyderabad

సమస్యలు, అడ్డంకులను దాటుకుంటూ దేశం వివిధ ప్రాంతాలకు అవసరమైన ఆక్సిజన్ ను భారత రైల్వేలు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా చేరవేస్తున్నాయి. ఇప్పటివరకు భారత రైల్వే 444 ట్యాంకర్లలో దాదాపు 7115 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌ఎంఓ) ను దేశంలోని వివిధ రాష్ట్రాలకు రవాణా  చేసింది. నిన్న  ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు దాదాపు 800 ఎంటీల ఎల్‌ఎంఓను దేశం వివిధ ప్రాంతాలకు రవాణా చేసాయి. 

115 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు తమ ప్రయాణాన్ని పూర్తి చేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఆక్సిజన్ సహకారాన్ని అందించాయి. 

సహాయం ఆర్ధించిన రాష్ట్రాలకు అతి తక్కువ కాలంలో ఎక్కువ పరిమాణంలో ఆక్సిజన్ ను రవాణా చేయాలన్న లక్ష్యంతో భారతీయ రైల్వేలు పనిచేస్తున్నాయి. 

ఇంతవరకు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు మహారాష్ట కు 407 ఎంటీలు, ఉత్తరప్రదేశ్ కు 1960 ఎంటీ, మధ్యప్రదేశ్ కు 361 ఎంటీ, హర్యానా కు 1135 ఎంటీ, తెలంగాణకు 188ఎంటీ, రాజస్థాన్ కు 72ఎంటీ, కర్ణాటక కు 120 ఎంటీ,ఢిల్లీకి 2748ఎంటీ ల ఆక్సిజన్ ను సరఫరా చేశాయి. 

దుర్గాపూర్ నుంచి 80 ఎంటీల ఎల్‌ఎమ్‌ఓ తో బయలుదేరిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ ఈ రాత్రికి తమిళనాడుకు చేరనున్నది. ఎన్‌సిఆర్ ప్రాంతంలో ఇప్పటివరకు 3900 ఎమ్‌టి ఎల్‌ఎమ్‌ఓను  ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు సరఫరాచేశాయి. 

ఆక్సిజన్ రవాణా అంశం సంక్లిష్ట సమస్యగా ఉంటుంది. దీనిని సకాలంలో సరఫరా చేయడానికి భారత రైల్వేలు అనేక చర్యలను తీసుకొంటున్నాయి.  ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ల సమాచారం ఎప్పటికప్పుడు మారుతూ వస్తుంది. ఈ రోజు రాత్రి మరికొన్ని  ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు తమ  గమ్యస్థానాలకు బయలుదేరనున్నాయి. 

***(Release ID: 1718371) Visitor Counter : 15