ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ సహాయంపై తాజా సమాచారం
ప్రపంచసహాయాన్ని అత్యంత వేగంగా రాష్ట్రాలకు అందిస్తున్న కేంద్రం
ఇప్పటిదాకా 9000 కు పైగా ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లు; 11800 పైగా ఆక్సిజెన్ సిలిండర్లు; 19 ఆక్సిజెన్ తయారీ ప్లాంట్లు; 5698 వెంటిలేటర్లు; దాదాపు 4.22 లక్షల రెమిడిసెవిర్ ఇంజెక్షన్ల పంపిణీ
Posted On:
13 MAY 2021 4:51PM by PIB Hyderabad
దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా నివారణ దిశలో భారత్ చేస్తున్న కృషికి తోడుగా ప్రపంచం నలుమూలలనుంచి వివిధ దేశాలు, సంస్థలు పంపుతున్న విరాళాలు, సహాయ సామగ్రిని భారత ప్రభుత్వం ఏప్రిల్ 27 నుంచి అందుకుంటోంది. సంపూర్ణ పాలన లక్ష్యంగా అందరికీ ఈ సహాయం ఒక క్రమ పద్ధతిలో అందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వశాఖలు ఈ సహాయాన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపటంలో సమన్వయంతో పనిచేస్తున్నాయి.
ఏప్రిల్ 27 నుంచి మే 12 దాకా మొత్తం 9294 ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లు; 11835 ఆక్సిజెన్ సిలిండర్లు; 19 ఆక్సిజెన్ తయారీ ప్లాంట్లు; 6439 వెంటిలేటర్లు; దాదాపు 4.22 లక్షల రెమిడిసెవిర్ ఇంజెక్షన్లు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ జరిగాయి. రోడ్డు, వాయు మార్గాల ద్వారా ఈ పంపిణీ కొనసాగుతోంది.
కువైట్, సింగపూర్, గిలియాడ్, స్విట్జర్లాండ్, స్పెయిన్, ఈజిప్ట్ దేశాలనుంచి 12 వ తేదీన అందిన ప్రధాన సహాయ సామగ్రి ఇలా ఉంది:
- రెమిడి సెవిర్: 86,595
-ఆక్సిజెన్ సిలిండర్లు: 4,802
- ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లు: 10
- వెంటిలేటర్లు: 141
తక్షణమే సమర్థవంతంగా రాష్టాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయించటం, పంపిణీ చేయటం అన్నవి అవిచ్ఛిన్నంగా సాగే ప్రక్రియ. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సమగ్రంగా ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంది. మంత్రిత్వశాఖ ఇందుకోసం ప్రత్యేకంగా ఒక సమన్వయ విభాగాన్ని ఏర్పాటు చేసింది. విదేశీ సహాయాన్ని అందుకోవటం, దాన్ని పంపిణీ చేయటం లాంటివి పర్యవేక్షిస్తుంది. ఏప్రిల్ 26 నుంచి ఈ విభాగం పనిచేయటం ప్రారంభమైంది. మే 2వ తేదీ నుంచి ప్రామాణిక ఆచరణావిధానాలు రూపొందించి అమలు చేస్తోంది.
అంతర్జాతీయ సహాయాన్ని రాష్టాలు, కేంద్రపాలితప్రాంతాలలోని ఆస్పత్రులకు తరలిస్తున్న దృశ్యాలు కొన్ని:
*****
(Release ID: 1718365)
Visitor Counter : 262