ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ వర్కింగ్ గ్రూప్ సిఫార్సు ఆధారంగా కోవీషీల్డ్ టీకా రెండు మోతాదుల మధ్య అంతరాన్ని 6-8 వారాల నుండి 12-16 వారాలకు విస్తరించారు
Posted On:
13 MAY 2021 4:28PM by PIB Hyderabad
డాక్టర్ ఎన్.కె. అరోరా అధ్యక్షతన సమావేశమైన కోవిడ్ వర్కింగ్ గ్రూప్, కోవీషీల్డ్ టీకా మొదటి మరియు రెండవ మోతాదుల మధ్య అంతరాన్ని 12-16 వారాలకు పొడిగించాలని సిఫారసు చేసింది. ప్రస్తుతం, కోవీషీల్డ్ టీకా రెండు మోతాదుల మధ్య అంతరం 6-8 వారాలుగా ఉంది.
అందుబాటులో ఉన్న వాస్తవ-జీవిత సాక్ష్యాల ఆధారంగా (ముఖ్యంగా యు.కె. నుండి), కోవీషీల్డ్ టీకా రెండు మోతాదుల మధ్య అంతరాన్ని 12-16 వారాలకు పెంచడానికి, కోవిడ్-19 వర్కింగ్ గ్రూప్ అంగీకరించింది. కాగా, కోవాక్సిన్ టీకా రెండు మోతాదుల మధ్య విరామంలో ఎటువంటి మార్పును సిఫార్సు చేయలేదు.
కోవిడ్ వర్కింగ్ గ్రూప్ లో ఈ కింది వ్యక్తులు సభ్యులుగా ఉన్నారు:
1. డాక్టర్ ఎన్. కె. అరోరా - డైరెక్టర్, ఐ. ఎన్.సి.ఎల్.ఈ.ఎన్. ట్రస్ట్;
2. డాక్టర్ రాకేష్ అగర్వాల్ - డైరెక్టర్ మరియు డీన్, జిప్-మెర్, పుదుచ్చేరి;
3. డాక్టర్ గగన్ దీప్ కాంగ్ - ప్రొఫెసర్, క్రిస్టియన్ వైద్య కళాశాల, వెల్లూరు;
4. డాక్టర్ జె పి ముల్లియాల్ - రిటైర్డ్. ప్రొఫెసర్, క్రిస్టియన్ వైద్య కళాశాల, వెల్లూరు;
5. డాక్టర్ నవీన్ ఖన్నా - గ్రూప్ లీడర్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ (ఐ.సి.జి.ఈ.బి), జె.ఎన్.యు, న్యూఢిల్లీ;
6. డాక్టర్ అమూల్య పాండా - డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ, న్యూఢిల్లీ;
7. డాక్టర్ వి. జి. సోమాని, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డి.సి.జి.ఐ), భారత ప్రభుత్వం.
నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్య) డాక్టర్ వి. కె. పాల్ అధ్యక్షతన, 2021 మే, 12వ తేదీన నిర్వహించిన సమావేశంలో కోవిడ్ టీకా నిర్వహణ పై ఏర్పాటైన జాతీయ నిపుణుల కమిటీ (ఎన్.ఈ.జి.వి.ఏ.సి) కోవిడ్ వర్కింగ్ గ్రూప్ సిఫార్సు ను అంగీకరించింది.
కోవీషీల్డ్ టీకా మొదటి మరియు రెండవ మోతాదుల మధ్య అంతరాన్ని 12-16 వారాలకు విస్తరించడానికి కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చేసిన ఈ సిఫార్సును కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అంగీకరించింది.
*****
(Release ID: 1718367)
Visitor Counter : 290
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada